2005లో విడుదలైన సినిమా వెన్నెల. రాజా, పార్వతి మెల్టన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా మంచి హిట్టయ్యింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ గా వెన్నెల 1 1/2 చిత్రం రూపుదిద్దుకుంది. వెన్నెల చిత్రంతో పరిచయమై ఆ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నహస్యనటుడు వెన్నెల కిషోర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వెన్నెల సినిమాకు సీక్వెల్ గా వస్తుండటం, హస్య నటుడు వెన్నెల కిషోర్ దీనికి దర్శకత్వం వహించడంతో ఈ వెన్నెల 1 1/2 పై అందరి దృష్టి పడింది. మరి వెన్నెల 1 1/2 చిత్రం ఏలా ఉందో చూద్దాం..!   చిత్రకథ :     ఈ వెన్నెల 1 1/2 సినిమా ఫ్లాష్ బ్యాక్ ప్రకారంగా నడుస్తుంది. వెన్నెల సినిమాలో పాత్రలు వెన్నల కిషోర్, కరీం లు కొన్ని కారణాలతో అమెరికాను విడిచి బ్యాకాంగ్ వెళ్లవలసి వస్తుంది. అక్కడ వారికి కృష్ణ కృష్ణ (చైతన్య కృష్ణ) పరిచయం అవుతాడు. కృష్ణ కృష్ణ ప్రేమికులను విడదీసి ఉపాధి పొందుతుంటాడు. ఈ క్రమంలో వెన్నల (మోనాల్ గుజ్జాల్), అమెతో ఎంగేజ్ మెంట్ అయిన శ్రవణ్ ను వీడిదీస్తాడు. వెన్నెల తో ప్రేమలో పడతాడు. చివరికి కృష్ణ కృష్ణ , వెన్నెల ఏ విధంగా కలుసుకున్నారు. శ్రవణ్ చివరి ఏమయ్యాడు. అసలు, వెన్నెల, శ్రవణ్ లను వీడదీయమని కృష్ణకృష్ణకు ఏవరు చెప్పారు..? అనే విషయాలు ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ కధను వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్ కు చెబుతుంటాడు. ఆ ప్రకారం సినిమా సాగుతుంటుంది. నటీనటుల ప్రతిభ :  హీరోగా నటించిన చైతన్య కృష్ణ, హీరోయిన్ గా నటించిన మోనాల్ గుజ్జాల్ తమ పాత్రలలో పరిధిలో నటించారు. సినిమాలోని కథ, కథనాలు వెన్నెల కిషోర్ చుట్టూ సాగుతుంటాయి. కిషోరే కథ చెబుతూ సినిమా నడుపుతుండటంతో సన్నివేశాలు ఎక్కువగా అతని చుట్టే సాగుతుంటాయి. వెన్నెల కిషోర్ ఎప్పటి లానే చేసుకుని పోయాడు. పైగా ఈ సినిమాకు అతనే దర్శకుడు కావడంతో తనకు నచ్చే, తనకు సూటయ్యే సన్నివేశాలు చేసుకున్నాడు (రాసుకున్నాడు). తనకు లభించిన పాత్రలో శ్రవణ్ బాగా నటించాడు. మాస్టర్ భరత్ ఇక నుంచి మిస్టర్ భరత్ గా మారనున్నాడు. అయితే ఎదిగే వయస్సులో ఉన్న అతని కంఠ స్వరం వినడానికి కొంచెం ఇబ్బందికి ఉంది. ఇటు చిన్నపిల్లాడిగాను కాకుండా, అటు యువకుడి గాను కాకుండా అతని కంఠ స్వరం ఉంది. కొన్నాళ్లు అతను సినిమాలకు దూరంగా ఉంటే బావుటుంది. బ్రహ్మనందం, రఘబాబు తదితరలు తమ తమ పాత్రల పరిధిలో నటించారు. సాంకేతిక వర్గం పనితీరు :  ఫోటోగ్రఫీ ఫర్వాలేదు. సంగీతం యావరేజ్. వెన్నెల సినిమాలో కొన్ని పాటలను ఈ సినిమాలో ఉపయోగించుకున్నారు. మాటలు సినిమాకు తగ్గట్లే ఉన్నాయి. కొన్ని చోట్ల కామెడీ డైలాగులు బాగా పేలాయి. సినిమాకు తగ్గట్లే నిర్మాతలు ఖర్చు పెట్టారు. ఇక దర్శకత్వం విషయానికి వస్తే తనకు పట్టు ఉన్న కామెడీ సన్నివేశాలను బాగానే రూపొందించాడు. కస్టమర్ కేర్ ఫోన్ సహాయంతో మైక్రో ఓవెన్, వాషింగ్ మిషన్, కంప్యూటర్ లను ఉపయోగించే సన్నివేశాలు, హీరోయిన్ కు కొరియర్ చేసిన సిడిని అమెకు అందకుండా చేయడానికి చేసే ప్రయత్నాలు వంటి దృశ్యాలు బాగు ఉన్నాయి. అయితే సినిమాలో చాలా చోట్ల ఓవర్ గా అనిపించే డైలాగులు, సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. సినిమాను ధియేటర్లలో పూర్తిగా చూడటం కంటే టివిలో కామెడీ ప్రోగ్రామ్స్ లో సీన్లు,సీన్లుగా చూడటం బెటర్. అలాగే ఈ సినిమాతో చేసిన ‘లైవ్ ఇంటర్వెల్’ ప్రయోగం అనవసరం. అసలే కరెంటు కొరత తీవ్రంగా ప్రస్తుత సమయంలో అలాంటి ప్రయోగాలు చేయకుండా ఉండే ప్రభుత్వానికి, ప్రజలకు మేలు చేసిన వారు అవుతారు. హైలెట్స్ :  కామెడి సన్నివేశాలు, వెన్నెల కిషోర్ నటన, డైలాగులు డ్రాబ్యాక్స్ :  సాధారణమై కథ, కొత్తదనం లేని సన్నివేశాలు, చివరగా :  వెన్నెల 2 1/2 సినిమా రాబోతుందని ఈ వెన్నెల 1 1/2 సినిమాలో ఒక పాత్రతో వెల్లడించారు. వెన్నెల కిషోర్ అలాంటి ప్రయత్నం చేయకుండా ఉంటే ఉత్తమం. వెన్నెల 1 1/2 టీమ్ బ్యానర్ : జీఆర్8 ప్రోడక్షన్స్ నటీనటులు : చైతన్య కృష్ణ, మోనాల్ గుజ్జార్, వెన్నెల కిషోర్, శ్రవణ్, బ్రహ్మనందం, రఘుబాబు, మాస్టర్ భరత్ తదితరులు.. సంగీతం : సునీల్ కశ్యప్,     ఫోటోగ్రఫీ : సురేష్ భార్గవ్ నిర్మాత : వాసు, వర్మ,      దర్శకత్వం : వెన్నెల కిషోర్ Vennela One And Half (1.5) :: Tweet Review || English Review Read More Articles on VOAH  |  Enjoy VOAH Photos  |  Watch VOAH Videos   

మరింత సమాచారం తెలుసుకోండి: