సునీల్ , ప్రకాశ్ రాజ్ , ప్రొడక్షన్ వాల్యూస్సునీల్ , ప్రకాశ్ రాజ్ , ప్రొడక్షన్ వాల్యూస్రొటీన్ స్టోరీ , సెకండ్ హాఫ్ , క్లైమాక్స్
రాంబాబు (సునీల్) చిన్నప్పటి నుండి భయస్తుండిగా ఉంటాడు. ఇక తాత మాటలతో ధైర్యవంతుడిగా మారిన రాంబాబు ఓ ట్రావెల్ ఏజెన్సీ పెట్టి లాభాలు ఘడిస్తాడు. తను నమ్మే బాదం బాబా (పోసాని) వల్లే ఇది జరుగుతుందని ఆయన్ను పూర్తిగా నమ్మేస్తాడు. అయితే అనుకోకుండా రాంబాబు జీవితంలో కొన్ని అనుకోని మార్పులు వస్తాయి. సడెన్ గా తనకు లాస్ వస్తుంది. దీనికి పరిష్కారంగా బాదం బాబా సలహా తీసుకోగా తనకు అదృష్టం తెచ్చే అమ్మాయిని చూసి పెళ్లిచేసుకో అంటాడు.

ఈ క్రమంలో తన ఆఫీస్ లో మేనేజర్ గా చేరిన సావిత్రి (మియా జార్జ్)ను చూసి ఇష్టపడతాడు రాంబాబు. ఆమె కూడా ముందు నిరాకరించినా ఫైనల్ గా రాంబాబుకి కనెక్ట్ అవుతుంది. ఇక్కడే అసలైన ట్విస్ట్.. ఆమె ఒప్పుకున్నా సావిత్రి తండ్రి రంగ (ప్రకాశ్ రాజ్) ఒప్పుకోడు. రైతుల భూమి కోసం పోరాడే రంగ మనసు గెలుచుకునేందుకు రాంబాబు ఏం చేశాడు..? చివరకు రంగ రాంబాబుని ప్రేమను ఒప్పుకున్నాడా.. లేడా అన్నది తెర మీద చూడాల్సిందే.

సునీల్ రాంబాబు పాత్రలో తన మార్క్ కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. అయితే హీరోయిజం అనేది చూపించడంలో సునీల్ ఎప్పుడు విఫలమవుతున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం మెచ్చుకునేలా ఉంది. ఇక దర్శకుడు సునీల్ కామెడీ టైమింగ్ ను బాగానే వాడాడు. మియా జార్జ్ కూడా బాగానే చేసింది. ముఖ్యంగా ప్రకాశ్ రాజ్ సినిమాలో కమ్యునిస్ట్ గా రైతుల కోసం పోరాడే వ్యక్తిగా బాగా నటించాడు. కొన్ని డైలాగ్స్ కూడా బాగా పేలాయి. పోసాని, వెన్నెల కిశోర్ లాంటి వారు కూడా బాగా నటించారు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించారు.

ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న క్రాంతి మాధవ్ ఈ సినిమా రొటీన్ కథ కథనాలతో తెరకెక్కించాడు. అభిరుచి గల దర్శకుడు అన్న పేరుని చెడగొట్టేలా ఈ సినిమా ఉంది. కథ కథలాల్లో ఎటువంటి కొత్తదనం ఉండదు. దర్శకుడిగా క్రాంతి మాధవ్ విఫల ప్రయత్నమే అని చెప్పాలి. సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ పర్వాలేదు అన్నట్టు ఉండగా గిబ్రాన్ మ్యూజిక్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఎడిటింగ్ కూడా సోసోగానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

క్రాంతి మాధవ్ అనగానే ఓ సెన్సిబుల్ డైరక్టర్ అన్న పేరు ఉంది. తను తీసిన మొదటి రెండు సినిమాలు ఆ క్రేజ్ తెచ్చాయి. అయితే ఆ ఇమేజ్ కు పూర్తి భిన్నంగా కమర్షియల్ పంథాలో ఈ ఉంగరాల రాంబాబు సినిమా చేశాడు. సునీల్ ఇమేజ్ దృష్టిలో ఉంచుకుని కథ రాసుకున్నట్టు అనిపించినా కథనంలో రొటీన్ పంథా కొనసాగించాడు.

సినిమాలో ప్రకాశ్ రాజ్ లాంటి గొప్ప నటుడు ఉన్నా ఆయన్ను వాడుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. ఇక సినిమా అంతా రొటీన్ గా నడిపించాడని అనిపిస్తుంది. ఎంటర్టైనింగ్ అంటూ వచ్చే కామెడీ కూడా సోసోగానే ఉంటుంది. సునీల్ టైమింగ్ అక్కడక్కడ బాగానే నవ్వులు తెప్పిస్తుంది. అయితే ఇదే తరహా కథలు చాలా వచ్చాయి కాబట్టి పెద్ద గా ఆడియెన్స్ త్రిల్ ఫీలయ్యే అవకాశం ఉండదు.

మరి బోర్ కొడితే తప్ప సినిమా చూసే అవకాశం ఉండదు. ఓ కమర్షియల్ సినిమాలో మెసేజ్ ఇద్దామని చూపిన క్రాంతి మాధవ్ ప్రయత్నం ఫలించలేదని చెప్పాలి.
Sunil,Miya George,Kranthi Madhav,Paruchuri Kireeti,Ghibranఉంగరాల రాంబాబు మళ్లీ రొటీన్ డబ్బానే..!

మరింత సమాచారం తెలుసుకోండి: