బాహుబలి’ సినిమా చివరిలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అన్న సందేహాలతో ప్రేక్షకుల మెదడును తిన్న రాజమౌళి ప్రస్తుతం అన్వేషణ కార్యక్రమాన్ని చేపట్టాడు. ఎన్నో వెరైటీ ఆలోచనలకు కేంద్రంగా ఉండే ఆయన మేధస్సు ఒక విషయంలో అయోమయంలో పడింది అన్న వార్తలు వస్తున్నాయి. 

ఆ అయోమయం నుంచి బయట పడటానికి రాజమౌళి ‘బాహుబలి2’ షూటింగ్ కోసం అనువైన లొకేషన్స్ వేటలో మునిగిపోయాడు అన్న వార్తలు వస్తున్నాయి. ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, మకుట వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ పీట్ డ్రేపర్ తో కలిసి జక్కన్న ‘బాహుబలి 2’ కు సరైన షూటింగ్ స్పాట్స్ కోసం వెతుకుతున్న ఫొటోను రాజమౌళి స్వయంగా తన ట్విటర్ లో పోస్ట్ చేసాడు. 

ఈమధ్య కాలంలో ‘బాహుబలి 2’ షూటింగ్ ఇప్పట్లో ప్రారంభం కాదేమో అన్న వార్తలకు సమాధానంగా రాజమౌళి ఈఫోటోను పోస్ట్ చేసాడు అనుకోవాలి. ఇప్పటికే ‘బాహుబలి 2’ సంబంధించి 30% షూటింగ్ గతంలోనే పూర్తి అయింది అనే వార్తలు ఉన్నాయి. అయితే లేటెస్ట్ గా ‘బాహుబలి 2’ కథ విషయంలో రాజమౌళి మరిన్ని మార్పులు చేసిన నేపధ్యంలో షూటింగ్ పూర్తి అయిన సన్నివేశాలను కూడ రాజమౌళి రీషూట్ చేసే ఆలోచనలో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. 

ఈ సినిమా రెండవ భాగం షూటింగ్ ప్రారంభం కాకుండానే బిజినెస్ పరంగా వందల కోట్ల స్థాయిలో ఆఫర్లు వస్తున్నా రాజమౌళి పట్టించుకోకుండా ‘బాహుబలి2’ పూర్తి అయిన తరువాత ఆలోచిద్దాం అని చెప్పడం బట్టి జక్కన్నకు తన ‘బాహుబలి 2’ పై ఎంత భారీ అంచనాలు ఉన్నాయో అర్ధం అవుతుంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: