ఒక్క పాజిటివ్ పాయింట్ కూడా లేకపోవడం ఒక్క పాజిటివ్ పాయింట్ కూడా లేకపోవడం అన్నీ నెగిటివ్ పాయింట్సే ఉండటం

వరుణ్ , భాస్కర్ మరియు శ్రీ రామ్ ముగ్గురు స్నేహితులు ఒకరేమో పాటల రచయిత మరొకరు సంగీతం అంటే ఇష్టం మూడో వ్యక్తికి పెయింటింగ్ అంటే ప్రాణం ఇలా ఎవరి హాబీ లు వారికి ఉంటాయి ఇది కాకుండా ముగ్గురు ఇంజనీరింగ్ చదువుకుంటూ ఉంటారు . ఇలా ఉండగా వరుణ్ లిల్లీ అనే అమ్మాయిని ప్రేమించి మోసపోతడు అప్పుడు తాగేసి ఉన్న వరుణ్ ని ఓదార్చడానికి భాస్కర్ పాట రచించగా శరీరం దాన్ని పాటలా పడుతాడు అదే పాటను వరుణ్ ఒక పెయింటింగ్ లా మలచగ అది ఒక అందమయిన అమ్మాయి బొమ్మ అవుతుంది . ఆ బొమ్మకి ఇష్ట సఖి అని పేరు పెట్టుకుంటారు. అలంటి అమ్మాయి నిజంగా ఉంటె ఎవరు ముందు చూస్తే వాళ్ళ సొంతం అని ఒక ఒప్పందం చేసుకుంటారు. అప్పుడే వారికి ఎదురవుతుంది అను(అనుస్మ్రుతి) వివిధ పరిస్థితులలో ముగ్గురు వేరు వేరుగా అనుని చూసి ప్రేమలో పడిపోతారు అదే విషయం ఆ అమ్మాయికి చెప్పగా ఆ అమ్మాయి వీరి ప్రేమను ఒప్పుకోదు. ఎందుకంటే ఆ అమ్మాయికి గతంలోనే అజయ్(అజయ్) పెళ్లి అయిపోయి ఉంటుంది. ఇదిల ఉండగా ఆ అమ్మాయిని చంపడానికి ఒక గుండా ప్రయత్నిస్తుంటాడు అసలు అను ని చంపాలని గుండా ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? అజయ్ ఎవరు ? ఏమయ్యాడు ? అను గతాన్ని తెలుసుకున్నాక వరుణ్, భాస్కర్ మరియు శ్రీ రామ్ లు ఎలా స్పందించారు ? గుండా నుండి అను తప్పించుకుందా లేదా? అన్న ప్రశ్నలకి జవాబే ఇష్ట సఖి

అజయ్ ఉన్నదీ పది నిమిషాలే అయినా ఆ పది నిముషాలు అప్పటివరకు లేని "ఇది సినిమానే" అన్న భావన కలిగించగలిగాడు. కీర్తి శేషులు ఏ వి ఎస్ గారు కూడా ఈ చిత్రంలో ఉన్నారు అయన వంతు కృషి అయన చేసారు కానీ ఇంత నాసిరకమయిన పాత్రలో చూడవలసి వస్తుంది అనుకోలేదు ఖయ్యుం కూడా అయన వంతు పాత్ర అయన పోషించాడు. ఇది నటులు నటించారు అని చెప్పుకోగాలగిన వాళ్ళు , వీళ్ళు కాకుండా ఇంకొక బ్యాచ్ ఉంది శ్రీ రామ్ , వరుణ్ ,భాస్కర్ మరియు అను స్మృతి ఇంకా చాలా మంది నటనలో అ ఆ లు కూడా దిద్దినట్టు కనిపించదు ఒక టైమింగ్ ఉండదు ఒక ఎక్స్ప్రెషన్ ఉండదు. సింగల్ ఎక్స్ప్రెషన్ తో సినిమా మొత్తం నడిపించేశారు.

నటీనటులతో పోటీ పడి మరి ఫెయిల్ అయ్యారు ఒక్కొక్కరు దర్శకుడు భరత్ పారేపల్లి అయన గత చిత్రాలతో పోలిస్తే ఏ మాత్రం అంచనాలను తగ్గించలేదు అవి ఎలా అయితే ఆకట్టుకోలేకపోయాయో ఇది కూడా అలానే తెరకెక్కించాడు. కానీ ఒక అనుభవం కల దర్శకుడి నుండి ఇంత నాసిరకమయిన సినిమాని అసలు ఊహించము. పాత జంధ్యాల గారి చిత్రం "రెండు జెళ్ళ సీత"ను పోలినది కథ, నాలుగే సన్నివేశాలు ముఖ్యమయినవి ఉన్నాయంటే కథనం ఎంత వీక్ అని అర్ధం అయిపోవాలి. డైలాగ్స్ గురించి స్పెషల్ గ చెప్పుకోవాలి నటులు చెప్పడానికి అంత కష్టపడుతున్నారు అని తెలిసినా అంత పెద్ద పెద్ద డైలాగ్స్ రాయాలన్న ఆలోచనకి నమస్కారం. అవి కూడా సన్నివేశానికి బలం చేకూర్చక పోగా ప్రేక్షకుడిని విసిగించింది. కొన్ని సన్నివేశాలలో మాత్రమే సినిమాటోగ్రఫీ బాగుంది.

ఎడిటర్ ఇంకా చాలా అంటే ఒక వెయ్యి రెట్లు అధికంగా కష్టపడి కట్ చేసి ఉంటె సినిమా గంటలో అయిపోయేది ప్రేక్షకుడు హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. సన్నివేశానికి సంభంధం లేకుండా నేపధ్య సంగీతం ఇవ్వడం లిరిక్స్ కోసం పాటను పొడిగించడం లాంటి పనులు చేసి సంగీత దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. ఈ విభాగంలో ఎప్పుడు మాట్లాడని విభాగం లిరిక్స్, దీని గురించి ఎందుకంటే ఈ సినిమాలో మిగిలినవి అన్నీ బాగోలేకపోవడం మూలాన ఒక్కటన్నా పాజిటివ్ చెప్పాలని చెప్తున్న విభాగం ఇది ఈ చిత్రంలో లిరిక్స్ భావత్మకంగా ఉన్నాయి మరి తెరకెక్కించే సమయంలో అవి మరోలా తయారయ్యాయి అనుకోండి.. ఇలా ఎవరికీ వారు తీసిపోకుండా అందరు పోటీ పడి మరీ ఫెయిల్ అయ్యారు

ఒక్క పాజిటివ్ పాయింట్ కూడా లేకుండా సినిమా ఉంటుందా? , అనుమానమే అవసరం లేదు కచ్చితంగా ఉంటుంది ఇంకా డౌట్ ఉంటె వెంటనే దగ్గరలోని థియేటర్ కి వెళ్లి ఇష్ట సఖి సినిమా చూసేయండి. భరత్ పారేపల్లి అనగానే రెండు మూడు సినిమాలు తీసారు కదా కాస్త అనుభవం ఉంటుంది అనుకోని వెళ్ళిన ప్రేక్షకుడిని ముల్లోకాలు తిప్పి మూడు కోట్ల చుక్కల్ని చూపించడమే కాకుండా వాటిని వారి చేత లెక్క కూడా పెట్టించాడు. ఇక ఫస్ట్ హాఫ్ లో కనిపించే నటుల బ్యాచ్ ప్రతి ఒక్కరు "ప్రతి ఒక్కరు " (నొక్కి మరీ చెప్తున్నా ప్రతి ఒక్కరు) నా డైలాగ్ ఎప్పుడు వస్తుందా అని వేచి చూడటం రాగానే చెప్పేసి హమ్మయ్య నా పని అయిపోయింది అన్నట్టుగా కెమెరా వంక చూడటం ,ఎడిటర్ కి ఎక్కడ కట్ చేసుకోవాలో అన్నట్టుగా ఉంటుంది ప్రతి సన్నివేశం.

ఇది నటనలో ప్రాథమిక సూత్రం లాంటిది ఇదే పాటించలేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు ఇక... ఆ ... బ్యాచ్ .... డైలాగ్ .. డెలివరీ .. గురించి ... చెప్పాలంటే ... ఏంటి విసుగు అనిపిస్తుందా ప్రతి క్యారెక్టర్ ప్రోమ్టింగ్ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి... వెయిట్ చేసి డైలాగ్ లు చెప్పడం. ఇది ఎలా ఉంటుంది అంటే ఒక డైలాగ్ మొదలెట్టి మధ్యలో వెళ్లి భోంచేసి వచ్చి మిగిలిన డైలాగ్ చెప్పినంత గ్యాప్ ఉంటది అందులోనూ రచయిత కనికరం అనేది లేకుండా పెద్ద పెద్ద డైలాగ్ లు రచించారు.

అజయ్ ఉన్న పది నిముషాలు లేకపోయుంటే ఇదొక చిత్రం అనే ఫీలింగ్ కూడా రాదు.నిజానికి ఈ చిత్రానికి నెగెటివ్ లో రేటింగ్ ఇవ్వాలని ఉంది కాని అవకాశం లేక ఇస్తున్న రేటింగ్ ఇది. సింపుల్ గ చెప్పేస్తున్నా ఇది టాలీవుడ్ లో రావలసిన చిత్రం కాదు గరుడ పురాణంలో ఉండాల్సిన శిక్ష ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేం. ఈ చిత్రాన్ని చూడటం కన్నా ఇదే సమయాన్ని ట్యాంక్ బండ్ మీద ముక్కు మూసుకొని గడిపేస్తే ఇంకా ఆహ్లాదంగా ఉంటుంది...

Varun,Bhaskar,Sriram,Anusmriti,Bharat Parepalli,Ajayఇష్ట సఖి : చాలా కష్టమయిన సఖి ఇది

మరింత సమాచారం తెలుసుకోండి: