కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస సీక్వెల్స్ తో బాక్సాపీస్ వద్ద దుమ్మురేపిన చిత్రం సింగం. సింగం, సింగం2 మూవీలు సౌత్ మార్కెట్ లో భారీ కలెక్షన్స్ ని సాధించిన మూవీలుగా నిలిచాయి. ఇదిలాఉంటే ఇప్పుడు సూర్య సింగం3కి రెడీ అవుతున్నాడు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ త్వరలోనే స్టార్ కాబోతుంది. ఇక ఈ మూవీకి సంబంధించిన బడ్జెట్ ఓ రేంజ్ లో ఉందని కోలీవుడ్ వర్గాలనుండి అందుతున్న సమాచారం. స్టార్ హీరో సూర్య కి సౌత్ లో ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు.


తను నటించిన ‘సింగం’ తెలుగులో యముడు’గా వచ్చి పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చినసీక్వెల్ కూడా బ్లాక్ బస్టర్ ని సాధించింది. తాజాగా సింగం సీరీస్ కి మూడవ పార్ట్ తీయనున్నారు. డిసెంబర్2 నుంచి ‘సింగం 3’ షూటింగ్ మొదలవుతుంది. ఇక ఈ మూవీకి సంబంధించిన బడ్జెట్వివరాలను తెలుసుకుంటే సౌత్ ఇండస్ట్రీ షాకవుతుంది. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 40 కోట్ల రూపాయల బడ్జెట్ దాటిందంటే, అది భారీ బడ్జెట్ మూవీ కింద లెక్కే. అలాంటిది సింగం3 మూవీని దాదాపు56 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.


అందుకోసం భారీ లొకేషన్స్ ని సెలక్ట్ చేసుకున్నారు. అంతే కాకుండా రోజుల తరబడి ఆ లొకేషన్స్ లో పనిచేయాల్సి వస్తుందంట. ఇందులో భాగంగానేఈ సినిమాలో ఫస్ట్ మేజర్ షెడ్యూల్ ని వైజాగ్ లో మొదలు పెట్టనున్నారు. సుమారు 30 రోజుల పాటు వైజాగ్ లో షూటింగ్ జరిపిన తర్వాత తమిళనాడులోని టుటికోరిన్ పోర్ట్ లో సెకండ్ షెడ్యూల్ నిమొదలు పెడతారు. ఆ తరువాత ఆఫ్రిక లో మరో షెడ్యూల్ ఉంటుంది. అలాగే అండమాన్ దీవుల్లోనూ ఈ మూవీకి సంబంధించిన 10 రోజుల షూటింగ్ ఉంటుంది.


ఇక ముంబైలోనూ వారం రోజుల భారీషెడ్యూల్ ఉంటుంది. ఇలా మొత్తంగా ఈ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. దీని బడ్జెట్ దాదాపు 56 కోట్ల రూపాయలుగా లెక్కతేలిందట. సింగం సీక్వెల్స్ అన్నీ బ్లాక్ బస్టర్స్ కావటంతో,మూడో సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీ కచ్ఛితంగా అంతకు మించి సక్సెస్ సాధిస్తుందనే నమ్మకంతోనే...మూవీకి సంబందించిన బడ్జెట్ ని పెంచినట్టు తెలుస్తుంది.


ఇక  ‘సింగం’ సిరీస్‌లోని రెండు పార్ట్స్లోనూ హీరోయిన్‌గా నటించిన అనుష్క, ఈ మూడో పార్ట్ లోనూ కొనసాగనున్నారు. అలాగే మరో హీరోయిన్ గా శృతి హాసన్ కనిపించనున్నారు.ఈ సినిమాకి భారీ హంగులతో డైరెక్టర్ హరితెరకెక్కించనున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: