యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఆ అభిమానులకోసం జూనియర్ తన సినిమాల విశేషాలను తన ట్విట్స్ రూపంలో అప్పుడప్పుడు తెలియచేస్తూ ఉంటాడు. అయితే జూనియర్ చేస్తున్న ట్విట్స్ తాను నటిస్తున్న సినిమాలకంటే వేరే హీరోల సినిమాలకు అదృష్టంగా మారడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 

జూనియర్ కు దర్శకుడు రాజమౌళికి ఉన్న సాన్నిహిత్యం మాటలకు అందనిది. దీనితో ‘బాహుబలి’ విడుదలకు ముందు ఆ సినిమా విజయం సాధించాలని కోరుతూ టాలీవుడ్ సెలెబ్రెటీలు అందరూ ట్విట్స్ చేసి రాజమౌళిని అభినందిస్తున్నా జూనియర్ ఈ విషయమై వెంటనే స్పందించకపోవడంతో జూనియర్ కు ఏమైంది అంటూ ‘బాహుబలి’ సినిమా రిలీజ్ కు ముందు వార్తలు వచ్చాయి. అయితే ‘బాహుబలి’ మరి కొద్ది గంటలలో విడుదల అవుతుంది అనగా జూనియర్ రాజమౌళిని అభినందిస్తూ ట్విట్ చేసాడు. దానితో ‘బాహుబలి’ రికార్డులను సృష్టించింది.

ప్రస్థుతం జూనియర్ సుకుమార్ దర్శకత్వంలో ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో నటిస్తున్న సందర్భంగా సుకుమార్ జూనియర్ ల మధ్య విపరీతమైన సాన్నిహిత్యం ఏర్పడింది. అయితే సుకుమార్ ‘కుమారి 21 ఎఫ్’ విడుదలకు ముందు టాలీవుడ్ ప్రముఖులందరూ సుకుమార్ ను అభినందిస్తూ ట్విట్ చేసినా చివరి నిముషం వరకు జూనియర్ తన ట్విటర్ లో ఈసినిమా పై స్పందించలేదు. కానీ ఈసినిమా మరో కొద్ది గంటలలో విడుదల అవుతోంది అన్న కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యాక ‘కుమారి 21 ఎఫ్’ ను ఆకాశానికి ఎత్తేస్తూ జూనియర్ ట్విట్స్ చేసాడు. దీనితో ఈసినిమాకు విమర్శకుల ప్రశంసలే కాకుండా కలెక్షన్స్ సునామి కూడ మొదలైంది.

అయితే ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలందరికీ జూనియర్ ట్విట్స్ సెంటిమెంట్ పట్టుకుంది అన్న మాటలు వినిపిస్తున్నాయి. జూనియర్ అభినందించిన సినిమాలు సూపర్ హిట్ అవుతున్న నేపధ్యంలో తమ సినిమాలను కూడ జూనియర్ తన ట్విట్స్ ద్వారా అభినందిస్తే తమకు కూడ అదృష్టం వస్తుందని చాలామంది నిర్మాతలు ఆశ పడుతున్నట్లు టాక్. దీనితో జూనియర్ ట్విట్స్ కు టాలీవుడ్ లో డిమాండ్ ఏర్పడింది అనే మాటలు వినిస్తున్నాయి. మరి రానున్న రోజులలో జూనియర్ ట్విట్స్ తో ఎంతమంది నిర్మాతలు అదృష్టవంతులుగా మారుతారో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: