తెలుగు ఇండస్ట్రీలో చిన్న డ్యాన్స్ మాస్టర్ గా ఎంట్రీ ఇచ్చిన లారెస్స్ ఒక్కొ మెట్టు ఎక్కుతూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు..కానీ నటన కన్నా లారెన్స్ దర్శకత్వంపైనే ఎక్కువ మక్కువ ఉండేది..దీంతో తెలుగులో ‘స్టైల్’ సినిమాతో దర్శకుడి అవతారం ఎత్తాడు..ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. తర్వాత నాగార్జున తో మాస్, డాన్ సినిమాలు తీసినా అవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు కానీ లారెన్స్ మంచి దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘రెబల్’ సినిమా తీశాడు ఈ సినిమా కూడా బొక్కబోర్లా పడింది.

లారెన్స్ హీరోగా స్వియ దర్శకత్వంలో వచ్చిన ‘ముని’ కామెడీ, హర్రర్ కాన్సెప్ట్ తో తీసిన చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దీంతో మనోడు అదే కాన్సెప్ట్ తో సీక్వెల్ గా కాంచన,గంగ సినిమాలు తీశాడు..ఈ రెండు సినిమాలు అద్భుతమైన విజయాన్ని సాధించాయి. తెలుగులోనే కాదు తమిళ నాట కూడా మాస్ డైరెక్టర్ గా..హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు లారెన్స్. దీంతో  తమిళనాట లారెన్స్ కి మంచి మాస్ ఫాలోయింగ్ వచ్చింది. ఇక ఈ సంవత్సరం నందమూరి కళ్యాన్ రామ్ ‘పటాస్’ చిత్రంతో సూపర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది..దీంతో లారెన్స్ కన్ను ఈ సినిమాపై పడింది.


గంగ మూవి పోస్టర్


శ్రీరమణి దర్శకత్వం లారెన్స్ కథానాయకుడిగా 'పటాస్' రీమేక్ సెట్స్ పైకి వెళ్లింది. తమిళ్లో ఈ సినిమా 'మొట్ట శివ కెట్ట శివ ' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక తెలుగులో ‘పటాస్’ సినిమాలో కళ్యాన్ రామ్ పోలీస్ ఆఫీసర్ గా మొదట నెగిటీవ్ షేడ్స్ లో కనిపిస్తాడు..తర్వాత హీరోయిజం చూపిస్తాడు...సరిగ్గా లారెన్స్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు ఈ పాత్ర ఉంటుంది అందుకే పటాస్ సినిమా పై అంత ఇంట్రెస్టు చూపించినట్లు తెలుస్తుంది. ఇక సాయికుమార్ పాత్రలో సత్యరాజ్ నటించనున్నాడు. ఆర్.బి.చౌదరి నిర్మిస్తోన్న ఈ సినిమా కోసం త్వరలోనే కథానాయికను ఎంపిక చేస్తారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: