దర్శకుడు ఎస్ జే సూర్య పవన్ కళ్యాణ్ కి ఖుషీ లాంటి భారీ హిట్ ఇచ్చాడు, కొన్నాళ్ళ తరవాత కొమరం పులి ఇచ్చాడు ఆ దెబ్బకి  పవన్ కళ్యాణ్ సూర్య కి ఛాన్స్ కాదు కదా కనీసం కాంటాక్ట్ కి కూడా దొరకని పరిస్థితి, ఒక్కడు లాంటి భారీ సినిమా తీసిన గుణశేఖర్ విషయంలో సైనికుడు దెబ్బకి మహేష్ బాబు కూడా ఇలాగే ప్రవర్తించాడు. ఎంత అడిగినా రుద్రమదేవి లో గోన గన్నా రెడ్డి క్యారెక్టర్ కి ససేమిరా అన్నాడు. అంతగా ఆ ప్లాపులు తమమీద ముద్ర వేస్తాయి.


 వీరిద్దరే కాదు ఎంతటి మహా మహా స్టార్ లు అయినా తీవ్రంగా ప్లాప్ వచ్చిన సమయంలో చిన్నబుచ్చుకుని సైలెంట్ అయిపోతారు. అంతకుమించి ఏమీ చెయ్యలేరు కావచ్చు, ఎంతగానో నమ్మినా ప్లాప్ ఇచ్చారు అన్న పంతం కావచ్చు కారణం ఏదైనా వారు సైలెంట్ అయిపోయి ఛాన్స్ అనేది ఇంకొకసారి ఆ కొత్త దర్శకులకి ఇవ్వడానికి జంకుతారు.


ఇలాంటి పరిస్థితిలో ఇండస్ట్రీ లో దర్శకుడిని ఎవరూ నమ్మనంతగా నమ్మిన ఏకైక హీరో కళ్యాణ్ రాం మాత్రమె. తనకి అభిమన్యు లాంటి ప్లాప్ ఇచ్చాడు దర్శకుడు మల్లిఖార్జున్, తరవాత మళ్ళీ కత్తి అంటూ మరొక అవకాశం ఇచ్చాడు కళ్యాణ్ రాం అది కూడా ప్లాప్ అవడం విశేషం. ఇలా వరసగా రెండు ప్లాప్ లు పడ్డంతో మల్లి చాలా బాధపడ్డాడు కానీ కళ్యాణ్ మాత్రం మళ్ళీ మళ్ళీ ఆ దర్శకుడికి ఛాన్స్ లు ఇస్తూనే ఉన్నాడు. ఇవాళ విడుదల అవుతున్న షేర్ సినిమాకి దర్శకుడు మల్లి అన్న విషయం తెలిసిందే.


కళ్యాణ్ నమ్మకమే ‘షేర్’ సినిమా అంటూ ఆడియో ఫంక్షన్లో ఉద్వేగానికి లోనయ్యాడు మల్లి. మరి కళ్యాణ్ రామ్ అంత నమ్మినందుకైనా ‘షేర్’ సినిమా హిట్టవుతుందేమో చూడాలి. అభిమన్యు తో పోలిస్తే కత్తి కాస్త సిస్టర్ సెంటిమెంట్ తో సాగుతూ బావుంటుంది కానీ రాంగ్ టైమింగ్ కారణంగా ఆ సినిమా ప్లాప అయ్యింది. షేర్ మంచి టైమింగ్ లో వస్తోంది అని అంటున్నారు. పైగా పోటీకి కూడా సినిమాలు సరిగ్గా లేనేలేవు దీంతో షేర్ హిట్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మొత్తానికి సినిమా ఫలితం ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్, మహేష్ లాంటి స్టార్ ల కన్నా స్టార్ అవడం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న కళ్యాణ్ రాం ఈ విషయంలో బెటర్ అనిపించుకున్నాడు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: