జీవా, కాజల్ నటన, కామెడీ సీన్స్జీవా, కాజల్ నటన, కామెడీ సీన్స్రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే
అరవింద్ (జీవా), దివ్య (కాజల్)లు చిన్న నాటి స్నేహితులుగా ఉండి ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి అయిన మరునాడే ఇద్దరి మధ్య గొడవై అది విడాకుల దాకా వెళ్తుంది. ఇద్దరు విడిపోయిన తర్వాత ఓ రెండేళ్లు ఫారిన్ వెళ్లొస్తుంది దివ్య. అరవింద్ హోటెల్ మేనేజ్మెంట్ పూర్తి చేసి ఓ రెస్టారెంట్ కు ఓనర్ అవుతాడు. ఇద్దరి మధ్య గ్యాప్ రావడంతో దివ్య తల్లి రాశి ఆమెకు అర్జున్ (బాబి సింహా) తో పెళ్లి ఫిక్స్ చేస్తుంది. అరవింద్ తో డైవర్స్ తీసుకోడానికి వచ్చిన దివ్య అతని పెట్టిన కండీషన్స్ కోసం అతనితోనే ఉంటుంది. ఫైనల్ గా దివ్య అరవింద్ లు విడాకులు తీసుకున్నారా..? దివ్యను మళ్లీ పెళ్లి చేసుకునేందుకు వచ్చిన అర్జున్ ఎలాంటివాడు..? అసలు వీరి కథకు ఎలా ముగింపు వచ్చింది అన్నది అసలు సినిమా. 



అరవింద్ గా జీవా పాత్రకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు. ఓ లవర్ గా జీవా క్యారక్టర్ చాలా సినిమాల్లో చూసినట్టుంటుంది కాని జీవా వరకు పర్ఫెక్ట్ గా చేశాడు. ఇక దివ్య గా కాజల్ సినిమాకే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. సినిమాలో కాజల్ కాస్త హాట్ గా కనిపిస్తుంది అన్న మాట వాస్తవం. ఇక అరవింద్ ఛాన్స్ ఇస్తే అతని పెళ్లి చేసుకునే పాత్రలో దీపగా నటించి మెప్పించింది సునయన. అర్జున్ గా బాబి సింహా పాత్ర చిన్నదే కాని మెప్పించాడు. ఇక కమెడియన్ ఆర్జే బాలాజీ కామెడీ బాగుంది ఇరగదీశాడు. అతని కామెడీతోనే సినిమా నడిచిందంటే నమ్మాలి.    

 

ఎంతవరకు ఈ ప్రేమ డైరక్టర్ డీకే కథ రొటీన్ గా ఉన్నా దాన్ని నడిపించిన తీరు పర్వాలేదు. అయితే తెలుగులో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి కాబట్టి అంతగా ఇంప్రెస్ చేయదు. టెక్నికల్ గా సినిమా మ్యూజిక్ యావరేజ్ గా ఉంది. కెమెరా మన్ పనితనం పర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.


దర్శకుడు డికే అనుకున్న కథ చాలా పాతదని చెప్పాలి. అయితే అనుకున్న కథకు అనవసరపు హంగులు అద్దకుండా కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా నడిపించాడు. ముఖ్యంగా కొన్ని కామెడీ సీన్స్ ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తాయి. కాని సినిమా హిట్ అయ్యేందుకు ఆ స్టఫ్ సరిపోదు. హీరో హీరోయిన్ మధ్య ఉన్న లవ్ ను చూపించడంలో విఫలమయ్యాడు డైరక్టర్.


క్లారిటీ మిస్ అవడంతో సినిమా రెగ్యులర్ రొటీన్ డ్రామాగా ఉంటుంది. ఇక కొన్ని లాజికల్ లేని సందర్భాలు కనిపిస్తాయి. ఒక సీన్ లో హీరో హీరోయిన్ కలిసి ఉన్నారు అనుకునే లోపే అతనితో గొడవపడి విడాకులు అడగడం కాస్త సిల్లీగా అనిపిస్తుంది. ముఖ్యంగా పెళ్లి తర్వాత వైన్ షాప్ దగ్గర గొడవతో ఇద్దరు విడాకుల దాకా వెళ్లడం అసలు సందర్భోచితం అనిపించదు.


కాసేపు సరదాగా నవ్వుకునే వారికి ఎంతవరకు ఈ ప్రేమ పర్వాలేదు అనిపిస్తుంది కాని కచ్చితంగా చూడాల్సిన సినిమా అయితే కాదు.


Jiiva,Bobby Simha,Kajal Aggarwal,Deekay,Elred Kumar,Leon James'ఎంతవరకు ఈ ప్రేమ' కాసిన్ని నవ్వుల కోసమే తప్ప మ్యాటర్ ఏం లేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: