పవన్ తీసుకున్న ఒక లేటెస్ట్ నిర్ణయం రామ్ చరణ్ కు ఊహించని షాక్ ఇచ్చింది అని వార్తలు వస్తున్నాయి. మెగా కుటుంబ హీరోల సినిమా ఫంక్షన్లకు ఎన్నిసార్లు పిలిచినా దూరంగా ఉండే పవన్ ఈరోజు మెగా ఫ్యామిలీకి మరోషాక్ ఇస్తున్నాడు. యంగ్ హీరోలలో నితిన్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ను తన సినిమాల విజయంకోసం రకరకాలుగా వాడుకుని పవన్ కు దేముడిచ్చిన తమ్ముడిగా  మారిపోయిన విషయం తెలిసిందే. 

ఇప్పుడు అదే  బాటను యంగ్ హీరో నిఖిల్  అనుసరిస్తున్నాడు ‘స్వామి రారా', 'కార్తికేయ', 'సూర్య వర్సెస్‌ సూర్య' ఇలా వరుస విజయాలు అందించిన ఉత్సాహంలో ఉన్నాడు నిఖిల్‌. ఇప్పుడు 'శంకరాభరణం' అనే మరో వినూత్న కథతో అలరించడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతో ఉదయ్‌ నందనవనమ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విజుువల్ టీజర్ ని నేడు  పవన్ కళ్యాణ్ విడుదల చేయనున్నాడు. 

ఈవిషయాన్ని స్వయంగా నిఖిల్ తన  ట్వీటర్ లో తెలియచేసాడు  పవన్ కళ్యాణ్ క్రేజ్ కామధేనువు లాంటిదని ఇప్పటికే  టాలీవుడ్ లో అనేకసార్లు  రుజువయింది. పవన్ పేరుతొ పాటలు, పవన్ ప్రస్తావనతో డైలాగులు ఇలా రకరకాలుగా పవన్ ని వాడుకుంటూ టాలీవుడ్ లో మనుగడ సాధిస్తున్న యంగ్ హీరోల సంఖ్య రోజురోజుకీ పెరిగి పోతోంది. 

కోన వెంకట్ స్క్రిప్ట్ రచించిన ఈసినిమాకు టైటిల్ పరంగా ఇప్పటికీ క్రేజ్ ఎర్పడిన నేపధ్యంలో పవన్ చేయి పడడంతో ఈసినిమాకు మంచి క్రేజ్ ఏర్పడటమే కాకుండా బిజినెస్ పరంగా కూడ కలిసి వస్తుంది అని అంటున్నారు. అయితే మెగా కుటుంబ హీరోల ఫంక్షన్స్ కు దూరంగా ఉండే పవన్ ఈ సినిమా టీజర్ ను విడుదల చేయడం వెనుక ఏమైనా కారణం ఉందా అనే వార్తలు వినిపిస్తున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: