సినిమాటోగ్రఫీ ,ఫైట్స్ ,నేపధ్య సంగీతం సినిమాటోగ్రఫీ ,ఫైట్స్ ,నేపధ్య సంగీతం చాలా సన్ననయిన కథ,నెమ్మదిగా సాగే కథనం ,సంభాషణలు ,పాత్రల తీరు తెన్నులు సరిగ్గా లేకపోవడం,దర్శకత్వం

కార్తిక్ (నాగ చైతన్య) , రచయిత అవ్వాలన్న ఆశయం ఉన్న ఒక యువకుడు కాని అతని ఇంట్లో మాత్రం అతన్ని బాద్యత రహితంగా తిరిగే కుర్రాడిలానే చూస్తారు తండ్రి చంద్ర మోహన్(సుమన్) అంటే కార్తీక్ కి అమితమయిన గౌరవం ఉంటుంది. ఇదిలా ఉండగా కార్తీక్ ఒకరోజు నందన(పూజ హెగ్డే) ని చూడగానే ప్రేమలో పడిపోతాడు.. అప్పటి నుండి నందన కోసం వెతకడం ప్రారంభిస్తాడు కార్తీక్ కాని కొన్ని అనుకోని పరిస్థితులలో కార్తీక్ ని నందన ద్వేషిస్తుంది.. చివరికి కార్తిక్ మరియు నందన కలిసాక వారికి తెలియకుండానే వాళ్ళ ఇంట్లో వారిద్దరికీ పెళ్లి నిశ్చయిస్తారు. కాని కార్తిక్ అంటే ఇష్టం లేని నందన ఎలాగయినా పెళ్లి ఆపాలి అనుకుంటుంది.. పెళ్లి జరిగే లోపు నందనను తన ప్రేమలో ఎలాగయినా పడెయ్యాలి అనుకుంటాడు కార్తిక్.. ఎవరి ప్రయత్నం గెలిచింది? ఎలా గెలిచింది? అన్నదే మిగిలిన కథ ...

నాగ చైతన్య నటనాపరంగా చాలా అభివృద్ధి చెందాడు కాని చిత్రం మొత్తాన్ని తన భుజాల మీద మోసే స్థాయికి ఇంకా చేరుకోలేదు. ఈ చిత్రంలో కూడా అతనిది ఒక పాత్రలా మాత్రమే ఉంటుంది కాని కీలక పాత్ర అన్న భావన ఎక్కడా కలగదు.. పూజ హెగ్డే చూడటానికి బాగుంది గత చిత్రం "మాస్క్" పోలిస్తే నటన బాగున్నా కూడా ఈ చిత్రానికి, ఈ పాత్రకి సరిపోలేదు అనిపిస్తుంది. చిన్మయి అందించిన గాత్రం ఈ పాత్రకు సరిగ్గా సరిపోయింది. షాయాజీ షిండే , సుమన్ ,రోహిణి మరియు సుధా లు చిత్రానికి కథకి కావలసిన కుటుంబ వాతావరణాన్ని తీసుకొచ్చారు కాని వీరి స్థాయికి తగ్గ సన్నివేశాలు కనపడలేదు.. శ్యామల మరియు మధు వారి పాత్రలకు న్యాయం చేసారు. అలీ అప్పుడప్పుడు కామెడీ పండించారు. వెన్నెల కిశోర్ రెండు సన్నివేశాలలో మాత్రమే కనిపించినా ఆకట్టుకున్నారు. శ్రీనివాస్ రెడ్డి , పోసాని కృష్ణ మురళి మరియు ఇతర నటులు అలా కనిపించి వెళ్ళిపోయిన వారే ...

విజయ్ కుమార్ కొండ ఎంచుకున్న కథ ఇప్పటికే పలుమార్లు తెర మీదకి వచ్చినదే కాని ఎప్పుడు సబ్ ప్లాట్ లాగ వచ్చే ఈ కథనే మెయిన్ ప్లాట్ గా ఎంచుకున్నారు దర్శకుడు. కథనం కూడా ఆయనే రచించుకున్నారు సన్నివేశాల వరకు ఊహించుకోడానికి బాగున్నా తెర మీదకు అంత అందంగా తీసుకురావడంలో దర్శకుడు విఫలం అయ్యారనే చెప్పుకోవాలి. అంతే కాకుండా ఏ రెండు పాత్రల మధ్యన కూడా బంధాన్ని సరిగ్గా చూపించలేదు. సెంటిమెంట్ సరిగ్గా పండకపోవడానికి ఇదొక కారణం .. కామెడీ కూడా పూర్తిగా వర్క్ అవుట్ అవ్వలేదు మొదటి అర్ధ భాగంలో కొన్ని సన్నివేశాలు బాగున్నా రెండవ అర్ధ భాగంలో కుటుంబ కథ చిత్రానికి మరియు ప్రేమ కథ చిత్రానికి మధ్యలో చిత్రం ఇరుక్కుపోయింది. ఈ చిత్ర దర్శకుడు మరియు రచయిత విఫలం అవ్వడం వలన ఇటు అటు కాకుండా మధ్యలో ఆగిపోయింది.. మాటలు కూడా అక్కడక్కడ కొన్ని బాగున్నాయి కాని సన్నివేశానికి బలం ఇచ్చే సంభాషణలు తక్కువగానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ అంద్దించిన ఆండ్రూ లొకేషన్స్ మరియు నటీనటులను చాలా అందంగా చూపించారు.. కాని కొన్ని సంనివేశ్లలో బాగా బ్రైట్ గా అనిపించింది.. అనూప్ రూబెన్స్ సంగీతంలో నలుగు పాటలు బాగున్నాయి తెర మీద రెండు పాటలు మాత్రమే ఆకట్టుకునాయి "ఒక లైలా కోసం" రీమిక్స్ వినడానికి బాగున్నా కూడా తెర మీద ఆకట్టుకోలేదు .. అయన నేపధ్య సంగీతం బాగుంది. ప్రావిన్ పూడి ఎడిటింగ్ మొదటి అర్ధ భాగంలో చాలా బాగుంది రెండవ అర్ధ భాగంలో చాలా సన్నివేశాలు సాగుతున్నట్టు అనిపిస్తాయి.. అన్నపూర్ణ సంస్థ వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి...

ఒక లైలా కోసం చిత్రంలో చాలా మంచి సన్నివేశాలు ఉన్నాయి కాని దర్శకత్వ లోపం వలెనే అవి సరిగ్గా చూపించలేకపోయారు. పాత్రల మధ్య బంధాన్ని సరిగ్గా చూపించి ఉంటె సన్నివేశాలలో బలం పెరిగి ఉండేది. ఈ విషయంలో కూడా దర్శకుడు ఘోరంగా విఫలం అయ్యారు. మొదటి అర్ధ భాగం కాస్త వేగంగానే గడిచిపోయినా సమస్య రెండవ అర్ధ భాగంలో మొదలవుతుంది. ఎలాగు హీరో హీరోయిన్ కలిసిపోతారు అని తెలిసాక ప్రేక్షకుడిలో ఎలా కలుస్తారు అన్న ఒక్క ఆసక్తి తప్ప ఇంకేం ఉండదు. ఈ చిత్రంలో ఎలా కలిసారు అన్న అంశం మీద దృష్టి సారించలేదు అక్కడ కాస్త బలమయిన పాయింట్ పేటి ఉండాల్సింది క్లైమాక్స్ కాస్త పర్లేదు అనిపించినా ప్రేక్షకుడు ఇంకాస్త బలమయిన క్లైమాక్స్ ఆశిస్తాడు.. ఈ వారం మరే చిత్రం లేదు కాబట్టి ఈ చిత్రాన్ని ఒక్కసారి ప్రయత్నించవచ్చు...

Naga Chaitanya,Pooja Hegde,Vijay Kumar Konda,Akkineni Nagarjuna,Anoop Rubens.ఒక లైలా కోసం : ఒకసారి టైం పాస్ కోసం ...

మరింత సమాచారం తెలుసుకోండి: