బాహుబలి, రుద్రమదేవి విజయం కథానాయిక అనుష్కను ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. ఇప్పుడామె రెమ్యునరేషన్‌లో కాకున్నా ఎవరికీ తీసిపోని నటిగా నిలిచిపోయింది. ఇప్పుడు ఆమె మరొక చారిత్రక పాత్రను పోషించడానికి సిద్దమవుతోంది. అంతా ఆమె అనుకున్నట్లుగా జరిగిపోతే, భాగమతి పాత్రలో నటించనుంది. హైదరాబాద్ పాలకుడు, ఆ నగర నిర్మాత కులీకుతుబ్‌షా ప్రేయసి భాగమతి. గతంలోనే అనుష్కకు ఈ పాత్రను ఆఫర్ చేసినా ఆమెకు ఆ విషయంలో స్పష్టత లేకుండా పోయింది. కానీ బాహుబలి అఖండ విజయం సాధించడంతో అనుష్క ఈ కొత్త ప్రాజెక్టు చేయడానికి తలూపింది.


భాగమతి పాత్రను చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు బాహుబలి సహనటుడు ప్రభాస్ ఆమె మనసు మార్చి ఒప్పించాడట. యూవీ క్రియేషన్స్ చిత్ర నిర్మాణసంస్ధను స్థాపించిన ప్రభాస్ మిత్రులు ప్రమోద్, వంశీలు భాగమతి సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చారు. ఈ సినిమాకు అశోక్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. కానీ అశోక్ కుమార్ దర్సకత్వ ప్రతిభపై అనుష్కకు అంతగా నమ్మకం లేకపోవడంతో ప్రభాస్ ఆమెకు నచ్చచెప్పి, చిత్ర నిర్మాణ సంస్ధ ఆ విషయాన్ని చూసుకుంటుందని చెప్పాడట. ప్రభాస్ సూచనతో అనుష్క భాగమతి పాత్ర పోషణకు ఆమోద ముద్ర వేసిందని బోగట్టా. 


వచ్చే సంవత్సరం ఈ సినిమాను ప్రారంభించనున్నారు. దక్కన్ సుల్తాన్ కులీకుతుబ్ షా హైదరాబాద్‌ నగరాన్ని భాగమతి కోసం నిర్మించాడని చరిత్ర చెబుతోంది. అందుకే  హైదరాబాద్‌కు భాగమతి అనే పేరు కూడా వచ్చింది.



మరింత సమాచారం తెలుసుకోండి: