రెబల్ స్టార్ కృష్ణంరాజుకు వెబ్ మీడియాలోని ఫేస్ బుక్ పై కోపం వచ్చింది. ఫేస్ బుక్ లో ప్రభాస్ భార్య ఈమె అంటూ ఒక ఫోటో పెట్టి కొందరు ప్రభాస్ పెళ్ళి పై చేస్తున్న గాసిప్పుల ప్రచారం కృష్ణంరాజుకు తీవ్ర మనస్థాపం కలిగించడమే కాకుండా వెబ్ మీడియా పై తీవ్ర కోపం వచ్చేలా చేసింది. దీనితో రంగంలోకి దిగిన కృష్ణంరాజు ఆ వార్తల పై ఎదురు దాడి మొదలు పెట్టాడు.

భీమవరానికి చెందిన ఒక అమ్మాయితో ప్రభాస్ పెళ్ళి నిశ్చయం అయిందని అంతేకాకుండా ఆ అమ్మాయి కుటుంబం తమ కుటుంబం ఎప్పటి నుంచో సన్నిహితులు అంటూ ఏదేదో ఊహించుకుని వార్తలు రాయడమే కాకుండా ఏకంగా ఎవరో ఒక అమ్మాయి ఫోటోను ఫేస్ బుక్ లో పెట్టి ఈమె ప్రభాస్ భార్య అంటూ వార్తలు వ్రాస్తూ ఇలా ఎవరు ఎందుకు ప్రచారం చేస్తున్నారో తనకు అర్ధం కావడం లేదు అంటూ ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రికకు ఇంటర్వ్యూలో కృష్ణంరాజు తెలియచేసాడు.

ఇప్పటికి వచ్చి తమ కుటుంబ సభ్యులు ఎవ్వరూ ప్రభాస్ పెళ్ళి గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అటువంటి నిర్ణయం ఏదైనా తీసుకుంటే ముందుగా మీడియాకు అభిమానులకు తెలియచేస్తామని ఇటువంటి విషయాలలో రహస్యాలు ఎందుకు ఉంటాయి అని అంటూ ఈ ఫేస్ బుక్ గాసిప్పుల పై కృష్ణంరాజు ఎదురు దాడి చేస్తున్నాడు. 

ఈ వార్తలు ఇలా ఉండగా ప్రభాస్ తన శరీరాన్ని అదేవిధంగా తన గడ్డాన్ని పెంచుతూ డిసెంబర్ 14వ తారీఖు నుండి ప్రారంభం కాబోతున్న ‘బాహుబలి 2’ షూటింగ్ కు రెడీ అవుతున్నాడు. ప్రభాస్ పెళ్ళి పై కృష్ణంరాజు క్లారిటీ ఇచ్చాడు కాబట్టి ప్రస్థుతానికి ప్రభాస్ పెళ్ళి వార్తలకు కళ్ళెం పడుతుంది అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: