రవితేజ నటన,సినిమాటోగ్రఫీ,కొన్ని కామెడీ సన్నివేశాలు,నిర్మాణ విలువలురవితేజ నటన,సినిమాటోగ్రఫీ,కొన్ని కామెడీ సన్నివేశాలు,నిర్మాణ విలువలురొటీన్ స్టొరీ,కథనం,దర్శకత్వం,ఎడిటింగ్, పలు మార్లు చూసేసిన సన్నివేశాలు

ఈ చిత్ర కథ కోల్ కత్తా నేపథ్యంలో మొదలవుతుంది. కోల్ కత్తా లో పెద్ద డాన్ అయిన గంగూలి భాయ్(సంపత్) ని అరెస్ట్ చేసి కోర్ట్ లో హాజరు పరచడానికి తీసుకెళ్తు ఉంటారు. అక్కడ నుండి గంగూలి భాయ్ ని తప్పించే క్రమం లో ఎసిపి బలదేవ సహాయ్(రవితేజ) మరణిస్తాడు. కథ హైదరాబాద్ కి మారుతుంది. తిరుపతి (రవితేజ) చిన్నప్పటి నుండి పోలీస్ అవ్వాలనే కోరిక బలంగా ఉన్న వ్యక్తి అందుకోసం అతను చెయ్యని ప్రయత్నాలు ఉండవు. ఇదిలా సాగుతుండగా అతన్ని జయవర్ధన్(ముఖేష్ రుషి) చూస్తాడు. అక్కడి నుండి తిరుపతి ని తీసుకు వచ్చి బలదేవ్ సహాయ్ స్థానంలో ఉంచుతాడు. చిన్నప్పటి తను కంటున్న కల నిజమైనందుకు తను పోలీస్ ఆఫీసర్ కావడంతో సంతోషంతో ఉన్న తిరుపతి కి కొన్ని అనుకోని నిజాలు తెలుస్తుంది. ఆ నిజాలేంటి? బలదేవ్ సహాయ్ ఎవరు? అతని కథ ఏంటి? గంగూలి భాయ్ ఏమయ్యాడు? అనే విషయాలను మీరు తెర మీద చూడాల్సిందే...

రవితేజ నటన ఎప్పటిలానే ఆకట్టుకుంది రెండు పాత్రలలో ఈయన నటన చాలా బాగుంది అంతే కాకుండా ఈ రెండు పాత్రలకి మధ్యన తేడా చూపించడంలో ఈ నటుడు సఫలీకృతం అయ్యాడు. రెండవ అర్ధ భాగంలో వచ్చే బలదేవ్ పాత్రలో ఈ నటుడు అద్భుతంగా నటించాడు అని చెప్పాల్సిందే. రెజినా మరియు హన్సిక ల నటన ఆకట్టుకుంది వీరి పాత్రలు చాలా వరకు అందాల ఆరబోతకే పరిమితం అవ్వడంతో వీరు నటించాల్సిన అవసరం ఎక్కువగా రాలేదు. బ్రహ్మానందం తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నారు ఈయనకి మరియు రవితేజ కి మధ్యన వచ్చే సన్నివేశాలు బాగా హాస్యాన్ని పండించాయి. సప్తగిరి కూడా తనదయిన స్తాయి కామెడీని పండించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. సంపత్ రాజ్ ఉన్నంతలో పాత్రను రక్తి కట్టించారు. కనిపించేది కాసేపే అయినా కూడా ప్రకాష్ రాజ్ తన మార్క్ ప్రేక్షకుల మీద పడేలా నటించారు. ముఖేష్ రుషి , సుబ్బరాజు , బ్రహ్మాజీ మరియు తదితర నటులు ఉన్నంతలో ఆకట్టుకున్నారు..

ఎప్పుడు ఉండే కథనే ఇటుది అటుగా అటుది ఇటుగా రాసుకున్న కథనే కాబట్టి ఈ చిత్రంలో కథ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడం లేదు కాని కథనం దగ్గర కూడా ఇదే సూత్రం ఫాలో అవ్వడంతో సమస్య మొదలయ్యింది. ఎందుకంటే ఇప్పటికే చాలా సార్లు చూసిన సన్నివేశాలను మళ్ళీ మళ్ళీ చూపించాలంటే రాసే రచయితకు విసుగు పుట్టకపోయినా చూసే ప్రేక్షకుడు కచ్చితంగా విసిగిపోతాడు.. ప్రాస కోసం రాసుకున్న డైలాగ్స్ అర్ధ పర్ధం లేకుండా సాగుతుంది కోన వెంకట్ రాసుకున్న అతి కొన్ని డైలాగ్స్ మాత్రమే ఆకట్టుకున్నాయి. కే ఎస్ రవీంద్ర దర్శకత్వం పేలవంగా ఉంది. సినిమాటోగ్రఫీ అందించిన ఆర్థర్ పనితనం చాలా బాగుంది కోల్ కత్తా మరియు హైదరాబాద్ లొకేషన్స్ ని చాలా అందంగా చూపించారు. తమన్ సంగీతంలో రెండు పాటలు బాగున్నాయి అంతే కాకుండా కొన్ని సన్నివేశాలకు అందించిన నేపధ్య సంగీతం సన్నివేశాలకు బాగా సహాయపడింది. ఎడిటింగ్ చేసిన జయనన్ విన్సెంట్ చాలా సన్నివేశాల మీద కనికరం చూపాడు అంతే కాకుండా చిత్రం ఒక సన్నివేశం ఉంది మరొక సన్నివేశానికి చాలా సౌకర్యంగా కదులుతుంది.. ఫైట్స్ అందించిన రామ్ లక్షం ఎప్పటిలానే గాల్లో ఎక్కువ నేల మీద తక్కువ అన్న సిద్ధాంతం ఫాలో అయినా కూడా రెండవ అర్ధ భాగంలో వచ్చే ఫైట్స్ బాగున్నాయి.. ముఖ్యంగా పోర్ట్ దగ్గర వచ్చే ఫైట్ బాగా చిత్రీకరించారు. రాక్ లైన్ ఎంటర్టైన్మెంట్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి..

గతంలో చూసిన చిత్రాల మాదిరిగానే ఈ చిత్రం ఉన్నప్పటికీ ఆ చిత్రాలకి ఈ చిత్రానికి ఉన్న ఏకైక తేడా రవితేజ , అవును ఆయన ఒక్కడే ఈ చిత్రానికి ఊపిరి .. చిత్రం మొదట్లో హంగామాగా మొదలైనా మెల్లగా మూస లో కి జారుకుంటుంది. మొదటి అర్ధ భాగం సరదాగా కామెడీ సన్నివేశాలతో సాగిపోయినా కూడా రెండవ అర్ధ భాగం ఎక్కడా ఆకట్టుకునేలా కనిపించదు దర్శకుడు ఈ చిత్రాన్ని బలుపు లా తీయడానికి ప్రయత్నించినట్టు స్పష్టంగా తెలిసిపోతుంది కాని అక్కడ కామెడీ వర్క్ అవుట్ అయిన విధంగా ఈ చిత్రంలో అవ్వలేదు.. రవితేజ నటన, హన్సిక మరియు రెజినా అందాలు , కొన్ని కామెడీ సన్నివేశాలు కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెండు పాటలు ఇదే ఈ చిత్రానికి బలం.. వీటి కోసం అయితే ఒక్కసారి చూడదగ్గ చిత్రం అలా కాకుండా విభిన్నం అయిన చిత్రం కోరుకునేవారు ఈ చిత్రానికి దూరంగా ఉండటమే మంచింది.. విభిన్నమయిన మాస్ కథా చిత్రాన్ని కోరుకునేవారు కూడా ఈ చిత్రాన్ని ఎంజాయ్ చెయ్యలేరు... రొటీన్ చిత్రాలకు అలవాటు పడ్డ రొటీన్ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని రొటీన్ గా చూడగలరు..

Ravi Teja,Hansika Motwani,SS Thaman,KS Ravindra Nath (Bobby),Rockline Venkatesh.పవర్ : పేరు లో మాత్రమే ఉంది "పవర్"

మరింత సమాచారం తెలుసుకోండి: