కాన్సెప్ట్ ,సినిమాటోగ్రఫీ ,కొన్ని కామెడీ సన్నివేశాలు ,నటీనటుల పనితీరు కాన్సెప్ట్ ,సినిమాటోగ్రఫీ ,కొన్ని కామెడీ సన్నివేశాలు ,నటీనటుల పనితీరు కథనంలో పట్టు లేకపోవడం ,కొన్ని సిల్లీ సన్నివేశాలు ,కామెడీ బొత్తిగా వర్క్ అవుట్ కాకపోవడం,బ్రహ్మానందం నటన ,దర్శకత్వం

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాగయినా పెద్ద దర్శకుడు అయ్యి తన చిత్రంతో నంది సాదించాలని నందిగామ నుండి హైదరాబాద్ కృష్ణ నగర్ చేరుకుంటాడు శ్రీనివాస్(శ్రీనివాస్ రెడ్డి) పలు నిర్మాతలకు కథలు చెప్పగా వారెవ్వరూ చిత్రం చెయ్యడానికి ఆసక్తి చూపరు. ఒకరోజు అతనికి రమేష్ రావు(రావు రమేష్) కి కథ చెప్పే అవకాశం వస్తుంది. రమేష్ రావు ఎప్పటికయినా ఒక చిత్రాన్ని నిర్మించి దానికి నంది సాదించి తన తండ్రికి అంకితం ఇవ్వాలి అని అనుకుంటాడు. కాగా అతని కథలో కూడా తననే హీరోగా ఊహించుకోమని కథ చెప్పడం మొదలుపెదతాడు శ్రీనివాస్. ఆ కథ ఇలా సాగుతుంది శ్రీనివాస్ ఉంటున్న ఇంట్లో రోజు రాత్రి అనుకోని కొన్ని సంఘటనలు ఎదురవుతుంటాయి. ఆ ఇంట్లో గతంలో ఉన్న ఒక అమ్మాయి ఆత్మ హత్య చేసుకుందని తెలుస్తుంది . అదే సమయంలో అతనికి అంజలి(అంజలి) పరిచయం అవుతుంది.. కాని కొన్ని అనుకోని సంఘటనలు జరగడంతో.. ఆ ఇంట్లో ఉన్న దయ్యం గురించి వివరాలు తెలుసుకోవలసిన పరిస్థితి ఎదురవుతుంది శ్రీనివాస్ కి .. అసలు ఆ అమ్మాయి ఎవరు ? ఎందుకు చనిపోయింది? ఆత్మ హత్య చేసుకున్న అమ్మాయికి అంజలి కి ఉన్న సంభంధం ఏంటి? అనేవి శ్రీనివాస్ చెప్పిన కథని మరియు మన కథను కూడా పూర్తి చేస్తుంది.. ఇవన్ని జరిగాక శ్రీనివాస్ చెప్పిన కథ ఒప్పుకొని రమేష్ చిత్రం చేసాడా అన్న ప్రశ్నకి కూడా సమాధానం తెర మీదనే చూడాలి...

అంజలి పాత్ర చాలా బాగుంది ఆమె నటన కూడా అందుకు తగ్గట్టుగానే ఆకట్టుకుంది కాని కొన్ని సన్నివేశాలలో తన నటన ఉండాల్సిన స్థాయిలో లేదు. శ్రీనివాస్ రెడ్డి నటన చాలా బాగుంది అతని కామెడీ టైమింగ్ ఈ కొన్ని సన్నివేశాలలో చాలా బాగా పేలింది.. బ్రహ్మానందం రెండవ అర్ధ భాగంలో వచ్చారు ఈయన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఈయన నటన అంతగా ప్రభావం చూపలేకపోయింది. రావు రమేష్ పాత్రకి తగ్గ నటన కనబరిచారు కొన్ని సన్నివేశాలలో అయన శైలి డైలాగ్ డెలివరీ తో ఆకట్టుకున్నారు.. సప్తగిరి, శంకర్ మరియు సత్యం రాజేష్ వారి వారి టైమింగ్ తో అక్కడక్కడా నవ్వులు తెప్పించారు. ప్రత్యేక పాత్రలో కనిపించిన హర్షవర్ధన్ రాణే ఎప్పటిలానే ఆకట్టుకున్నారు. మిగిలిన అందరు నటీనటులు తళుక్కుమని వెళ్ళిపోయారు..

కథ ఇప్పటికే పలు మార్లు విన్నా ఈ చిత్రంలో కొత్త కోణం నుండి చూపించడానికి ప్ర్రయత్నించారు , కాగా కోణం అయితే కొత్తగా ఉంది కాని కథనం మాత్రం అవే పాత సన్నివేశాలతో నింపేశారు, ప్రతి పది నిమిషాలకు ఏదో ఒక చిత్ర రెఫెరెన్స్ తీసుకొచ్చి గెలిచేయ్యలని చూసారు. మొదటి అర్ధ భాగం ఏదో అలా అలా సాగిపోయినా కీలకమయిన రెండవ అర్ధ భాగంలో చిత్రం దారుణంగా తడబడింది. నిజానికి రెండవ అర్ధ భాగంలో ఓపెన్ చేసిన కొన్ని ప్లాట్ లను మొదటి అర్ధ భాగంలో చూపించేసి కాస్త హారర్ మీద మరియు ఇంకాస్త కామెడీ మీద దృష్టి పెట్టి ఉంటె చిత్రం చాలా బాగుండేది.. మాటలు రచించిన కోన వెంకట్ మరీ గొప్పగా ఎం రాయలేకపోయరు సన్నివేశానికి తగ్గ మాటలు రాసారు.. దర్శకత్వం రాజా కిరణ్ కొన్ని సన్నివేశాలను చాలా బాగా హేండిల్ చేసినా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలలో తేలిపోయాడు అక్కడ కావలసిన స్థాయి ఎమోషన్ రాబట్టుకోలేకపోయాడు. అదే సమయంలో కామెడీకి చాలా ఆస్కారం ఉన్న ప్రదేశాలలో సన్నివేశాలు తేలిపోయాయి అంటే ఈ దర్శకుడిలో పరిపఖ్వత లేకపోవడమే కారణం.. సినిమాటోగ్రఫీ బాగుంది చిన్న బడ్జెట్ చిత్రమే అయినా కాస్త రిచ్ లుక్ కలిగించింది ఈ విభాగం.. ప్రవీణ్ లక్కరాజు అందించిన సంగీతంలో రెండు పాటలు బాగున్నాయి కాని నేపధ్య సంగీతం మరియు రీ రికార్డింగ్ చిత్రానికి కావలసిన స్థాయిలో లేవు... ఎడిటింగ్ మరింత బాగుండాల్సింది రెండవ అర్ధ భాగం మరింత వేగంగా సాగి ఉంటె చిత్ర ప్రభావం మరోలా ఉండేది.. ఎం వీ వీ సంస్థ నిర్మాణ విలువలు బాగున్నాయి..

కథలో ఒక పాత్ర కోణం మారిస్తే చూసే ప్రేక్షకుడి ఆలోచించే విధానం కూడా మారిపోతుంది ఈ చిత్ర దర్శకుడు ఈ విషయాన్ని చాలా బాగా గ్రహించాడు కాని ఒక్క విషయాన్ని మరిచిపోయాడు కథనంలో కొత్తదనం లేకపోతే ఏ కోణంలో చూపించినా అది పాతకథలానే అనిపిస్తుంది అన్న విషయం.. ఇక అనుకున్న కాన్సెప్ట్ సరయిన కథనం రాసుకొని ఉంటె చాలా మంచి చిత్రం అయ్యి ఉండేది ... ఎవరో మీరు భయపడితే బాగుంటారు అని చెప్పినట్టు ఉన్నారు ప్రతి పాత్ర ప్రతి సన్నివేశంలో భయపడటానికే ప్రయత్నించింది కాని కారణం ఉండదు. ముందుగానే చెప్పినట్టు ప్లాట్ ని కాస్త ముందుగానే ఓపెన్ చేసుకొని ఉంటె భయపెట్టడానికి నవ్వించడానికి మంచి స్కోప్ దొరికేది అది కాకుండా కంటెంట్ మొత్తాన్ని రెండవ అర్ధ భాగానికి వదిలేసి మొదటి అర్ధ భాగంలో కామెడీ వర్క్ అవుట్ అవ్వట్లేదని తెలిసినా తిరిగి తిరిగి అదే కామెడీ ని చెప్పాలని ప్రయత్నించడం దారుణం.. చిత్రంలో పది వరకు ట్విస్ట్ లు ఉన్నా కూడా ఒక్కటి రెండు తప్ప అన్ని యిట్టె గ్రహించేయచ్చు అవేంటో మీరు తెర మీద చూడవలసిందే ... బ్రహ్మానందం కామెడీ ఉంటుందేమో అనుకోని వెళ్తే నిరాశ తప్పదు అయన నటనలో లోపం లేదు కాని ఆయనకు రాసుకున్న సన్నివేశాలు బొత్తిగా వర్క్ అవుట్ అవ్వలేదు.. హారర్ చిత్రాలలో కీలక పాత్ర పోషించేది రీ రికార్డింగ్ ఈ చిత్రానికి ఈ విభాగం బొత్తిగా సహాయపడలేకపోయింది. ఈ చిత్రంలో ఉన్న సిల్లీ లూప్ హోల్స్ గురించి మాట్లాడటం కూడా అనవసరం.. ఈ చిత్రం అటు ప్రేక్షకుడిని నవ్వించలేదు ఇటు భయపెట్టలేదు.. కొన్ని కామెడీ సన్నివేశాల కోసం కొన్ని ట్విస్ట్ ల కోసం అల్ప సంతోషానికి మీరు సిద్దం అయితే తప్పక ఒకసారి చూడవలసిన చిత్రం ఇది..

Anjali,Srinivasa Reddy,Raj Kiran,M.V.V.Satyanarayana,Praveen Lakkaraju.నవ్వించలేని కామెడీ... భయపెట్టని హారర్!!

మరింత సమాచారం తెలుసుకోండి: