పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో లెక్కకు మించిన మేధావులు చేతులు కలపడంతో చివరకు ఇంతమంది మేధావుల ఆలోచనలతో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కు అసలకు మోసం వస్తుందా అనే భయంతో పవన్ అభిమానులు గందరగోళంలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. విపరీతమైన అంచనాలతో ప్రారంభం అయిన ఈసినిమా షూటింగ్ ఇప్పుడిప్పుడే స్పీడ్ అందుకుంటోంది. 

ప్రస్తుతం ఈ సినిమా యూనిట్  గుజరాత్ లోని వడోదరాలో షూటింగ్ తో బిజీగా ఉన్నారు. కీలకమైన ఈ షెడ్యూల్ డిసెంబర్ మధ్య వరకు జరుగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే కాజల్ రంగ ప్రవేశం చేయడంతో పవన్ రొమాంటిక్ యాంగిల్ సన్నివేశాలను కూడ అక్కడే షూట్ చేస్తున్నారు. అయితే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కు మొట్టమొదట స్క్రిప్ట్ వ్రాసింది దర్శకుడు బాబి అయినా ఆ తరువాత ఈ స్క్రిప్ట్ విషయంలో సాయి మాధవ్ బుర్రాను కూడ లింక్ చేసి అతడి చేత డైలాగులు వ్రాయించారు. 

మధ్య మధ్యలో ఈ డైలాగుల వ్యవహారంలో పవన్ సూచనలు కూడ సాయి మాధవ్ ను ప్రభావితం చేసాయి అనే మాటలు ఉన్నాయి. దీనికి తోడు ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయంలో ఈ సినిమా నిర్మాత పవన్ సన్నిహితుడు టివీ రంగంలో 20 సంవత్సరాల అనుభవం ఉన్న శరత్ మరార్ సూచనలు కూడ ఈసినిమా స్క్రిప్ట్ ను ప్రభావితం చేసాయి అని టాక్. 

ఇక లేటెస్ట్ గా కొరియోగ్రాఫర్ గా పనిచేసి విపరీతమైన అనుభవం ఉన్న హరీశ్ పాయ్ ఈ సినిమాకు అఫీషియల్  క్రియేటివ్ హెడ్ గా మారి ప్రస్తుతం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కోసం గుజరాత్ వడోదరా షెడ్యూల్ లో చేస్తున్న హడావిడి చాలందికి ఆశ్చర్యo కలిగిస్తోంది. అయితే సామాన్యంగా ఛానల్స్ కార్యక్రమాలకు సంబంధించి క్రియేటివ్ హెడ్ ఉంటాడు కాని సినిమాకు ఒక దర్శకుడు ఉండగా ఇప్పుడు మళ్ళీ ఈ క్రియేటివ్ హెడ్ అవసరమా అంటూ ఫిలింనగర్ లో సెటైర్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ ‘సర్దార్’ కు ఇంతమంది మేధావుల జాతర అవసరమా ? కాదా ? అనే విషయం రానున్న రోజులలో తేలుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: