కామెడీ ,నేపధ్య సంగీతం ,రెండవ అర్ధ భాగంలో కొన్ని సన్నివేశాలు ,కొన్ని ట్విస్ట్ లు కామెడీ ,నేపధ్య సంగీతం ,రెండవ అర్ధ భాగంలో కొన్ని సన్నివేశాలు ,కొన్ని ట్విస్ట్ లు క్లైమాక్స్ ,ఊహించదగ్గ కథనం ,రొటీన్ కథ ,సాయి ధరం తేజ్ హావ భావాలు,సెకండ్ హాఫ్ లో అనవసరమయిన సన్నివేశాలు

రాష్ట్రంలో ఎన్నికల తరువాత కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అన్న ప్రస్తావన వస్తుంది కొంతమంది MLA లు ప్రబాకర్ (ప్రకాష్ రాజ్) కి సపోర్ట్ చెయ్యగా కొంతమంది గంగా ప్రసాద్ (షాయాజీ షిండే) కి మద్దతు తెలుపుతారు ఇదే సమయంలో గంగ ప్రసాద్ చేసిన అక్రమాలన్నింటిని "y" ఛానల్ జర్నలిస్ట్ షఫీ(షఫీ) బయటపెడతాడు. ఇదిలా నడుస్తుండగా పాలకొల్లు నుండి చదువుకోడానికి హైదరాబాద్ వచ్చిన శీను(సాయి ధరం తేజ్) ఆ ఊర్లో పెద్ద రౌడీ అయిన మైసమ్మ(జగపతి బాబు) దగ్గరకు వెళ్లి తనను చంపేయమని అడుగుతాడు. ఎందుకు అసలు కథేంటి అని మైసమ్మ అడుగగా తన కథ చెప్పడం మొదలు పెడతాడు ..

శీను తొలిచూపులోనే శైలు(రెజిన) ని ప్రేమిస్తాడు కాని శైలు మాత్రం శీను ని ప్రేమించాడు కాగా శీను ఎలాగయినా శైలు తనని ప్రేమించేలా చెయ్యాలని నానా ప్రయత్నాలు చెయ్యడం మొదలు పెడతాడు కాని శైలు మాత్రం అతన్ని ప్రేమించదు. ఒకానొక సమయంలో శైలు ని ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారన్న విషయం శీను కి తెలుస్తుంది.. ఎవరు చంపాలని ప్రయత్నిస్తున్నారు? ఎందుకు చంపాలి అని ప్రయత్నిస్తున్నారు? దానికి శీను ఎందుకు చనిపోవాలి అనుకుంటున్నాడు? అసలు ఈ కథకి ప్రభాకర్ మరియు గంగాప్రసాద్ ల పొలిటికల్ కథకి ఉన్న సంభంధం ఏంటి? అన్నదే మిగిలిన కథ ..

సాయి ధరం తేజ్ , ఇది తెర మీదకు వచ్చిన మొదటి చిత్రం అయినా ఇది అతనికి రెండవ చిత్రం.. మంచి ఎనేర్జటిక్ గా మరియు కాన్ఫిడెంట్ గా నటించారు ముఖ్యంగా డాన్స్ లు బాగా చేసారు. డైలాగ్స్ చెప్పే విధానం మరియు కామెడీ టైమింగ్ కూడా బాగుంది కాని అతని హావ భావాలూ మాత్రం ఇంకా చాలా మెరుగుపడాల్సి ఉంది. మైసమ్మ పాత్రలో జగపతి బాబు నటన బాగుంది అటు క్రూరంగా కనిపించడమే కాకుండా కామెడీ కూడా బాగా పండించారు. నిజానికి ఈ చిత్రం మొత్తం రెజిన మీదనే ఆధారపడి నడుస్తుంది కాని ఆమె పాత్రకి మాత్రం అంత ప్రాముఖ్యత కనపడదు.. కాని చిత్రానికి కావలసిన అందాన్ని అందించింది ఈ భామ హవాభావల్లో మంచి పరిపఖ్వత చూపించింది.. షఫీ పాత్ర మరియు అయన నటన రెండు బాగున్నాయి. రఘు బాబు కామెడీ చాలా బాగా పేలింది.. ప్రకాష్ రాజ్ పాత్ర కాసేపే ఉన్న ఆయన మీద చేసిన కామెడీకి చిత్రానికి సంబంధం ఉండదు.. సత్య కృష్ణ చేత చేయించిన కామెడీ పర్లేదు... షాయాజీ షిండే , జయప్రకాశ్ రెడ్డి , మెల్కోటే, పృథ్వి , చంద్రమోహన్, హేమ మొదలగు నటీనటులు వారి పాత్రల మేరకు ఆకట్టుకున్నారు...

కథ , కథనం మరియు దర్శకత్వం బాధ్యతలను ఏ ఎస్ రవి కుమార్ చౌదరి భుజాన వేసుకున్నారు , కథ విషయానికి వస్తే చాలా పాత కథ చాలా రొటీన్ ట్విస్ట్ లను ఎంచుకొని కథనం దగ్గర జాగ్రత్తపడ్డారు.. ఉన్న ట్విస్ట్ లను కాపాడుకుంటూ కామెడీ తో వర్క్ అవుట్ చేసుకుంటూ వచ్చారు. మొదటి అర్ధ భాగం కామెడీ చాలా బాగా వర్క్ అవుట్ అయింది. కాని రెండవ అర్ధ భాగం వచ్చేసరికి అతని చేతిలో విషయం లేక చిత్రం మొత్తాన్ని కామెడీ మీదకి తోసేసారు.. దాదాపుగా చిత్రంలో అరగంట పాటు ఎటు కదలకుండా ఒకే చోట ఉండిపోతుంది. దర్శకుడిగా రవి కుమార్ చౌదరి విజయం సాదించాడు అనే చెప్పాలి అతని దగ్గరున్న కథనాన్ని అంతే వినోదాత్మకంగా తెరకెక్కించారు. కానీ క్లైమాక్స్ వద్దకు వచ్చేసరికి ఎం చెయ్యాలో తోచక అనవసరమయిన పొలిటికల్ డ్రామాలో అసలు సరిపడని కామెడీ ని జత చేర్చారు.ఈ చిత్ర చివరి ఇరవై నిమిషాలకి చిత్రానికి సంభంధం ఉండదు. ఇలా కాకుండా కాస్త ఎమోషనల్ క్లైమాక్స్ రాసుకొని ఉంటె కథకి సరిగ్గా సరిపోయేది..శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది, పాటలను చాలా బాగా చిత్రీకరించారు. డైలాగ్స్ కొన్ని బాగున్నాయి కాని కొన్ని డైలాగ్స్ మాత్రం అర్ధరహితంగా ఉన్నాయి.. అనూప్ రూబెన్స్ అందించిన పాటలు బాగున్నాయి అన్ని సన్నివేశానికి తగ్గట్టుగా ఉండటంతో తెర మీద కూడా బాగా కుదిరాయి.. చిన్నా అందించిన నేపధ్య సంగీతం చాలా బాగుంది ముఖ్యంగా రెండా అర్ధ భాగంలో ఫైట్ దగ్గర వచ్చే నేపధ్య సంగీతం మరియు సాయి ధరం తేజ్ మొదటిసారి జగపతి బాబు ని కలిసినపుడు వచ్చే మ్యూజిక్ చాలా బాగుంది.. ఎడిటింగ్ స్మూత్ గా సాగిపోయింది కాని రెండవ అర్ధ భాగంలో కొన్ని అనవసరమయిన సన్నివేశాలను కత్తిరించాల్సింది అలానే కొన్ని సన్నివేశాలకు అర్ధం పర్ధం లేకుండా వచ్చేస్తాయి.. గీత ఆర్ట్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి...

ఒక చిత్రం ప్రేక్షకుడిని ఆకట్టుకోవాలంటే కామెడీ సరిగ్గా పేలితే చాలు ఇది ప్రస్తుతం మన తెలుగు చిత్రాలు అవలంభిస్తున్న సూత్రం. పిల్లా నువ్వు లేని జీవితం చిత్రం కూడా అదే కోవలోకి వస్తుంది, చిత్రం మొదలవగానే కథంటూ ఎం లేదు అని అర్ధం అయిపోతుంది ఉన్న కొన్ని ట్విస్ట్ లను దాచి పెట్టి కామెడీ తో నడిపించడం మొదలు పెట్టాడు దర్శకుడు. ఇంటర్వెల్ దగ్గర చిత్రాన్ని అసలు ట్రాక్ లో కి తీసుకొచ్చి ఇంటర్వెల్ వేసారు. ఇంటర్వెల్ నుండి వెనక్కి రాగానే మళ్ళీ ట్రాక్ తప్పించి కామెడీ చెయ్యడం మొదలు పెట్టారు ఇదంతా ఒక ఎత్తు అయితే చిత్రం మొదట్లో కనిపించిన ప్రకాష్ రాజ్ ని తీసుకొచ్చి చిత్రంలో కీలక పాత్రను చేసి అయన చేత కామెడీ చేయించడం ఎందుకో దర్శకుడికే తెలియాలి.. రెజిన పాత్ర ముఖ్యమయినది అయినప్పుడు ఆమె మీద మరిన్ని సన్నివేశాలు తెరకెక్కించి ఉండాల్సింది. చిత్రంలో మచ్చుక్కి కొన్ని లాజిక్స్ చూద్దాం.. హీరో, హీరోయిన్ కేరళ కి ట్రైన్ లో వెళ్తుంటారు హీరో ని పోలీస్ పట్టుకుని కొడుతుంటారు.. ట్రైన్ వెళ్ళిపోతుంది ఈలోపు రేజినని చంపడానికి జగపతి బాబు కార్ లో వస్తుంటారు అల చాలా దూరం వెళ్ళాక కరెక్ట్ గా రెజిన చంపే సమయానికి అక్కడ సాయి ధరం తేజ్ ప్రత్యక్షం అవుతాడు.. పోలీస్ ల నుండి ఎలా తప్పించుకున్నాడు అనేది పక్కన పెడితే ట్రైన్ కన్నా కార్ కన్నా వేగంగా ఎలా వచ్చాడు అన్నది నా ప్రశ్న, కేరళలో దెబ్బలతో పడి ఉన్న షఫీ గంటల వ్యవధి లో హైదరాబాద్ కి వచ్చేస్తాడు.. రఘు బాబు క్యారెక్టర్ దగ్గర డుప్లెక్స్ ఇల్లు ఉంటుంది కాని కెమెరా ఫోన్ ఉండదు" ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.. కాని ఇవేవి పట్టించుకోకుండా కేవలం కామెడీ కోసం ఈ చిత్రాన్ని ఒక్కసారి చూడచ్చు.. సాయి ధరం తేజ్ కి ఇది ఒక మంచి తెరంగేట్రం అని చెప్పుకోవచ్చు..

Sai Dharam Tej,Regina Cassandra,A.S.Ravi Kumar,Bunny Vasu,Anoop Rubensపిల్ల నువ్వు లేని జీవితం : కామెడీ కోసం ఒకసారి ...

మరింత సమాచారం తెలుసుకోండి: