సుబ్బా రావు పాత్ర,అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సుబ్బా రావు పాత్ర,అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు పటుత్వం లేని స్క్రీన్ ప్లే ,సినిమాటోగ్రఫీ ,మిగిలినవి ...

ఆత్మ హత్య చేసుకోవాలనుకుంటున్న సతీష్(సుదీర్) తో కథ మొదలవుతుంది. అడ్రస్ మారి తన సతీష్ ఇంటికి వస్తాడు సుబ్బారావు(కిరీటి) అతనితో తన కథ చెప్పడం మొదలుపెడతాడు సతీష్..

సతీష్ ఒక ఫోటోగ్రాఫర్ ప్రకృతిని ఫొటోస్ తీయడమంటే బాగా ఇష్టపడే సతీష్ అదే ప్రాసెస్ లో దీపు(ధన్య) ని మొదటిసారి చూడగానే ప్రేమిస్తాడు , చాలా కష్టపడి ప్రేమలో పడేస్తాడు కూడా ఇక వారి ప్రేమ కొనసాగుతుండగా దీపు వాళ్ళింట్లో మౌనిష్ తో పెళ్లి కుదురుస్తారు అయినా కూడా సతీష్ ని పెళ్లి చేసుకోవాలని దీపు అనుకుంటుంది ఈలోపు వీరి మధ్య పొరపచ్చాలు ఏర్పడతాయి చివరికి వారు కలిసారా లేదా అన్నది ఈ కథ...

సుబ్బారావు ఒక డెంటిస్ట్ , అతనికి పెళ్లి చేసుకోవాలన్నది చిన్నపటి నుండి ఉన్న ఒక కోరిక అలానే మనకొచ్చే భార్య బాగుండాలని కోరుకున్తున్నప్పుడు మనం కూడా బాగుండాలని అనుకునే మనస్తత్వం అలంటి సుబ్బారావు జీవితంలోకి వస్తుంది స్వేచ్చ(ధన్య) అప్పటికే ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు అతనితో బ్రేక్ అప్ అయ్యాక ఈ పెళ్ళికి ఒప్పుకుంటుంది స్వేచ్చ అదే విషయం సుబ్బారావు కి కూడా చెప్తుంది అయినా సుబ్బారావు పెళ్లికి ఒప్పుకుంటాడు పెళ్ల్లి కూడా అయ్యాక స్వేచ్చ తన పాత బాయ్ ఫ్రెండ్ అయిన స్రవంత్ ని మరిచిపోడానికి సమయం కావాలని అడుగుతుంది. ఆ తరువాత స్వేచ్చ స్రవంత్ ని మరిచిపోయిందా లేదా ? సుబ్బారావు ఏమయ్యాడు? అన్నదే ఈ కథ ...

సహస్ర (ధన్య) మరియు సిద్దు మంచి స్నేహితులు సిద్దు కి స్నేహితుడిగా చైతు(విష్ణు వర్ధన్) సహస్ర కి పరిచయం అవుతాడు వారి మధ్య ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. అప్పటి వరకు బ్లాకు అండ్ వైట్ గా ఉన్న తన జీవితాన్ని చైతు కలర్ ఫుల్ గ మార్చాడని ఫీల్ అయిన సహస్ర చైతుకి మరింత దగ్గరవుతుంది వీరి మధ్య ప్రేమ పెళ్ళికి దారి తీస్తుందా లేదా? సిద్దు ఏమయ్యాడు అన్నది మిగిలిన కథ..

ఈ మూడు కథలకు పేరు లేని డాక్టర్ (పోసాని కృష్ణ మురళి) ఇచ్చిన ముగింపు ఏంటి అనేది తెర మీద చూడవలసిందే ....

ఈ విభాగంలో ముందుగా చెప్పుకోవలసింది కిరీటి గురించి అయన నటన అయన పండించిన హాస్యం మొదలవగానే చిత్రం కాస్త వేగం పుంజుకుంది దానికి తగ్గట్టుగానే సుబ్బారావు పాత్రకి కావలసిన అమాయకత్వాన్ని చాలా బాగా ప్రదర్శించారు ఈ చిత్రానికి హైలెట్స్ అని ఏదైనా చెప్పుకోవాలంటే ఈ పాత్రను చెప్పుకోవాలి. ఇక తరువాత చెప్పుకోవాలంటే ధన్య బాలకృష్ణ మూడు వేరు వేరు పాత్రలు చేసిన ధన్య బాగా నటించింది ఈ మూడు పాత్రలకి పేర్లు అయితే మారాయి కాని తీరు తెన్నులు కూడా మర్చి ఉంటె ఇంకా బాగుండేది. ఇక చివర్లో వచ్చిన పోసాని కృష్ణ మురళి అయన శైలి లో అలరించారు. మిగిలిన అన్ని పాత్రలు అందులోని నటులు ఆకట్టుకోలేకపోయాయి.

దర్శకుడు కిషోర్ తిరుమల , మూడు కథలను ఎంచుకోవడం కన్నా ఒక్క కథ మీద డిఫరెంట్ షేడ్స్ వర్క్ అవుట్ చేసుంటే బాగుండేది మూడు కథలను ఎంచుకొని ఏది ఎలా చెప్పాలో తెలియక తికమక పడ్డారు ఇక ఎంచుకున్న కథలు ఏమయినా బలంగా ఉందంటే అన్ని ఒకేలా ఉంది. కథనం అయితే చాలా వీక్ ఒక మొదటి అర్ధ భాగం మరియు రెండవ అర్ధ భాగం సంభంధం లేకుండా నడ్డుస్తుంది చివర్లో పెట్టిన లింక్ కూడా చాలా సన్నగా ఉండటంతో అంత కన్విన్సింగ్ గా అనిపించదు. డైలాగ్స్ కొన్ని బానే ఉన్నాయి కాని ఇంకా బాగుండాల్సింది .

సినిమాటోగ్రఫీ మొత్తం షార్ట్ ఫిలిం చుసిన ఫీల్ క్రియేట్ చేసింది. సంగీతం పాటలు ఆకట్టుకోలేదు నేపధ్య సంగీతం సన్నివేశాలకు సంబంధం లేకుండా సంగీతాన్నిఅందించడంలో సంగీత దర్శకుడు విజయవంతం అయ్యాడు. ఎడిటర్ కూడా సరిగ్గా పని చేయ్యకపోయుంటే ప్రేక్షకుడి పరిస్థితి మరోలా ఉండేది ఇంత చేసినా కూడా కట్ చెయ్యాల్సిన సన్నివేశాలు మిగిలిపోయాయి.. నిర్మాణ విలువలు జస్ట్ ఒకే..

అమ్మాయిలందరు ఇంతే అని చూపించాలని అనుకున్నారు మళ్ళీ అబ్బాయిల్లో కూడా ఇలా ఉన్నారని చుపించాలనుకున్నారు చివరిగా లేదు అమ్మాయిలంతా ఇంతే అన్నట్టు చూపెట్టారు. అమ్మాయిలంతా ఇంతే అన్న మాత్రాన అందరు అమ్మాయిలు ఒకేలా ఉండరు. మూడు పాత్రలకు ధన్యనే ఎంచుకోవడం మంచి ఆలోచనే కాని మూడు పత్రాలు కాస్త విభిన్నంగా ఉంటె బాగుండేది. అమ్మాయిలు అందంగా ఉంటారు మోసం చేస్తారు అబ్బాయిలు అమాయకంగా ఉంటారు మోసపోతుంటారు అనేదే చెప్పాలని ఈ చిత్ర ఉద్దేశం అయితే అదే పాయింట్ ని సరిగ్గా చెప్పలేకపోయాడు.

మూడు వేరు వేరు కథలు ఒకదానికి మరోటి సంభంధం ఉండదు, మొదటి అర్ధ భాగం చూడకుండా సెకండ్ హాఫ్ మాత్రమే చూస్తే ఫుల్ సినిమా చుసిన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఏ పాత్రను కూడా క్లియర్ గ చుపించాలేకపోయాడు పాత్ర జనమకి చేరితే కదా వాటి భావాలూ అర్ధం అయ్యేది , ఆసలు క్యారెక్టర్ తో కనెక్ట్ కాకపోతే ఆ పాత్ర ఏడ్చినా నవ్వినా తేడా ఉండదు కదా ఈ చిత్రంలో అదే జరిగింది. మూడు లఘు చిత్రాలను కలిపి ఆ మూడింటికి ఒక సన్నని కథతో కనెక్షన్ పెట్టి "సెకండ్ హ్యాండ్" అని పేరు పెట్టేసారు . సరైన పాయింట్ మీద కాస్త పట్టు ఉన్న కథనం ఉంది ఉంటె చాలా బాగుండేది.. ఇక సాంకేతిక అంశాలు అన్ని లఘు చిత్రాల స్టాండర్డ్స్ లో ఉన్నాయి.. అమ్మాయిల దగ్గర మోసపోయి వారిని ఎలా తిట్టాలో తెలియని వాళ్ళు ఎవరయినా ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారు .....

Dhanya Balakrishan,Sudheer Varma,Kishore Tirumala సెకండ్ హ్యాండ్ : పాయింట్ లెస్ ప్రేమకథ

మరింత సమాచారం తెలుసుకోండి: