BusStop Full English Review    ఈ రోజుల్లో సినిమాతో తొలి ప్రయత్నంలో హిట్ సాధించడమే కాకుండా, తన కంటూ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మారుతి. ఈ దర్శకుడు రూపొందించిన కొత్త సినిమా బస్ స్టాప్.  ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మించడంతో ఈ సినిమా మరింత ఆసక్తి కలిగించింది. ఆదివారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బస్ స్టాఫ్ సినిమా ఎలా ఉందో చూద్దాం..! చిత్రకథ :   శ్రీను (ప్రిన్స్) పదవ తరగతిలోనే తన క్లాస్ మేట్ శైలు (దివ్య)ను లవ్ చేస్తాడు.  అయితే అతను చేసిన ఒక చిన్న తప్పు కారణంగా దివ్య అతని మీద కోపం పెంచుకుని, దూరంగా ఉంటుంది. డిగ్రీలో మళ్లీ అతనికి క్లాస్ మేట్ గా వస్తుంది. తరువాత శ్రీను ను ఇష్టపడుతుంది. ప్రేమించిన శ్రీను కోసం తల్లి తండ్రులను కాదనుకుని బయటికి వచ్చేస్తుంది. శ్రీనును పెళ్లి చేసుకుంటుంది. మళ్లీ తల్లితండ్రుల వద్దకు ఎలా వెళుతుంది, వారి ప్రేమను ఏ విధంగా అర్థం చేసుకుంటుందనే అంశం ప్రధానంగా కథ సాగుతుంది. ఈ కథకు కొన్ని ఉప కథలుతో  సినిమా సాగుతుంది. నటీనటుల ప్రతిభ :   ప్రిన్స్, దివ్య తమ పాత్రల పరిధిలో నటించారు. సాయికుమార్ నవ్వించాడు. గ్లామర్ పరంగా హీరోయిన్ దివ్య కంటే హసికకు ఎక్కువ మార్కులు పడతాయి.  ఆమె నటన కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. చిన్న పాత్రలోనే కనిపించినా రావు రమేష్ మంచి నటన కనబరిచాడు. సాధారణ సన్నివేశాలను కూడా తన నటనతో రక్తి కట్టించాడు. మిగిలిన వారు తమ పాత్రల పరిధిలో నటించారు.     సాంకేతిక వర్గం పనితీరు :   ఫోటోగ్రఫీ ఓకే. సంగీత బావుంది. నీ వల్లే.. నీ వల్లే.. పాట బాగుంది. ఈ చిత్రానికి మాటలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ద్వంద్వ అర్థాల మాటలతో పాటు, మంచి అర్థవంతమైన మాటలు కూడా ఈ సినిమాలో ఉన్నాయి. ‘వాడికి చదువంటే ఇష్టం, చెడగొట్టడం కష్టం,’ ‘అమ్మ అయ్యాక కూడా నీకు అమ్మ గురించి తెలియక పోతే అమ్మతనానికి అర్థం లేదు’ వంటి మాటలు ఆకట్టుకుంటాయి.  నిర్మాణ విలువలు ఓకే. దర్శకుడు మారుతి మొదటి చిత్రానికి మంచి వసూళ్లు వచ్చినా, ఆ సినిమా యూత్ సినిమాగాను, బూతు సినిమా గాను ముద్ర పడింది. దీంతో బస్ స్టాఫ్ సినిమాతో ఆ ముద్రను తొలగించుకోవడానికి దర్శకుడు ప్రయత్నించాడు. ఈ సినిమాతో తల్లిదండ్రుల ఆవేదనను చూపించడానికి ప్రయత్రం చేశాడు. యువతకు కావాలసిన సన్నివేశాలు, మాటలు ఉపయోగించుకుంటూనే వారికి ఒక సందేశం ఇవ్వడానికి కృషి చేశాడు. హైలెట్స్ :   కామెడీ సీన్స్, మాటలు, సంగీతం, రావు రమేష్ నటన  డ్రాబ్యాక్స్ :   కథ,  కొన్ని దృశ్యాలలో అతిగా అనిపించే కామెడీ. చివరగా :   ఈ బస్ స్టాప్ లో తల్లిదండ్రులకూ ప్లేస్ ఉంది. 
Pasad can be reached at: Yedida.Viswaprasad@apherald.com
Editor can be reached at: editor@apherald.com
More Articles on Bus Stop  || Bus Stop Photos & Wallpapers || Bus Stop Videos  

మరింత సమాచారం తెలుసుకోండి: