కాస్తా కూస్తో కామెడీ ,సాంగ్స్ కాస్తా కూస్తో కామెడీ ,సాంగ్స్ రొటీన్ స్టోరీ , స్క్రీన్ ప్లే

విలేజ్ నుండి సిటీకు వచ్చిన కుర్రాడు అర్జున్ (విశాల్) మొదటి చూపులోనే దివ్య (తమన్నా)ను ప్రేమిస్తాడు. ఆమె డిజిపి చంద్రబోస్ (జగపతి బాబు) చెల్లెలు. ఇక ఓ ఎటాక్ లో దేవా (సంపత్) దగ్గర నుండి పెద్ద మొత్తాన్ని రికవర్ చేస్తాడు. దివ్య వెంటపడుతున్న అర్జున్ ఎలాగోలా ఆమెను తన లవ్ లో పడేలా చేస్తాడు. చంద్రబోస్ కూడా వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పెళ్లికి సిద్ధం చేస్తాడు. ఇక్కడ ఓ సడెన్ ట్విస్ట్ తానో సిబిఐ ఆఫీసర్ అంటూ డిజిపి దగ్గర నుండి 250 కోట్ల రూపాయలను కాజేస్తాడు అర్జున్. అప్పుడు అసలు అతనెవరు అన్నది ఆలోచిస్తారు. అర్జున్ ఎందుకు డిజిపిని టార్గెట్ చేశాడు..? అర్జున్ అసలు ఎవరు..? అన్నది అసలు కథ. 

ఒక్కడొచ్చాడు సినిమాలో విశాల్ అర్జున్ పాత్రలో బాగానే చేశాడు. అయితే రెగ్యులర్ సినిమాల మాదిరిగానే ఆయన క్యారక్టరైజేషన్ ఉంటుంది. కొత్తగా ఏం అనిపించదు చేసినంతవరకు పర్వాలేదు. ఇక దివ్యగా తమన్నా కేవలం రెండు సీన్స్ నాలుగు పాటలు అన్నంతలా ఉంది. ఉన్నంతలో ఆమె స్క్రీన్ పై తన మెరుపులు చిందించింది. జగపతి బాబు, సంపత్ ల నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. వడివేలు కామెడీ కాస్త నవ్వులు తెప్పిస్తుంది. ఇక మిగతా వారంతా తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. 

సూరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చింది. అయితే కథ కథనంలో ఎలాంటి కొత్తదనం లేకుండా ఉంది. దర్శకత్వం ఓకే కాని స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఏం వర్క్ అవుట్ కాలేదు. ఇక కెమెరా మన్ వర్క్ బాగానే ఉంది. హిప్ హాప్ తమిజ మ్యూజిక్ ఓకే. తెలుగు అనువాదం అయినా కాస్త తమిళ సినిమా వాసన కొడుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే పర్వాలేదు.
కమర్షియల్ ఎంటర్టైనర్ చెప్పే క్రమంలో ఇలాంటి సినిమాలు ఇదవరకు చాలానే వచ్చుంటాయ్ అనే ఆలోచన వస్తే దర్శకుడు కచ్చితంగా కథనం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అయితే విశాల్ ఒక్కడొచ్చాడు సినిమాలో కథ పాతదే కథనం అదే పాత పంథాలో సాగుతుంది. సినిమా ఇంటర్వల్ బ్యాంగ్ కు పది నిమిషాల ముందు అసలు కథలోని ఎంటర్ అవుతుంది. అప్పటిదాకా సాగించిన స్క్రీన్ ప్లే అంతా రొటీన్ సోదిగా అనిపిస్తుంది.


ఇక హీరో హీరోయిన్ మధ్య సీన్స్ కూడా కొత్తగా ఏం లేవు. తమన్నా కేవలం సాంగ్స్ కోసమే అన్నట్టు ఉంది. సినిమాలో ట్విస్ట్ అది రివీల్ అయ్యే సమయానికి సినిమా మీద ఉన్న ఆడియెన్స్ మూడ్ కూడా పోతుంది. విశాల్ అన్ని సినిమాల కన్నా ఈ సినిమాలో అంత ప్రతిభ కనబరచలేదు. సినిమాలో కీ రోల్స్ అయిన జగపతి, సంపత్ ల నటన కాస్త హైలెట్ గా నిలిచింది.


సంవత్సరానికి ఇలాంటి కమర్షియల్ సినిమాలు చాలానే వస్తాయి అయితే ఇలాంటి కథల్లో కూడా ఆకట్టుకునే కథనం ప్లాన్ చేసుకుంటే బాగుండేది. అయితే దర్శకుడు మాత్రం కథ ఎలానో కథనం కూడా అలానే కానిచ్చేశాడు. ఇక సినిమాలో వడివేలు కామెడీ అంతగా వర్క్ ఆవుట్ కాలేదు. సినిమా తమన్నా గ్లామర్ కోసం వెళ్లినా నిరాశ చెందినట్టే. 


Vishal,Tamannaah,Suraaj,Hari,S. Nanthagopal,Hiphop Tamizhaఒక్కడొచ్చాడంటూ రొటీన్ గానే వచ్చిన విశాల్..

మరింత సమాచారం తెలుసుకోండి: