మీడియా లు సెలెబ్రిటీ ల విషయంలో ఓవర్ గా ఇన్వాల్వ్ అవ్వడం, వారి వ్యక్తిగత విషయాలలో తల దూర్చేసి మరీ ఓవర్ యాక్షన్ చెయ్యడం మామూలు విషయమే. కానీ తమిళ, బాలీవుడ్ మీడియా ల స్థాయి ముందు మనవారు కాస్త వెనకా ముందూ చూసుకుని రాతలూ, చేతలూ, వీడియో లు వదులుతారు. అక్కడ అలా కాదు మరీ ముఖ్యంగా ముంబై మీడియా ఇష్టం వచ్చినట్టుగా సెలెబ్రిటీల జీవితాల మీద రాతలు రాసేస్తూ ఉంటారు వారు.


ప్రభాస్ ఇప్పుడు భారీ ఇండియన్ స్టార్ అయ్యాడు


బాహుబలి లాంటి ఖలాఖండం దేశ వ్యాప్త సంచలనమయిన తరవాత ప్రభాస్ ఇప్పుడు భారీ ఇండియన్ స్టార్ అయ్యాడు. అతని బాహుబలి 2 కోసం తెలుగు వారికంటే ఎక్కువగా హిందీ జనాలు కూడా ఎదురు చూస్తున్నారు దీంతో అక్కడ మీడియా కి అతనొక పెద్ద "అంశం". ప్రభాస్ గురించి మనకి తెలిసిన దానికంటే కొత్త కొత్త రాతలు మొదలు పెట్టేసింది బాలీవుడ్ మీడియా. ఈ మధ్య ఇంటర్వ్యూలో బాహుబలి 2 తరవాత కానీ పెళ్లి జోలికి వెళ్ళను అని ప్రకటించిన ప్రభాస్ అలా చేస్తే సినిమా కీ, అటు భార్య కీ ఇద్దరికీ అన్యాయం చేసినవాడిని అవుతాను అని చెప్పుకొచ్చాడు, బాలీవుడ్ మాత్రం అతని మాటలేమీ పట్టించుకోవట్లేదు.


మనోడు భీమవరంకు చెందిన ఒక అమ్మాయిని ఓకె చేసినట్లు ప్రచారం చేస్తున్నారు. 36 ఏళ్ళ ప్రభాస్ మన షాహిద్ కపూర్ తరహాలో ఒక 22 ఏళ్ళ అమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్నాడని అక్కడ రూమర్లను చెక్కేస్తున్నా వయసు సంగతి పక్క పెట్టినా భీమవరం అమ్మాయి అంటూ బాలీవుడ్ వాళ్ళు ప్రచారం చెయ్యడం కామెడీగా ఉంది. బాహుబలి 2 వరకూ పెళ్లి సంగతి ససేమిరా అంటున్న ప్రభాస్ ఈ విషయంలో బాలీవుడ్ చేస్తున్న ప్రచారానికి ఖంగుతిన్నాడు.


ఎవరో ఒక పిల్లని కుటుంబ సభ్యులు చూసి ఉండచ్చు, లేదా టాక్స్ నడుస్తూ ఉండచ్చు గాక ఆ అంశాన్ని తెలుగు మీడియా నే అసలు ప్రచారం చెయ్యకుండా బాలీవుడ్ జనాలు ఇష్టం వచ్చినట్టు చెప్పేయడం, అది కూడా పెద్ద చానల్స్ లో రావడం తో చిరాకుగా ఉన్నాడట ప్రభాస్. 


మరింత సమాచారం తెలుసుకోండి: