విజయ్ ఆంటోని , నటన సినిమాటోగ్రఫీవిజయ్ ఆంటోని , నటన సినిమాటోగ్రఫీహీరోయిన్, మ్యూజిక్ , స్క్రీన్ ప్లే

దేవరకొండ గాంధి (విజయ్ ఆంటోని) కులాంతర వివాహం చేసుకుని లీడింగ్ ఎమ్మెల్యే దగ్గర నమ్మకంగా ఉంటాడు. ఇక తర్వాత ఎమ్మెల్యేగా తన వారసుడు ఉన్నా సరే అతన్ని కాదని గాంధికి ఇవ్వాలని చూస్తాడు. కాని ఈ లోపే ఆ ఎమ్మెల్యే కొడుకు పథకం వేసి గాంధిని చంపేస్తాడు. ఇక అతని కొడుకు అశోక్ చక్రవర్తి (విజయ్ ఆంటోని) ఓ కేసు విషయంలో డూప్లికేట్ గా వెళ్తాడు. అక్కడ తనకు ఇద్దరు గ్యాంగ్ ల మధ్య గొడవలో ఇరుక్కుంటాడు. ఆ ఇద్దరు కలిసి ముందు అశోక్ ను లేపేయాలని చూస్తారు. ఈ క్రమంలో హీరోయిన్ గా చేస్తున్న అంజన (మీయా జార్జ్) పరిచయం ఏర్పడుతుంది. ఓ పక్క ఆమెకు వచ్చిన ఓ సమస్యను కాపడతాడు అశోక్. ఇక తనకు సపోర్ట్ గా కరుణాకరణ్ (త్యాగ రాజన్)అనే ఎక్స్ ఎమ్మెల్యే నిలుస్తాడు. చివరకు తానే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తాడు.  

విజయ్ ఆంటోని ఏ క్యారక్టర్ అయినా సరే అద్భుతంగా చేస్తాడు. బిచ్చగాడి పాత్రలోనే మెప్పించిన తను పొలిటిషియన్ గా కూడా అదరగొట్టాడు. సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో సినిమా మొత్తం తన మీదే నడిపించాడు. ఇక హీరోయిన్ మియా జార్జ్ పర్వాలేదు. హీరోయిన్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. సినిమాలో త్యాగరాజన్ క్యారక్టర్ అదిరిపోయింది. తన పాత్రకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు ఆయన. విలన్ గా నటించిన పాత్ర కూడా బాగా చేశాడు. ఓవరాల్ గా సినిమా నటీనటుల పరంగా బాగానే ఉంది.

యమన్ దర్శకుడు జీవ శంకర్ ప్రస్తుత తమిళ రాజకీయాల మీద ప్రభావం చూపేలా సినిమా తీశారు. కథ కన్నా కథనం మీదే ఎక్కువ సినిమా నడుస్తుంది. దర్శకుడు స్క్రీన్ ప్లే మీద ఇంకాస్త దృష్టి పెట్టాల్సి ఉంది. మ్యూజిక్ ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్ కూడా సినిమాను ట్రిం చేస్తే బాగుండేది అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే.
ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తీశారని అనిపిస్తుంది. అంతేకాదు రాజకీయంలో ఉండే కుట్రలు కుతంత్రాలు ఎలా అని కళ్లకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు. అయితే కథనం సాగించిన తీరు ఇంకాస్త పకడ్బందీగా ఉంటే బాగుండేది. 

బిచ్చగాడు తర్వాత బేతాళుడు ఆ తర్వాత యమన్ తన క్యారక్టరైజేషన్ విషయంలో విజయ్ ఆంటోని కొత్తగా ట్రై చేయడం బాగుంది. కాని ఈ సినిమాలో కథ అంత ఇంపాక్ట్ కలుగచేయలేదు. ఇక కథనం మీద నడిపించాల్సిందంతా అంతగా కుదరలేదు. సినిమాలో పాటలు కూడా అసలు బాలేదు. తమిళనాడులో ఇవి వర్క్ అవుట్ కావొచ్చు కాని తెలుగులో మాత్రం ఇలాంటి పాటలు నడువవు. 

ఇక ఎంటర్టైనింగ్ విషయంలో కూడా అక్కడక్కడ బోర్ కొట్టించక మానదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఓ మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తులకు వార్నింగ్ ఇవ్వడం అంతా సినిమాటిక్ గా అనిపిస్తాయి. రెగ్యులర్ సినిమాలా కాకున్నా కథనం కొత్తగా ట్రై చేసి ఉంటే సినిమా సక్సెస్ అయ్యి ఉండేది. 
Vijay Antony,Mia George,Jeeva Shankar,A. Subaskaran,Fatima Vijay Antonyయమన్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: