ఇంటర్వెల్ ట్విస్ట్ , నేపధ్య సంగీతం , కథాంశం ,నటీనటుల పనితీరు ఇంటర్వెల్ ట్విస్ట్ , నేపధ్య సంగీతం , కథాంశం ,నటీనటుల పనితీరు ఊహాజనితం అయిన కథనం ,సంగీతం ,ఫస్ట్ హాఫ్ ,థ్రిల్లింగ్ గా చెప్పలేకపోవడం ,రెండు సబ్ ప్లాట్స్ ని సరిగ్గా లేకపోవడం

హరీష్ (జై) ఒక మెడికల్ రేప్రేజెంటివ్ గా పని చేస్తూ ఉంటాడు, అన్నయ్య దగ్గర ఉంటున్న హరీష్ కి తన మొబైల్ మూలాన అన్ని చోట్ల అవమానాలు ఎదురు అవుతుంటాయి. కుల్ఫీ(బాలాజీ) సలహా మేరకు ఫోన్ మార్చేయాలని నిర్ణయించుకుంటాడు. కాని తన బడ్జెట్ కి అతను ఒక చైనా ఫోన్ మాత్రమే కొనగలుగుతాడు అక్కడ నుండి అతని సమస్యలు తగ్గడం కాకుండా మరింత పెరిగిపోతుంది. ఆ ఫోన్ వలన అతను మరింత అవమానపడుతుంటాడు. ఇదిలా కొనసాగుతుండగా అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది స్వాతి(స్వాతి) చూడగానే ఆమెతో ప్రేమలో పడిపోతాడు హరీష్. కాని ఆమె వేరొకరిని ప్రేమిస్తుంది అనుకోని ఆమె స్నేహితురాలిని ప్రేమించడం మొదలుపెడతాడు. ఇదిలా జరుగుతుండగా అతనికి ఒక రోజు టీ షాప్ లో ఒక ఐ ఫోన్ దొరుకుతుంది అది ఎవరు తమదని చెప్పకపోవడంతో స్నేహితుల సలహా మేరకు అతను ఉపయోగించడం మొదలు పెడతాడు కాని ఒకరోజు అతను ఆ ఫోన్ తిరిగి ఇచ్చేయాలని ఒక బ్యాచ్ హరీష్ ని రవి శంకర్ అనుకోని కిడ్నాప్ చేస్తారు.. అతను రవి శంకర్ కాదు అని ఎంత చెప్పిన నమ్మరు.. అసలు రవి శంకర్ ఎవరు? రవి శంకర్ ని ఎందుకు కిడ్నాప్ చెయ్యాలి అనుకుంటారు? హరీష్ రవి శంకర్ కాదు అని ఎలా నిరూపించుకున్నాడు? అసలు వీటి అన్నింటికీ కుల్ఫీ కి ఉన్న సంభంధం ఏంటి అన్నదే ఈ చిత్ర కథ ...

జై ఎప్పటిలానే తన నటనతో ఆకట్టుకున్నారు , చిత్రం ఆసాంతం అతని చుట్టూనే నడవడంతో అతని నటన కూడా అంతే స్థాయిలో ఆకట్టుకునేలా చేసాడు. స్వాతి , పాత్రకి పెద్దగా ప్రాముఖ్యత లేకపోయినా తనదయిన శైలిలో ఆ పాత్రలో ఎనేర్జి నింపి ఆకట్టుకుంది. కుల్ఫీ పాత్రలో చేసిన బాలాజీ బాగానే నటించారు. ముఖ్యంగా కామెడీ సన్నివేశాలలో తన టైమింగ్ తో ఆకట్టుకున్నారు. సాయి ప్రశాంత్ క్లైమాక్స్ లో మాత్రమే కనిపించినా ఆకట్టుకోగలిగారు. వెంకట్ ప్రభు, ఆరుళ్ దాస్, ప్రేమ్గి, మహాత్ రాఘవేంద్ర ఇలా అందరు కొన్ని సన్నివేశాలకే పరిమితం అయ్యారు..

వెంకట్ ప్రభు శిష్యుడు అయిన శరవణ రాజన్ ఈ చిత్రం కోసం చాలా కష్టపడినట్టు తెలుస్తుంది అతను ఎంచుకున్న కథ మరియు దాని కోసం రాసుకున్న కథనం చాలా బాగా కుదిరింది ఇంటర్వెల్ తరువాత ప్రేక్షకుడు చిత్రంలో తరువాత ఏమవుతుందా అన్న ఉత్సుకత చూపిస్తాడు కాని చివర్లో క్లైమాక్స్ లో కి వచ్చే సరికి చాలా ఊహాజనితమయిన సన్నివేశాలతో అప్పటి వరకు ఉన్న ఫీల్ ని పోగొట్టేసారు. సినిమాటోగ్రఫీ అందించిన వెంకటేష్ ఎస్ ఈ చిత్రానికి మరొక హైలెట్. డైలాగ్స్ అంత గొప్పగా లేకపోయినా పరవాలేధనిపించాయి. సంగీతం అందించిన వివేక్ మరియు మెర్విన్ రెండు పాటలు చాల బాగా ఇచ్చారు వీరు అందించిన నేపధ్య సంగీతం చిత్రానికి ప్రాణం పోసింది అని చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ అందించిన ప్రవీణ్ మరియు శ్రీకాంత్ చిత్రాన్ని చాలా వేగంగా కద్దిలించారు ఎక్కడా కూడా చిత్రం వేగం తగ్గినట్టు అనిపించదు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి..

గత కొన్ని రోజులుగా తమిళ పరిశ్రమలో రకరకాల చిత్రాలు వస్తున్నాయి కుల్ఫీ చిత్రం కూడా అదే కోవకు చెందినది. మొబైల్ చుట్టూ రాసుకున్న థ్రిల్లింగ్ స్టొరీ ఇది కాని సమస్యల్లా థ్రిల్లింగ్ గా లేకపోవడమే ఇంటర్వెల్ ట్విస్ట్ తరువాత ప్రతి ప్రేక్షకుడు ట్విస్ట్ ని ఊహించడానికే ప్రయత్నిస్తూ కూర్చుంటాడు. చివరి వరకు వచ్చేసరికి ప్రేక్షకుడికి చాలా నీట్ గ అర్ధం అయిపోతుంది కాబట్టి అక్కడ ప్రేక్షకుడు త్రిల్ గ ఫీల్ అవ్వడం లాంటివి ఉండవు. ఇక ఇటు ప్రేమకథను అటు డ్రగ్ మాఫియా ను కలిపి కథను రాయడానికి దర్శకుడు చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ చిత్రం బాగాలేదు అని కాదు బాగా తీసుండాల్సింది అంటున్నాము. మీకు థ్రిల్లర్ అంటే ఇష్టం అయితే ఈ చిత్రాన్ని ఒక్కసారి చూడగలరు అది కూడా ముందే ట్విస్ట్ లను ఊహించి.. ఈ వారం విడుదల అయిన చిత్రాలలో ఇది కాస్త బెటర్ చిత్రం కాబట్టి చ్సినేమకి వెళ్ళాలి పనేం లేదు అనుకుంటే ప్రయత్నించండి..

Jai,Sunny Leone,Saravana Rajan,Vivek,Mervin Solomon.కుల్ఫీ - కూలింగ్ లేదు.. థ్రిల్లింగ్ లేదు ...

మరింత సమాచారం తెలుసుకోండి: