పవన్ కళ్యాణ్ తీన్ మార్ సినిమాలో హీరోయిన్ గా చేసిన కృతి చూడచక్కని రూపంతో అందరిని ఆకట్టుకుంది. బోణి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ టాలీవుడ్లో దాదాపు 10 సినిమాల దాకా నటించినా ఒక్కటి హిట్ అవ్వలేదు. చేసిన రెండు సినిమాలకే ఐరన్ లెగ్ అనిపించుకున్న ఈ హీరోయిన్ ఏ సినిమాలో ఉన్నా అది ఫ్లాప్ అనే సెంటిమెంట్ ఉంది. రీసెంట్ గా బ్రూస్ లీ ఫ్లాప్ కూడా అమ్మడి లెగ్ మహిమే అనుకున్నారంతా.. అయితే టాలీవుడ్లో అమ్మడి పరిస్థితి ఇలా ఉంటే కోలీవుడ్, మాలీవుడ్లో దీనికి భిన్నంగా ఉంది.


అక్కడ కృతి కనిపిస్తే సినిమా హిట్. ప్రస్తుతం కోలీవుడ్లో జి.వి.ప్రకాశ్ హీరోగా చేసిన బ్రూస్ లీలో నటిస్తున్న అమ్మడు ఆ సినిమాతో హిట్ కొట్టేట్టే ఉంది. అయితే చేసిన సినిమాలన్నిటిలో పద్ధతిగా కనిపించిన ఈ భామ ఇప్పుడు ముద్దుల వీరుడు కిస్ లకు కింగ్ లాంటోడు ఇమ్రాన్ హష్మితో ఓ సినిమా చేసేందుకు సిద్ధమైంది. ఏంటి ఏంజిల్లా ఉండే కృతి ఇమ్రాన్ తో సినిమా చేస్తుందా అని అనుకుని ఆశ్చర్యపడోచ్చు అమ్మడికి సరైన లక్ తగలలేదు కాని స్టార్ హీరోయిన్స్ కి ఉండాల్సిన లక్షణాలన్ని ఉన్నాయ్ కాని ఎందుకో తను చేసిన సినిమాలన్ని తెలుగులో బోల్తా కొట్టాయి.


అందుకే కెరియర్లో హాట్ ఇమేజ్ ట్రై చేస్తే అన్నా రిజల్ట్ వేరేలా ఉంటుందని ప్రయత్నిస్తుంది ఈ బ్యూటీ. ముఖేష్ భట్ సినిమా అంటేనే మనకు గుర్తొచ్చేది రాజ్ సీరీస్. అయితే ఇప్పుడు రాజ్ 4 సినిమాలో ఇమ్రాన్ తో జతకడుతుందట కృతి కర్బందా. బిపాసా, జాన్ అబ్రహం నటించిన రాజ్ ఎన్ని సంచలనాలు సృష్టించిందో తెలుసు కదా. బాలీవుడ్ శృంగార ప్రియులను నిద్రలేపిన ఆ సినిమా ఎప్పటికి మంచి రొమాంటిక్ ఫిల్మ్ గా గుర్తుండి పోతుంది. ఇప్పుడు ఆ సినిమాకు నాలుగో సీక్వెల్ గా వస్తున్న రాజ్-4లో కృతి రెచ్చిపోతుందట.


ఇక సినిమాలో కృతి హాట్ గా కనిపిస్తుంది అని చెప్పడం కూడా అనవసరమేమో.. ఇన్నాళ్లు తనలోని ఒక యాంగిల్నే చూపించిన ఈ అమ్మడు ఇక నుండి సెక్సీ యాంగిల్ ని కూడా బయటపెడుతుంది. సినిమా హిట్టై అమ్మడికి మంచి పేరు వస్తే ఆ క్రేజ్ తోనే బాలీవుడ్లో కొంతకాలం హవా కొనసాగించొచ్చని ఈ భామ ఉద్దేశం. మరి ఇక్క స్టార్ హీరోయిన్ అయిన వారే అక్కడికెళ్లి బోల్తా కొట్టారు. మరి అమ్మడు ఏం చేస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: