ప్రస్తుతం ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీలో లిప్ లాక్స్ సర్వసాధారణం. మూవీలో రెండు,మూడు సార్లు లిప్ లాక్స్ ఉన్నప్పటికీ పెద్ద ఇబ్బందేమి లేదు. కానీ లెన్తీ లిప్ లాక్స్ ఉంటే మాత్రం అది సంచలనమే. ఆ విధంగానే తాజాగా సౌత్ హీరోయిన్ ఓ నిముషం పాటు లెన్తీ లిప్ లాక్ సీన్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ‘తీన్ మార్’, ‘ఒంగోలు గిత్త’ సినిమాలలో హీరోయిన్ గా నటించి, మంచి పేరుని సంపాదించుకున్న హీరోయిన్ కృతి కర్భంద.


ఇక తాజాగా ఈ బ్యూటీ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘బ్రూస్ లీ’ సినిమాలో చరణ్ కి సిస్టర్ గా కనిపించింది. ఈ హీరోయిన్ కి మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, బిటౌన్ మూవీలో నటించేందుకు ఆసక్తి చూపటంతో...సౌత్ మూవీలలో నటించేందుకు సమయం దొరకటం లేదు. అందుకే ఇప్పటి వరకూ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సినిమాలు చేసిన ఈ భామ, ఇక నుండి బాలీవుడ్ మూవీల్లో నటించేందుకు రెడీ అవుతుంది.


ఇక బిటౌన్ లో హీరోయిన్స్ పెదాలకు ఫస్ట్ ఎయిడ్ అవసరయ్యేలా రొమాన్స్ చేసే హీరో ఇమ్రాన్ హస్మీ సరసన, కృతి కర్భంద ఆఫర్ ని దక్కించుకుంది. ఇమ్రాన్ హస్మీ నటించిన సక్సెస్ ఫుల్ సిరీస్ రాజ్ నుండి తాజాగా రాజ్ 4 రానుంది. ఈ సినిమాలో ఇమ్రాన్ హస్మీకి జోడీగా కృతి కర్భందని కన్ఫర్మ్ చేశారు. రాజ్ 4 ట్రై యాంగిల్ లవ్ స్టొరీగా రూపొందనుంది.


అలాగే మరో హీరోయిన్ గా గౌరవ అరోరాని సెలక్ట్ చేశారు. ఇక రాజ్ 4లొ కృతి కర్భందని ఇమ్మాన్ హస్మీ దాదాపు నిముషం పాటు లిప్ ని లాక్ ని చేయనున్నాడు. దీంతో కృతి కర్భందకి బిటౌన్ నుండి వరుస ఆఫర్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ మూవీని ముఖేష్ భట్ నిర్మిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: