నందమూరి నట సింహం యువరత్న బాలయ్య బాబు 100వ సినిమా టైటిల్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తుంది. ప్రస్తుతం 99వ సినిమా డిక్టేటర్ సినిమా చేస్తున్న బాలకృష్ణ ఈ సినిమా తర్వాత కొద్ది గ్యాప్ తోనే 100వ సినిమా స్టార్ట్ చేసేలా చూస్తున్నారట. డిక్టేటర్ సినిమా ఈ సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతుందన్న సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమా తర్వాత బాలయ్య 100వ సినిమా ఉండబోతుంది. అత్యంత ప్రతిష్టాతంకంగా ఆ సినిమా ఉండబోతుందని టాక్. అందుకే సినిమా గురించి ఇప్పటినుండే ఆలోచిస్తున్నాడట.


తనకు సింహా, లెజెండ్ లాంటి సూపర్ హిట్లను ఇచ్చిన బోయపాటి శ్రీను డైరక్షన్లోనే బాలయ్య 100వ సినిమా ఉంటుందని తెలిసిందే. అయితే ఈ సినిమా కథ మరింత పవర్ ఫుల్ గా ఉండబోతుందట. దానికి తగ్గట్టుగా సినిమా టైటిల్ గాడ్ ఫాదర్ అని తెలుస్తుంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను కూడా అల్లు అర్జున్ తో సరైనోడు సినిమా షూట్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా కంప్లీట్ అయిన తర్వాత బాలయ్య సినిమా ఉంటుంది. ఈ లోపు బాలయ్య సినిమా కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి కలిసి సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. సినిమా బడ్జెట్ కూడా భారీ రేంజ్లో ఉంటుందని అంటున్నారు.


ఇప్పటికే డిక్టేటర్ సినిమాలో 99 మంది డ్యాన్సర్స్ తో స్టెప్పులేసిన బాలయ్య 99వ సినిమాను చాలా స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నారు. ఇక సెంచరీ సినిమాను కూడా అంతకంటే భారీ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారట. బాలయ్య బోయపాటి కలిస్తే సంచలనమే సింహాగా, లెజెండ్ గా అరుపులు పెట్టించిన ఈ కాంబినేషన్ మరోసారి గాడ్ ఫాదర్ గా.. అది బాలయ్య బాబు వందో సినిమా అంటే రికార్డులు బద్ధలు కొట్టాల్సిందే. డిక్టేటర్ సినిమా తర్వాత లేట్ చేయకుండా ఈ సినిమా షెడ్యూల్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు బాలకృష్ణ.


అయితే ముందు సరైనోడు సినిమా కూడా సంక్రాంతికే అనుకున్నా పొంగల్ రేస్లో చాలా సినిమాలున్నాయని ఫిబ్రవరికి పోస్ట్ పోన్ చేశారు. అయితే ఇది ఫెబ్ నుండి సమ్మర్ కి కూడా పోస్ట్ పోన్ అయ్యే చాన్సెస్ ఉన్నాయి. మరి అప్పటిదాకా బోయపాటి బాలయ్య సినిమా మీద ఫోకస్ పెట్టడా అంటే.. సినిమా స్టార్ట్ చేసినప్పటినుండి ఇక ముగించే దాకా నిరంతరాయంగా కానిచ్చేస్తారట.. మరి రికార్డుల సునామి సృష్టించడానికి రెడీ అవుతున్న బాలయ్య తన 100 సినిమాతో మరో చరిత్ర సృష్టిస్తాడనడంలో సందేహం లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: