Rebel Tweet Review || 'Rebel' Full English Review   ప్రభాస్ హీరోగా నటించిన రెబల్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. డార్లింగ్, మిస్టర్ ఫరఫెక్ట్ వంటి హిట్ సినిమాల తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో అతని అభిమానులు రెబల్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. అలాగే, రెబల్ అనేది ప్రభాస్ పెదనాన్న, ప్రముఖ నటుడు కృష్ణంరాజు బిరుదు అన్న విషయం తెలిసిందే. దీంతో రెబల్ పై అంచనాలు మరింతగా పెరిగాయి. అలాగే, లారెన్స్ దర్శకత్వం వహించడంతో అందరి దృష్టిని ఈ రెబల్ మరింతగా ఆకట్టుకుంటుంది. స్టైల్, మాస్, కాంచన... వంటి సినిమాలతో తనలో ఓ హిట్ దర్శకుడు ఉన్నాడని నిరూపించుకున్న లారెన్స్ తెరెక్కించిన ఈ రెబల్ ఎలా ఉందో తెలుసుకుందాం..!     చిత్రకథ : ఒక ఊరిలో జనం చేత దేవుడిగా ఆరాధించబడే భూపతి (కృష్ణంరాజు) కుమారుడు రుషి (ప్రభాస్). బెంగుళూర్ లో పెరిగే భూపతి కుమారుడు రుషి తల్లిదండ్రుల వద్దకు తను ప్రేమించే అమ్మాయి దీపాలి (దీక్షాసేథ్)తో వస్తాడు. రుషి ప్రేమను అంగీకరించి పెళ్లి చేద్దామనుకునే సమయంలో అతని తల్లిదండ్రలు, ప్రేయసి హత్యకు గురవుతారు. హంతకులను వెతుక్కూంటు రుషి బయలు దేరతాడు. రుషి తల్లిదండ్రులను, అతని ప్రేయసిని చంపింది ఎవరు.., రుషి రెబల్ గా మారి వారిని ఏ విధంగా అంతం చేశాడు. నందిని (తమన్నా)ను ఎందుకు ప్రేమించాల్సి వచ్చింది అనేది ఈ చిత్రకథ.   నటీనటుల ప్రతిభ : ఈ రెబల్ సినిమాలో నటుడిగా ప్రభాస్ విశ్వరూపం చూపించాడు. యాక్షన్ సీన్స్ లో అదరకొట్టడమే కాకుండా, కొన్ని సన్నివేశాలలో కళ్ల వెంట నీళ్లు తెప్పించాడు. డాన్సులతోనూ అలరించాడు. ఈ రెబల్ సినిమాను ప్రభాస్ ఒంటి చేత్తో లాక్కుని వచ్చాడు. ఈ సినిమాలో ప్రభాస్ తరువాత తమన్నాది మరో ముఖ్య పాత్ర. డాన్స్ టీచర్ గా నటించిన ఈ సినిమాలో డాన్సులు బాగా చేసింది. అందాలు ఒలకబొసింది. ప్రభాస్ తమన్నాకు తన ప్రేమ వెల్లడించే సన్నివేశంలో ఇద్దరి నటన ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే సినిమా క్లైమాక్స్ లో తమన్నా నటన చాలా ఓవర్ గా ఉంది. దీనికి దర్శకుడ్నే తప్పుపట్టాలి. కృష్ణంరాజు పవర్ పుల్ పాత్రలో నటించాడు. అయనికి ఇలాంటి పాత్రలు కొట్టినపిండి. చిన్నదే అయినా కీలక పాత్రలో దీక్షసేథ్ నటించింది. బ్రహ్మనందం, అలీ, కొవై సరళ నవ్వించడానికి ప్రయత్నించారు. మిగిలిన వారు తమ తమ పాత్రలలో నటించారు. సాంకేతిక వర్గం పనితీరు :   ఫోటోగ్రఫీ బావుంది. సంగీతం ఫర్వాలేదు. పాటలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. మాటలు బాగున్నాయి. ప్రభాస్ ఇమేజ్ కు అనుగుణంగా మాటలు ఉన్నాయి. ‘నా ఇంట్రడక్షన్ అయ్యాక, ఏ నాకొడుకు ఇంట్రడక్షన్ పనికి రాదు’, ‘చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూ పెరిగా నాన్న, నీకులా కాకుండా వేరే విధంగా ఏలా ఉంటాను..’ వంటి మాటలు ఆకట్టుకుంటాయి. నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టారు. ఇక దర్శకత్వం విషయానికి వస్తే, సాధారణమైన కథనే భారీగా తీయడానికి ప్రయత్నించాడు. మొదటి బాగం వినోదాత్మకంగాను, రెండవ భాగం యాక్షన్ అంశాలతోనూ తీయడానికి కృషి చేశాడు. అయితే అతనికి పట్టు దొరకలేదు. ప్రభాస్ తమన్నాకు తన ప్రేమను వ్యక్తం చేయడం, దీక్షాసేథ్ అనాథ శరణాలయ దృశ్యాలను బాగా పండించాడు. కాగా, ఇప్పుడు దర్శకులు కొత్త కథలు దొరక్క తమ గత సినిమాలనే మళ్లీ తీస్తున్నారు. ఇటీవలే విడుదలైన శేఖర్ కమ్ముల సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ గతంలో అతను రూపొందించిన హ్యపీడేస్ ఆధారంగా తెరకెక్కింది. అలాగే, లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ఈ రెబల్ సినిమా, గతంలో అతని తెరకెక్కించి మాస్ సినిమా తరహాలోనే సాగుతుంది. మాస్ లో ఉండే తరహాలోనే, ఈ రెబల్ సినిమా కూడా విలన్లు ఒక పోలీస్ ఆఫీసర్ ను చంపడంతో ప్రారంభం అవుతుంది. అందులో హీరో పరిచయమయ్యే సన్నివేశాల విధంగానే, ఈ రెబల్ సినిమాలోనూ హీరో పరిచయం అవుతాడు. కాకపోతే, మాస్ లో హీరో అనాధ, తన స్నేహితుడిని చంపినవాడి మీద పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ రెబల్ తన తల్లిదండ్రులను చంపిన వారిపై పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే, ఈ రెబల్ లో క్లైమాక్స్ సన్నివేశాలు లారెన్స్ దర్శకత్వంలోనే వచ్చిన డాన్ ముగింపు సన్నివేశాలను గుర్తుకు తెస్తాయి. హైలెట్స్ : ప్రబాస్ నటన, తమన్నా అందాలు, సినిమాలోని లవ్ సీన్స్. డ్రాబ్యాక్స్ : పాత కథ, విసిగెత్తించే యాక్షన్ దృశ్యాలు. చివరగా : ప్రభాస్ హ్యట్రిక్ మిస్ అయింది.       రెబల్ టీం : బ్యానర్ : శ్రీ బాలాజీ సిని మీడియా నటీనటులు : ప్రభాస్, కృష్ణం రాజు, బ్రహ్మనందం, ముకేష్ రుషి, తమన్నా, దీక్షాసేథ్ తదితరలు.. ఫోటోగ్రఫీ : సి.రామ్ ప్రసాద్,   మాటలు : డార్లింగ్ స్వామి నిర్మాతలు : జె.భగవాన్, జె.పుల్లారావు, సంగీతం, దర్శకత్వం : లారెన్స్             Prasad can be reached at: Yedida.Viswaprasad@apherald.com Editor can be reached at: editor@apherald.com
    More Articles on Rebel || Rebel Photos & Wallpapers || Rebel Videos  

మరింత సమాచారం తెలుసుకోండి: