పెళ్లైన కొత్తలో, యమదొంగ వంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ప్రియమణి. ఈ జాతీయ ఉత్తమ నటి నటిస్తున్న తాజా సినిమా చారులత. అవిభక్త కవలల నేపథ్యంగా రూపొందుతున్న ఈ చారులత సినిమా మొదటి నుంచి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. థాయ్ సినిమా ఆధారంగా నిర్మించిన చారులత సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలుగులో విడుదల చేయడం ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. మరి ప్రియమణి తన చారులతతో ఆ అంచనాలను అందుకుందా..   చిత్రకథ :   చారులతలు ఆవిభక్త కవలలుగా జన్మిస్తారు. చనిపోయేంత వరకూ కలిసే జీవించాలని అనుకుంటారు. అయితే యుక్త వయస్సు వచ్చే సరికి ఇద్దరు రవి (స్కంద)ని ప్రేమిస్తారు. అయితే స్కంద వారిలో ఒక అమ్మాయిని మాత్రమే ఇష్టపడతాడు. దీంతో చారు, లతల మధ్య విభేదాలు వస్తాయి. అనుకోకుండా అందులో ఒక అమ్మాయి చనిపోతుంది. ఆ చనిపోయిన అమ్మాయి ఏమైంది, చారు, లతలలో ఎవరు ఆ అబ్బాయి ప్రేమని దక్కించుకున్నారు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. నటీనటుల ప్రతిభ : ఆవిభక్త కవలలుగా ప్రియమణి అద్భుతంగా నటించింది. నెగెటివ్, పాజిటివ్ పాత్రలను బాగా పండించింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆమె నటన ఆమోఘం. ఈ చారులత సినిమాతో ఆమెకు మరోసారి జాతీయ ఉత్తమ నటి అవార్డు లభించే అవకాశాలు ఉన్నాయి. స్కంద నటన ఫర్వాలేదనిపిస్తుంది. స్వామిజీ గా నటించిన సాయికుమార్ సోదరుడు సాయిశశి తన పాత్రలో నటించారు. దెయ్యాన్ని బంధించే సన్నివేశానికి ఆయన నటన జీవం పోసింది. చారులత తల్లిగా నటించిన శరణ్య ఆకట్టుకుంది. మిగిలిన వారు తమ తమ పాత్రలలో నటించారు. సాంకేతిక వర్గం పనితీరు : ఫోటోగ్రఫీ బావుంది. ముఖ్యంగా హర్రర్ సన్నివేశాలను బాగా తెరకెక్కించాడు. నేపథ్య సంగీతం బావుంది. అయితే నేపథ్య సంగీతం పై పెట్టిన శ్రద్ధ పాటలు మీద కనబరచలేదు. పాటలు చాలా నీరసంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకత్వం విషయానికి వస్తే.. ఆవిభక్త కవలలు అంటూ ఓ కొత్త నేపథ్యంతో కథ తయారు చేసుకున్న దర్శకుడు ఇందులో ప్రేమ, హర్రర్ ను మేళవించాడు. అయితే చివరిలో సరైన ముగింపు ఇవ్వలేకపోయాడు. చారు, లత లలో ఎవరు మంచి అమ్మాయో తనే నిర్ణయించుకోలేక పోయాడు. కాబట్టి అదే విషయాన్ని ప్రేక్షకులకు స్పష్టంగా చెప్పలేక పోయాడు. ప్రేక్షకులను సందిగ్ధంలో ఉంచేశాడు. హైలెట్స్ : ప్రియమణి నటన, ఫోటోగ్రఫీ, నేపథ్య సంగీతం, డ్రాబ్యాక్స్ : పాటలు, కామెడీ లేకపోవడం, స్ర్కీన్ ప్లే చివరగా : ప్రియమణి నటన గురించి చారులత చూడవచ్చు. చారులత టీం: బ్యానర్ : గీతా ఆర్ట్స్ నటీనటులు : ప్రియమణి, స్కంద, సీత, శరణ్య సంగీతం : సుందర్ సి బాబు, ఫోటోగ్రఫీ : సెల్వం దర్శకత్వం : పాన్ కుమరన్ Read More Articles on Charulatha  |  Enjoy Charulatha Photos  |  Watch Charulatha Videos Charulatha :: Tweet Review || English Review  

మరింత సమాచారం తెలుసుకోండి: