Read Boochi English Review
  సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన కొత్త సినిమా బూచి. గతంలో వచ్చిన బూత్ సినిమాకు సీక్వెల్ గా బూత్ రిటర్న్స్ సినిమా ను నిర్మించారు. ఈ సినిమాను బూచి పేరుతో తెలుగులో విడుదల చేశారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన బూచి ఎలా ఉందంటే.....  

చిత్రకథ :

  ఒక ఇంట్లో అద్దెకు ఉన్న వాళ్లు ఆ ఇంటి ఓనర్ కు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళపోవడంతో వేరే వాళ్లకు అద్దెకు ఇస్తాడు. అలా ఆ ఇంట్లోకి తరుణ్ అవసరాల (జెడి చక్రవర్తి) కుటుంబం అద్దెకు దిగుతుంది. ఆరేళ్ల వాళ్ల పాప ఆ ఇంట్లో వేరే మనిషితో మాట్లాడుతుంది. ఆటలాడుతుంది. అయితే మిగిలిన వారికి ఆ వ్యక్తి కనిపించదు. తరుణ్ కుటుంబ సభ్యులకు వింత అనుభవాలు ఎదురు అవుతుంటాయి... ఆ అనుభవాలు ఏంటి, చివరకి ఆ చిన్నారి ఏమైయ్యింది అనేది చిత్రకథ.      

నటీనటుల ప్రతిభ :

  హరర్ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ సినిమాలో జెడి చక్రవర్తి, మనీషా కోయిరాల, ముధుశాలిని ముఖ్య పాత్రలలో నటించారు. అయితే ఈ సినిమాలో వారు నటించడానికి ఏమీ లేదు. వారు నటించారు అని చెప్పుకోకుండా ఒక ఇంట్లో అటూ ఇటూ నడిచారు అని చెప్పుకోవాలి. మిగిలిన వారు కూడా పెద్దగా చేసింది ఏమీ లేదు.     

సాంకేతిక వర్గం పనితీరు :

  ఫోటోగ్రఫీ బాగుంది. సంగీతం నిజంగానే భయపెట్టింది. ఇక దర్శకత్వం విషయానికి రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను అసలు ఏ ఉద్దేశంతో తీసాడో అర్ధం కాలేదు. హారర్, కామెడీ.. ఇలా సినిమాకైనా కథ చాలా కీలకం. అయితే ఆ సినిమాలో అసలు కథే ఉండదు. కెమెరాను అటు ఇటూ తిప్పి గట్టిగా సౌండ్ వాయిస్తే ప్రేక్షకులు భయపడి, గొప్ప హరర్ సినిమా చూసామని ముచ్చట పడిపోతారని భావించుకుని ఉంటాడు. అలాగే ఈ సినిమా రామ్ గోపాల్ వర్మ వాయిస్ తో ప్రారంభం అవుతుంది. ‘ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల ఇళ్ళు ఉన్నాయి. అయితే దెయ్యాలకు కొన్ని ఇళ్లు అంటేనే ఇష్టం’ చెపుతాడు. ఈ విషయాన్ని దెయ్యాలే మన రామూ గారికి చెప్పాయా.. పోనీ, ఈ సినిమాలో దెయ్యాన్ని కూడా చూపించలేదు. ఏదో తనకు తోచింది తీసుకుంటూ పోయాడు.  

చివరగా :

  నవ్వుల పాలైన ‘బూచి’      More Articles on Boochi || Boochi Videos  
 

మరింత సమాచారం తెలుసుకోండి: