Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Oct 17, 2017 | Last Updated 3:10 pm IST

Menu &Sections

Search

గౌతమ్ నంద : రివ్యూ

- 2/5
గౌతమ్ నంద : రివ్యూ ఈ సినిమా రివ్యూ ను తెలుగులో చదవండి

What Is Good

  • యాక్షన్ సీన్స్
  • హీరోయిన్స్ గ్లామర్

What Is Bad

  • స్క్రీన్ ప్లే
  • ఎడిటింగ్
  • సెకండ్ హాఫ్ నేరేషన్
Bottom Line: మాస్ ప్రియులనే మెప్పించే గౌతం నంద..!

Story

ప్రపంచం ధనవంతులలో ఒకరైన కృష్ణ మూర్తి కొడుకు గౌతం (గోపిచంద్) జల్సా జీవితాన్ని గడుపుతుంటాడు. డబ్బు తప్ప ఎలాంటి ఎమోషన్స్ ఉండని గౌతం కు ఓ సందర్భంలో తను ఎవరు అన్న విషయం తెలుసుకోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో తన పోలికలతో ఉన్న నందని చూసి షాక్ అవుతాడు. బస్తీలో పేదరికం అనుభవిస్తున్న నంద ప్లేస్ లో గౌతం.. గౌతం ప్లేస్ లో నంద వెళ్తారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఇద్దరు పాత్రలు మార్చుకున్నాక జరిగిన కథ ఏంటి..? ఇద్దరికి ఎదురైన అనుభవాలే ఈ సినిమా కథ.

Star Performance

గౌతం, నంద రెండు పాత్రల్లో గోపిచంద్ అదరగొట్టాడు. కచ్చితంగా గౌతం నంద సినిమాలో ఓ కొత్త గోపిచంద్ ను చూడొచ్చు. సినిమా మొత్తం తన భుజాల మీదే వేసుకుని నడిపించాడు. ఇక హీరోయిన్స్ హాన్సిక, కేథరిన్ లు గ్లామర్ కోసమే అన్నట్టు అనిపిస్తుంది. బిత్తిరి సత్తి కాస్త నవ్వించే ప్రయత్నం చేయగా సీనియర్ నటులు తణికెళ్ల భరణి, చంద్ర మోహన్ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. 

Techinical Team

సినిమాలో దర్శకుడు రాసుకున్న కథ పాతదే అయినా కథనం కాస్త కొత్తగా రాసుకున్నాడు. ఇక సౌందర్ రాజన్ కెమెరా వర్క్ బాగుంది. సినిమా అంతా చాలా స్టైలిష్ గా ఉంటుంది. థమన్ మ్యూజిక్ ఎప్పటిలానే రెండు పాటలు బాగున్నాయి. ఎడిటింగ్ ఓకే.. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. 

Analysis

కథలో ఇద్దరు అచ్చు గుద్దినట్టు ఉండటం వారి వారి పరిస్థితుల కారణంగా ఒకరి ప్లేస్ లో మరొకరు వెళ్లడం లాంటి కథలు చాలానే చూశాం. అయితే ఇదో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించడంలో నడిపిన కథనం కాస్త పర్వాలేదు అనిపిస్తుంది. దర్శకుడు రాసుకున్న కథ పాతదే అయినా కథనంలో మాత్రం కాస్త కొత్తదనం చూపించాడు. 

అయితే సినిమా నడిపించిన తీరు మొదటి భాగం బాగానే ఉన్నా సెకండ్ హాఫ్ లో లాగినట్టు అనిపిస్తుంది. సెంటిమెంట్ ఎక్కువయ్యే సరికి కాస్త స్లో అనిపిస్తుంది. మళ్లీ సినిమాను ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో పట్టు సాధించాడు. సినిమాకు మరింత కామెడీ టచ్ ఇచ్చి ఉంటే ఇంకాస్త బాగా వచ్చేది.

సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్ గా మాస్ ఆడియెన్స్ కు నచ్చే అంశాలున్నాయి. ముఖ్యంగా గోపిచంద్ ఫైట్స్ అదరగొట్టాడు. అయితే అక్కడక్కడ కొన్ని లాజిక్కులు మిస్ అవడం ఆడియెన్ గమనిస్తాడు. ఓవరాల్ గా గోపిచంద్ తనకు నచ్చిన మాస్ ఎలిమెంట్స్ తో గౌతం నంద తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Cast & Crew

3 / 5 - 4991
Add To Favourite

APHERALD EXCLUSIVE MOVIE REVIEWS