జనాల్లో ఎవేర్ నెస్ రావాలంటే, సమాజం పై బాధ్యతగా ప్రవర్తించే పెద్ద వాళ్ళు కొన్ని మాటలు చెబితే, సామాన్న జనానికి కాస్తైనా ఎక్కుతుంది. అందుకు పెద్ద వాళ్ళ మాటని వినాలని సామెత ఇంకా వాడుకలో ఉంటూనే ఉంది. ఇదిలా ఉంటే డ్రంక్ అండ్ డ్రైవ్ పై ప్రజల్లో అవగాహన కలగాలంటే, ఎవరైన సెలబ్రిటీలు ముందుకు వస్తే బాగుంటుందనేది పోలీసుల ఆలోచనలు.

అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో ఫిల్మ్ సెలబ్రిటీలు బిజిగా ఉంటారు కాబట్టి, ఓ కొత్త పథకం ఆలోచించింది పోలీస్ వ్యవస్థ. జూబ్లిహిల్స్, ఫిల్మ్ నగర్, బంజారాహిల్స్ ఏరియాల్లో రాత్రిళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లని పెడితే పెద్దవాళ్ళు సైతం దొరికే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ సెలబ్రిటీలు దొరికితే అంతటి పెద్దవాళ్ళని సైతం పోలీసులు వదలటం లేదు, మనమెంత..అందుకే జాగ్రత్త పడాలి అనే మెసేజ్ ప్రజల్లోకి వెళుతుంది.

ఒకవేళ సెలబ్రిటీలు దొరక్కపోతే, టెస్ట్ అనంతరం ప్రజలకి సైతం డ్రంక్ అండ్ డ్రైవ్ చేయద్దు అనే మెసేజ్ ని ఇప్పిస్తారు. ఇలా రెండు రకాల ఉపయోగాలు ఉంటాయి. ఈ టెస్ట్ లో ఇప్పటికే చాలా మంది ఫిల్మ్ సెలబ్రిటీలు ఇరుక్కున్నారు. అలాగే కొందరు తమ వంతు బాధ్యతగా మెసేజ్ లు ఇచ్చిన వారూ ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఫిల్మ్ యాక్టర్ జయప్రధ కి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించటానికి ప్రయత్నించారు.

కానీ సీన్ రివర్స్ అయింది. డ్రైవర్ సీట్లో తను లేదు కాబట్టి, జయప్రధ సేఫ్ అయింది. కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో పాల్గొనాల్సిందిగా అడుగగా జయప్రధ అటు మీడియాపైనా, ఇటు పోలీసులు పైనా వీరంగం ఆడిందట. అంతేకాదు తన డ్రైవర్ ని కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఇప్పించలేదట.“తమషాలు చేస్తున్నారా?” అంటూ ఫైర్ అయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: