రామ్ చరణ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారడంతో  చరణ్  శ్రీమంతుడు కాడా అంటూ సెటైర్లు పడుతున్నాయి. మహేష్ ‘శ్రీమంతుడు’ విడుదల అయిన తరువాత ఆసినిమా ప్రభావంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోని పలువురుస్టార్లు గ్రామాలను దత్తత తీసుకునే కాన్సెప్టును ఫాలో అవుతున్న సంగతి తెలిసిందే. 

అయితే తన తండ్రి వారసుడిగా అనేక సామాజిక కార్య క్రమాలలో పాల్గొంటున్న చరణ్ ను ఈమధ్య ఒక మీడియా సంస్థ ప్రతినిధి మీరు కూడా ఏదైనా గ్రామాన్ని ద‌త్త‌త తీసుకుంటారా ? అని అడిగితే చరణ్ చాలా విలక్షణంగా సమాధానం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తాను బాగా డ‌బ్బులు సంపాదించాక అప్పుడు ఏదైనా గ్రామాన్ని ద‌త్త‌త తీసుకుంటాన‌ని  చ‌ర‌ణ్‌చెప్పాడు అని టాక్. 

ఈసమాధానానికి ఆ మీడియా సంస్థ ప్రతినిధికి మైండ్ బ్లాంక్ అయిందట. ఈ న్యూస్ మీడియాకు  లీక్ కావడంతో  ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూ చేతినిండా సంపాదిస్తూ మరో వైపు  వ్యాపారాలు కూడా చేస్తున్న రామ్ చరణ్ దగ్గర డబ్బులు లేవా ? అంటూ వెబ్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.  ఈవార్తలు చదివినవారు మటుకు చాల ఆశ్చర్య పడుతున్నారు.

ఇలా ఉండగా ఈవారం విడుదల అవుతున్న ‘బ్రూస్ లీ’ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3వేల థియేటర్స్‌లో విడుదల కాబోతోంది అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో ‘బ్రూస్ లీ’ టాలీవుడ్ లో మరోసరి కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది అంటూ వెబ్ మీడియా లో మెగా అభిమానులు అప్పుడే హడావిడి మొదలు పెట్టేసారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి ‘బాహుబలి’,  ‘శ్రీమంతుడు’ 100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోగా చరణ్ ‘బ్రూస్ లీ’  ఈ విషయంలో మూడవ సినిమా అవుతుందని మెగా అభిమానులు ధీమాగా ఉన్నారు. ఏమైనా వరస విజయాలతో టాలీవుడ్ పరిశ్రమ కళకళలాడి పోతోంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: