సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ,సినిమాటోగ్రఫీ ,హీరోయిన్ ప్రియల్ గోర్ సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ,సినిమాటోగ్రఫీ ,హీరోయిన్ ప్రియల్ గోర్ హీరో దిలీప్ కుమార్ ,ఒరిజినల్ కెమిస్ట్రీని రీ క్రియేట్ చెయ్యలేకపోవడం, సెకండాఫ్ ,కథనం,డైలాగ్స్- భీమిలీలో కాలేజ్ చదువుతూ, తన ఫ్రెండ్స్ తో కలిసి లైఫ్ ని ఎంజాయ్ చేసే కుర్రాడు సుబ్బు అలియాస్ సుబ్రహ్మణ్య శాస్త్రి (దిలీప్ కుమార్). అలాంటి సుబ్బు తన ఫ్రెండ్ పెళ్లిలో అదే ఊరి పెద్ద అయిన ఖాదర్ ఫ్యామిలీకి చెందిన అయేషా(ప్రియల్ గోర్)ని చూసి ప్రేమలో పడతాడు . ఆ తర్వాత కొద్ది రోజులకి అయేషా కూడా సుబ్బు ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. కానీ ఇద్దరి మతాలు వేరుకావడం వలన సాఫీగా సాగిపోతున్న వారి ప్రేమలో సమస్యలు తలుపుతడతాయి. అయేషా కుటుంబ పెద్దల నుంచి వచ్చిన సమస్యలను సుబ్బు ఎలా ఎదుర్కున్నాడు.? ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకొని ఇద్దరూ ఒకటయ్యారనేది మీరు వెండితెరపై నే చూడాలి....'తట్టతిన్ మరయతు' సినిమాకి రీమేక్ ఇది.. ఒరిజినల్ వెర్షన్ లో హైలైట్ అయ్యింది నటీనటుల నటన..అందులోనూ హీరో - హీరోయిన్ పర్ఫార్మెన్స్, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ మేజర్ హైలైట్ అయ్యింది.. కానీ ఇందులో మాత్రం సినిమాకి ప్రాణమైన హీరో పర్ఫార్మెన్స్ మేజర్ డ్రా బ్యాక్.. దిలీప్ కుమార్ ఫేస్ లో అస్సలు ఎక్స్ ప్రెషన్ కనిపించదు.. నవ్వితే వచ్చే స్మైల్ తప్ప మిగతా ఏ ఎమోషన్ కి సరైన హావభావాలు పలికించలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాలోని ఫీల్ ని మొత్తం పోగొట్టి, సినిమాలో ఉన్న ఫీల్ ని చెడగొట్టింది మన హీరోనే.. హీరోయిన్ ప్రియల్ గోర్ కి ఇది తొలి సినిమానే అయినప్పటికీ ముస్లీం అమ్మాయిగా చాలా బాగా చేసింది. కొన్ని కొన్ని చోట్ల అంత బాగా లేకపోయినా, మిగతా మొత్తం లుక్స్ పరంగా ఎమోషన్స్ పరంగా ఆడియన్స్ ని మెప్పించింది. కొన్ని సీన్స్ లో కుందనపు బొమ్మలా ఉంది. క్లైమాక్స్ ఎపిసోడ్ లో బాగా చేసింది. ఈ ఇద్దరి తర్వాత సినిమాకి కీలకమైన పాత్రలు రెండున్నాయి, అవే రావు రమేష్ పాత్ర, హీరో ఫ్రెండ్ పాత్ర. పోలీస్ ఆఫీసర్ పాత్రలో రావు రమేష్ నటన సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. అయన చేత చెప్పించిన కొన్ని డైలాగ్స్ ఆడియన్స్ ని నవ్విస్తాయి. ఇకపోతే హీరో ఫ్రెండ్ గా చేసిన రాఘవేంద్ర పెర్ఫార్మన్స్ చాలా ఎనర్జిటిక్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ లో తను బాగా నవ్వించాడు. నటీనటులను తయారు చేసే సత్యానంద్ అబ్బాయి అయిన రాఘవేంద్ర సూపర్బ్ గా చేసాడు. ఒకవేళ ఇతను హీరోగా చేసి ఉన్నా సినిమా ఎక్కువ రోజులు ఆడేది. ఇకపోతే తాగుబోతు రమేష్ చేసిన చిన్న పాత్ర సినిమాకి అస్సలు హెల్ప్ అవ్వలేదు. అలాగే గిరి, కొండవలస, సీనియర్ నరేష్, నాగినీడు తదితరులు తమ పాత్రలకు సరిపోయే నటనని కనబరిచారు. ఒరిజినల్ మలయాళ వెర్షన్ లో టెక్నికల్ టీంలో ప్రాణం పోసింది మ్యూజిక్ మరియు సినిమాటోగ్రఫీ. ఇక్కడ కూడా అవి రెండే సినిమాకి ఊపిరిపోశాయి. మలయాళ సినిమాకి మ్యూజిక్ నడించిన షాన్ రెహ్మాన్ తెలుగుకి కూడా మ్యూజిక్ అందిచాడు. రెహ్మాన్ మ్యూజిక్ సింప్లీ సూపర్బ్.. సీన్ లో ఉండాల్సినంత కెమిస్ట్రీ కనపడకపోయినా తన మ్యూజిక్ తో ఆడియన్స్ లో ఆఫీ రప్పించడానికి చాలా ట్రై చేస్తాడు. అందులో చాలా సీన్స్ లో సక్సెస్ కూడా అయ్యాడు. ఇకపోతే సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ కళ్ళకు ఓ కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. ప్రతి ఫ్రేం, ప్రతి విజువల్ చాలా గ్రాండ్ గా ఉంటుంది. సీన్ బాలేకపోయినా విజువల్స్ బాగుండడంతో మన కళ్ళను పక్కకి తిప్పుకోలేము. ఇకపోతే ఎడిటర్ ప్రవీణ్ పూడి ఎడిటింగ్ లో ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఉందనిపిస్తుంది, కానీ సెకండాఫ్ మాత్రం బాగా గట్టిగా దేబ్బెసేసాడు అనే ఫీలింగ్ ని తెప్పిస్తుంది. ఎందుకంటే సెకండాఫ్ చాలా బోరింగ్ గా సాగదీసినట్టు ఉంటుంది. ఇక చెప్పాల్సింది కథనం - దర్శకత్వం వహించిన శశికిరణ్ నారాయణ గురించి.. శశికిరణ్ లో టాలెంట్ బాగుంది కానీ ఆమె నటీనటులని ఎంచుకోవడంలో ముందు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆమె ఎంత మంచి సీన్స్ రాసుకున్నా వాటికి ప్రాణం పోయాల్సింది మాత్రం నటీనటులే.. సో నెక్స్ట్ టైం నుంచి కేర్ తీసుకుంటే మంచి ప్రోడక్ట్ ని అందించవచ్చు. ఇక కిట్టు రాసిన డైలాగ్స్ మలయాళం నుంచి యాజిటీజ్ గా అనువదించాడు. పెద్దగా తెలుగు బ్రెయిన్ ఏమీ వాడలేదు. రీమేక్ సినిమా అంటే మన వాళ్ళు బ్లైండ్ గా ఆ సినిమాలోని లోకేషన్స్, సీన్స్, డైలాగ్స్, సాంగ్స్ ని కాపీ కొట్టడంలో ఎప్పుడూ ముందుంటారు.. కాబట్టి వాటి గురించి పక్కన పెట్టేస్తా... ఇవన్నీ కాపీ కొట్టినా లేదా యాజిటీజ్ గా పెట్టినా వాళ్ళు చేయాల్సింది ఒరిజినల్ కంటెంట్ లో ఉన్న మేజిక్ ని, కెమిస్ట్రీని ఇక్కడ రీ క్రియేట్ చెయ్యగలగాలి. కానీ అలా రీక్రియేట్ చెయ్యలేకపోతే.. ఆ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద విడుదలైన వారమే తట్టా బుట్టా సర్దేసుకోవాలి.. సేమ్ టు సేమ్ ఈ సినిమాకి కూడా అదే జరిగింది. ఈ సినిమా ఒరిజినల్ కథ ఓ ఫీల్ గుడ్ లవ్ స్టొరీ.. ఇక్కడికి వచ్చేసరికి విజువల్స్ పరంగా ఫీల్ గుడ్ లానే ఉంది కానీ లవ్ స్టొరీ దగ్గరికి వచ్చేసరికి ఫీల్ వరస్ట్ స్టొరీ గా తయారయ్యింది. దానికి ఎన్ని కారణాలు ఉంటే అన్ని కారణాలకి కారణం హీరో దిలీప్ కుమార్ మాత్రమే కావడం చెప్పదగిన విషయం.. తను కాకుండా ఇంకాస్త బెటర్ గా పెర్ఫార్మన్స్ చేసే ఏ నటుడైనా హీరోగా నటించి ఉన్నా ఈ సినిమా రిజల్ట్ మరోలా ఉండేది. ఎందుకంటే ఈ సినిమా కథలో ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే మేజిక్ ఉంది.. ఈ సినిమా మొత్తం హీరో చుట్టూనే తిరుగుతుంది.. కావున హీరోయిన్ ప్రియల్ గోర్, రావు రమేష్, రాఘవేంద్ర లాంటి నటీనటులు ఎంతగా ట్రై చేసినా కాపాడలేకపోయారు. డైరెక్టర్ శశికిరణ్ నారాయణ తన వంతుగా చాలా కష్టపడింది. కానీ తనకు ఇచ్చిన హీరోలో హావభావాలు పలకక పోవడంతో తను మిగతా వారితో మేనేజ్ చెయ్యడానికి ట్రై చేసింది కానీ అస్సలు ఉపయోగం లేకపోయింది. ఫైనల్ గా సూపర్ హిట్ కాన్సెప్ట్ ని తెలుగులో సాహెబా సుబ్రహ్మణ్యంగా తీసి మెప్పించలేకపోయారు. ఎప్పటిలానే మన టాలీవుడ్ మరో మంచి రీమేక్ కాన్సెప్ట్ ని మూసీ నదిలో కలిపేసింది.Dileep Kumar,Priyal Gor,Sasi Kiran Narayana,Kolla Nageshwara Rao,Shaan Rahman.పంచ్ లైన్ : సాహెబా సుబ్రహ్మణ్యం - సాహెబా బాగున్నా సుబ్రహ్మణ్యం ముంచేసాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: