నాక్కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది అంటూ గబ్బర్ సింగ్ లో రెచ్చిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ కొత్తగా ఫాన్స్ ని ఉర్రూతలు ఊగించడానికి వస్తున్నాడు. మొదటి భాగానికి ఇది సీక్వెల్ కానీ ప్రీక్వెల్ కానీ కాదు ని ఇది సేపెరేట్ కథ అని అంటున్నారు నిర్మాతలు.

 

 

 

పవర్ సినిమా బాబీ దర్సకత్వంలో వస్తున్న ఈ సినిమా ఇప్పుడు షూటింగ్ లో బిజీ గా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ లో ఉన్న ఈ సినిమా మళ్ళీ ఛలో గుజరాత్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ - కాజల్ మీద చాలా ఆసక్తికర సన్నివేశాలు అక్కడ షూట్ చేస్తున్నారట. ఇప్పటి వరకూ గుజరాత్ లో ఒక షెడ్యూల్, హైదరాబాద్ లో మరొక షెడ్యూల్ పూర్తి చేసింది సినిమా బృందం.

 

 

 

 మూడవ షెడ్యూల్ మాత్రం భారీగా పాతిక రోజుల వ్యవాధి కి డిసైడ్ చేసారు. హైదరాబాద్ షూటింగ్ లో లక్ష్మీ రాయ్ మీద ఐటెం సంగ్ కంప్లీట్ చేసిన బాబీ గుజరాత్ లో రెండు లవ్ సీన్ లతో పాటు ఇంటర్వెల్ లో వచ్చే కీలక సన్నివేశాలు తెరకి ఎక్కిస్తున్నాడట. జనవరి ఆఖరి వరకూ టాకీ షూటింగ్ జరుగుతుంది అని తెలుస్తోంది. సమ్మర్ హాలిడేస్ కి ఈ సినిమా విడుదల చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నారు ప్రొడ్యూసర్ శరత్ మరార్.

 


మరింత సమాచారం తెలుసుకోండి: