నిన్న ‘బ్రూస్ లీ’ సెన్సార్ కార్యక్రమాలు నిన్న పూర్తి చేసుకోవడంతో దసరా రేస్ విషయమై మరింత స్పష్టత  రావడమే కాకుండా ఈ నెల 16వ తారీఖున విడుదల అవడానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. సెన్సార్ అధికారులు పెద్దగా కట్స్ ఏమి చెప్పకుండా యూ/ఎ సర్టిఫికేట్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు ఒక విషయమై షాక్ అయినట్లు టాక్. 

సామాన్యంగా శ్రీనువైట్ల సినిమాల నిడివి ఎక్కువగా ఉంటుంది. ‘దూకుడు’, ‘బాద్ షా’, ‘ఆగడు’ లాంటి సినిమాలు అన్నిటినీ శ్రీనువైట్ల పెద్ద నిడివితో తీసాడు. అయితే ఈ పద్ధతికి విరుద్ధoగా ‘బ్రూస్ లీ’ సినిమాను 2 గంటల 26 నిమిషాల నిడివితో చిన్న సినిమాగా తీయడం సెన్సార్ బోర్డు సభ్యులకు షాక్ ఇచ్చినట్లు టాక్. 

ఈమధ్య కాలంలో భారీ నిడివితో వచ్చిన ‘కిక్-2’, ‘శివమ్’ సినిమాలు ఘోర పరాజయం చెందడంతో శ్రీను వైట్ల ‘బ్రూస్ లీ’ విషయంలో ప్రేక్షకులకు ఎటువంటి అసహనం కలుగకుండా ఈనిర్ణయం తీసుకున్నాడని టాక్. ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యుల నుండి బయటకు లీక్ అయిన సమాచారం మేరకు శ్రీనువైట్ల స్క్రీన్ ప్లే ఈ సినిమాకు హైలైట్ అంటున్నారు. ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా ఎంటర్ టైనింగ్ గా సినిమా రన్ అవుతుందని టాక్. 

ఫస్ట్ హాఫ్ లో రొమాన్స్, పాటలు, కామెడీ ప్రేక్షకులను అలరిస్తే సెకండ్ హాఫ్ లో కొన్ని ట్విస్టులు ఊహించని విధంగా ఉంటాయని టాక్. చిరంజీవి స్పెషల్ రోల్ 4 నిమిషాలు ఉంటుందని తెలుస్తోంది. టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేయాలని కలలు కంటున్నా చరణ్ కలలకు ప్రేక్షకులు ఇచ్చే తీర్పు గురించి అందరూ ఆశక్తిగ ఎదురు చూస్తున్నారు. ఏది ఎలా ఉన్నా ఈ సినిమా ఘన విజయం చరణ్ కెరియర్ చాల అవసరం..  
 



మరింత సమాచారం తెలుసుకోండి: