గిభ్రన్ సంగీతం ,మది సినిమాటోగ్రఫీ ,శర్వానంద్ నటన ,కామెడీ సన్నివేశాలు ,కథనం గిభ్రన్ సంగీతం ,మది సినిమాటోగ్రఫీ ,శర్వానంద్ నటన ,కామెడీ సన్నివేశాలు ,కథనం కథనంలో కొన్ని లోపాలు ,రెండవ అర్ధ భాగంలో కొన్ని సన్నివేశాల సాగాదీత ,కొన్ని పాత్రలను పూర్తి స్థాయిలో ఎలివేట్ చెయ్యకపోవడం.

రాజా (శర్వానంద్) ఎంతో మందిని అమ్మాయిలను ప్రేమించినా అందరితో నిజం చెప్పడమే కారణంగా బ్రేక్ అప్ అయిపోతూ ఉంటాడు. రాజా మరియు అతని తండ్రి (జయప్రకాశ్) కలిసి మార్కెట్ లో కూరగయలు వ్యాపారం చేస్తూ ఉంటారు. కాగా తాజా బ్రేక్ అప్ తరువాత అతని జీవితంలోకి అనుకోకుండా ప్రవేశిస్తుంది ప్రియ(సీరత్ కపూర్), ఇదే సమయంలో నగరంలో పెద్ద మనుషులను ఒక గ్రూప్ కిడ్నాప్ చేస్తూ ఉంటుంది. ఈ గ్రూప్ ని పట్టుకోవడానికి పోలీస్ డిపార్టుమెంటు ప్రత్యేక అధికారిగా దిలీప్ కుమార్(సంపత్) ని నియమిస్తుంది . అతనికి సబ్ ఆర్డినేట్ గా నయీం(అడివి శేష్) పని చేస్తూ ఉంటాడు. వీళ్ళందరు కలిసి ఆ గ్రూప్ ని పట్టుకోవడానికి ఒక పథకం వేస్తారు. పోలీస్ లే ఒక ప్రముఖ వ్యక్తిని కిడ్నాప్ చేయించి ఆ పథకం ద్వారా అసలు కిడ్నాపర్స్ ని పట్టుకోవలనేది ఈ పథకం. ఇదే సమయంలో దిలీప్ కుమార్ కూతురు అయిన ప్రియ ని ప్రేమించానని తనకి ప్రియని ఇచ్చి పెళ్ల్లి చెయ్యమని దిలీప్ కుమార్ దగ్గరకి వస్తాడు రాజా.. అప్పుడు దిలీప్ కుమార్ తను అనుకున్న పథకానికి రాజా ని ఉపయోగించాలని నిర్ణయించుకుంటాడు. దీనికి రాజా కూడా ఒప్పుకుంటాడు.. దిలీప్ కుమార్ రాజా ద్వారా కిడ్నాపర్స్ ని పట్టుకున్నారా? అసలు ఈ కిడ్నాప్ లు చేయిస్తున్నది ఎవరు? అనే అంశాలు మిగిలిన కథ..

ఇప్పటి వరకు సీరియస్ పాత్రల్లోనే కనిపించి అలరించిన శర్వానంద్ మొదటి సారి ఒక విభిన్నమయిన పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు అతనిలో ఉన్న ఎనేర్జి లెవెల్స్ ఈ చిత్రంలో పూర్తి స్థాయిలో బయటపడింది. ఈ చిత్రానికి ఈ నటుడి నటన చాలా సహాయపడింది అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. సీరిత్ కపూర్ తన అందాలతో ఆకట్టుకోలేకపోయినా తన అభినయంతో పాత్రకి కావలసిన ప్రాముఖ్యతను తీసుకు రాగలిగింది. సంపత్ కూడా ఎప్పుడు సీరియస్ పాత్రలు లేదా విలన్ పాత్రలలో కనిపించేవాడు కాని ఈ చిత్రంతో తనలోని కామెడీ టైమింగ్ ని చాలా అద్భుతంగా చూపించారు. ఇక తమిళ నటుడు జయప్రకాష్ మొదటి సారి నేరుగా తెలుగు చిత్రంలో నటించారు కామెడీ సన్నివేశాలలో కాని సెంటిమెంట్ సన్నివేశాలలో కాని ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలలో ఈ నటుడు చిత్రాన్ని తన నటనతో నిలబెట్టాడు అని చెప్పాలి. గత చిత్రాలలో కన్నా ఈ చిత్రంలో అడివి శేష్ నటన చాలా మెరుగుపడింది అని చెప్పుకోవచ్చు అంతే కాకుండా ఈ పాత్ర అతని నటనకి సరిగ్గా సరిపోయింది కోట శ్రీనివాస్ రావు , వెన్నెల కిషోర్ మరియు జబర్దస్త్ శంకర్ కొన్ని సన్నివేశాలలో బాగా నవ్వించారు. ఇంతే కాకుండా కొందరు లఘు చిత్ర నటులు కూడా అక్కడక్కడా కనిపించి నవ్వించడంలో తమ పాత్ర పోషించారు..

కథ , చాలా చిన్న పాయింట్ ని తన కథా వస్తువుగా ఎంచుకొని దానికి సరదాగా సాగే కథనాన్ని రాసుకోగాలిగారు దర్శకుడు సుజీత్ , నిజానికి ఈ కథ అంత గొప్పగా ఎం ఉండదు కాని పాత్రలను మలచిన తీరు అవి ప్రవర్తించే విధానం చాలా సరదాగా సాగడంతో చిత్రం ఎక్కాడా బోర్ కొట్టదు , అంతే కాకుండా కథనం కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఇక ఈ కథనానికి ఫన్నీ డైలాగ్స్ ప్రాణం పోసింది అని చెప్పాలి. మొదటి చిత్రం అయినా కూడా సుజీత్ చాలా పరిపఖ్వతతో కూడా దర్శకత్వ ప్రతిభ కనబరిచారు. అందరు సీనియర్ నటులే అయినా వారి నుండి తనకు కావలసినట్టు నటనను రాబట్టుకోగాలిగారు. మది అందించిన సినిమాటోగ్రఫీ ఈ చిత్ర ప్రధాన హైలెట్స్ లో ఒకటి . ఇంకా ఈ చిత్రం బాగుండటానికి ప్రధాన కారణం గిభ్రన్ సంగీతం , ఈ చిత్ర పాటలు మరియు నేపధ్య సంగీతం చాలా కొత్తగా ఉండటంతో చిత్రానికి తాజాతనం చేకూరింది. అంతే కాకుండా కీలక సన్నివేశాలను ఇతని నేపధ్య సంగీతం నిలబెట్టింది అని చెప్పుకోవచ్చు.. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది చిత్రం ఆసాంతం చాలా సున్నితంగా సాగిపోయింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఒక నూతన దర్శకుడిని నమ్మి ఇంత రిచ్ గా తీయడానికి చాలా ధైర్యం కావాలి ...

కామెడీ ని ఎలాగయినా చెప్పవచ్చు అందులో తెలుగులో చాలా అరుదుగా వచ్చే చిత్రాలు రొమాంటిక్ కామెడీ చిత్రాలు, అంటే పూర్తిగా రావు అని కాదు వచ్చినా వీటిలో "అడల్ట్" కామెడీ మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంది. ఆరోగ్యరకమయిన రొమాంటిక్ కామెడీ చిత్రం వచ్చి చాలా రోజులే అయ్యింది. ఈ చిత్రం మొదటి సన్నివేశం నుండి వేగం పుంజుకుంది అక్కడి నుండి వేగం ఏ మాత్రంతగ్గకుండా అదే సమయంలో కామెడీ ఎక్కడా మిస్ అవ్వకుండా నడిపించడంలో దర్శకుడు విజయం సాదించాడు. ఇక గిబ్రన్ పాటలు చాలా బాగున్నాయి.అలా అని చిత్రం అద్భుతం అని అనేసేలా లేదు ఒక నూతన దర్శకుడి నుండి ప్రస్తుతం పరిశ్రమ ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి చిత్రం రావడం ఆనందదాయకం అయిన విషయం... ఈ చిత్రాన్ని ఇంకా అద్భుతంగా తెరకెక్కించి ఉండవచ్చు కొన్ని సన్నివేశాలలో పాత్రలకు తగ్గ ఎలివేషన్ దొరకలేదు. ఒక చిత్రం వంద శాతం అనుకుంటే ఈ చిత్రం డబ్బై శాతం వరకు చేరుకోగలిగింది. నిజానికి ప్రేక్షకుడిని ఆకట్టుకోవడానికి ఇది చాలు , ఇలాంటి మరిన్ని చిత్రాలు తెర మీదకు రావాలని తెలుగు ప్రేక్షకులు కోరుకుంటారు. ఒక చిత్ర కథతో సంభంధం లేకుండా ఆసాంతం ఎంజాయ్ చెయ్యగలిగితే మంచి చిత్రం అంటే ఇది మంచి చిత్రం.. ఈ వారం విడుదల అయిన చిత్రాలలో ఇది బెస్ట్ చిత్రం.. ఈ వారం బాక్స్ ఆఫీస్ దగ్గర విజేత ఈ చిత్రం అని ఆలోచించకుండా చెప్పెయవచ్చు... ఇక ఆలోచించడం ఎందుకు వెంటనే దగ్గరలోని థియేటర్ కి వెళ్ళిపొండి..

Sharwanand,Seerat Kapoor,Sujeeth,Pramod Uppalapati,Vamsi Krishna Reddy,Gibran.చివరగా : రన్ రాజా రన్ : ఈ వారం బాక్స్ ఆఫీస్ ని గెలిచేన్

మరింత సమాచారం తెలుసుకోండి: