Bad Boy: Tweet Review || తెలుగు ట్వీట్ రివ్యూ || English Full Review

  ‘యుగానికి ఒక్కడు’, ‘నా పేరు శివ’, ‘ఆవారా’ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తీ. ఈ కార్తీ ఈ సారి ‘బ్యాడ్ బాయ్’ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం...! చిత్రకథ :     అలెక్స్ పాండ్యన్ [కార్తీ] దొంగతనాలు చేస్తూ బత్రుకుతుంటాడు. ఒకసారి 10 లక్షల రూపాయిలు తీసుకుని హెల్త్ మినిస్టర్ కుమార్తె [అనుష్క] ను కిడ్నాప్ చేస్తాడు. అసలు ఆమె ఎందుకు కిడ్నాప్ కు గురి అవుతుంది....?, కిడ్నాప్ జరిగిన తరువాత పరిస్థితులు ఎంటీ...? అన్న విషయాలను సినిమా చూసి తెలుసుకోవల్సిందే...!  

advertisements


నటీనటుల ప్రతిభ :     గతంలో కథాబలం, స్ర్కీన్ ప్లే బలం ఉన్న సినిమాలతో ఆకట్టుకున్న కార్తీ ఈసారి పక్కా మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతోనూ నటుడిగా ఆకట్టుకోవడానికి కార్తీ ప్రయత్నించాడు. అయితే మాస్ సినిమాలతో ఆకట్టుకోవడం అందరికీ సాధ్యం కాదు. అన్ని కలిసిరావాలి. అనుష్క పొషించిన పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఫస్టాఫ్ అంతా సంతానం చుట్టూ నడుస్తుంది. సంతానం పై చిత్రీకరించిన కామెడీ సన్నివేశాలు చాలా నాసిరకంగా ఉన్నాయి. మిగిలిన వారు పాత్రల పరిధిలో నటించారు. సాంకేతిక వర్గం పనితీరు :   ఫోటోగ్రఫీ బావుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ఆకట్టుకుంటుంది. నేపధ్యం సంగీతం ఆకట్టుకుంటే, పాటలు ఫర్వాలేదనిపిస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాతలు ఖర్చుపెట్టిన ధనానికి దర్శకుడు విలువ తీసుకుని రాలేకపోయాడు. సాదాసీదా కథను బోర్ కొట్టించే విధంగా తెరకెక్కించాడు. కార్తీ, అనుష్క, సంతానం... వంటి  విలువైన నటులను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. ఫస్టాఫ్ ను కామెడీతోనూ, సెకండ్ ఆఫ్ ను యాక్షన్ సన్నివేశాలతో మెప్పించాలని ప్రయత్నించాడు. అయితే రెండు విభాగాల్లో విఫలమయ్యాడు.   విశ్లేషణ :     సాధారణంగా తమిళ సినిమాల్లో అతి ఎక్కువగా ఉంటుందని, తమిళ తంబీలకు అలా ఉంటేనే ఇష్టమని సినిమా రంగంలో ఒక అభిప్రాయం ఉంది. అయితే తమిళంలో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ‘అలెక్స్ పాండ్యన్’ సినిమాలోని అతిని అక్కడి  ప్రేక్షకులే తట్టుకోలేకపోయారు. సినిమాలోని కామెడీ, యాక్షన్ దృశ్యాలు చాలా ఓవర్ గా ఉన్నాయనే వ్యాఖ్యలు వినిపించాయి. దీంతో దాదాపుగా అరగంట సినిమాను కట్ చేసి ఆ సినిమాను తెలుగులో ‘బ్యాడ్ బోయ్’గా విడుదల చేశారు. అయినా ఈ ‘బ్యాడ్ బోయ్’ మెప్పించలేని విధంగా ఉంది. సంతానం, అతని చెల్లులు, హీరో మధ్య సాగే హస్య సన్నివేశాలు చాలా నాసిరకంగా ఉన్నాయి. యాక్షన్ దృశ్యాలు కూడా మెప్పించే విధంగా లేవు. కథ గొప్పగా లేదు. పైగా స్క్రీన్ ప్లే చాలా నీరసంగా సాగింది. దర్శకుడు ట్విస్ట్ లు అనుకున్నవి మనకు అలా అనిపించవు. ముందు వచ్చే దృశ్యాలను మనం ఉహించుకోవచ్చు. సినిమా ప్రారంభం అయిన కొద్ది సేపటికే ఎప్పుడు ముగుస్తుందా అనే మూడ్ లోకి వచ్చేస్తాం.   చివరగా : ‘బ్యాడ్ బోయ్’ కాదు... వరస్ట్ బోయ్ ...!

More Articles on Bad Boy || Bad Boy Wallpapers || Bad Boy Videos


మరింత సమాచారం తెలుసుకోండి: