తెలుగు,తమిళ ఇండస్ట్రీలో ఈమద్య హీరోయిన్లు కాస్త పాపులారిటీ సంపాదిస్తే చాలు వారికి పట్ట పగ్గాలు లేకుండా పోతున్నాయి. పాత తరం హీరోయిన్లు దర్శకులను, నిర్మాతలను ఎంతగానో గౌరవించే వేరు..అప్పట్లో సెట్లోకి దర్శక,నిర్మాలు వస్తే ఎంతో గౌరవప్రదంగా నడుచుకునే వారు.. ఒకో సమయంలో రెమ్యూనరేషన్ విషయంలో తక్కువైనా..సమయానికి ఇవ్వకపోయినా పెద్దగా పట్టించుకునే వారు కాదు అందుకే ఆ తరం హీరోయిన్లు అంత పెద్ద పేరు తెచ్చుకున్నారు.

కానీ ఇప్పటి హీరోయిన్లు మాత్రం దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. ఇండస్ట్రీలో కాస్త పేరు వస్తే ఎవ్వరినీ లెక్కచేయని పరిస్థితి నెలకొంది..అంతే కాదు దర్శక,నిర్మాతలకు కూడా గౌరవం ఇచ్చే పరిస్థితిలో లేరని కొంతమంది సీనియర్ దర్శక,నిర్మాతలు కొన్ని సందర్భాల్లో చెప్పారు. ఇక రెమ్యూనరేషన్ విషయానికి వస్తే కాస్త లేట్ అయితే  రచ్చకు ఈడుస్తున్నారు. తాజాగా కోలీవుడ్ హీరోయిన్ మీనాక్షి ఇప్పుడిప్పుడే మంచి పేరు తెచ్చుకుంటుంది..ఈ అమ్మడు  ‘నేర్‌ముగమ్‌’ చిత్రంలో నటిస్తోంది. అయితే ఈ చిత్రం షూటింగ్ పాత మహాబలిపురం రోడ్డులోని ఫిలిం సిటీ ప్రాంగణంలో జరుగుతోంది. అయితే ఎం జరిగిందో కానీ మీనాక్షి అక్కడ  అసిస్టెంట్ డైరెక్టర్ పై మీనాక్షి  చేయి చేసుకోవడం సినిమా యూనిట్ కి ఆగ్రహాన్ని తెప్పించింది.

తమిళ్ హీరోయిన్ మీనాక్షి హాటో ఫోటో


నలుగురి ముందు అలా అసిస్టేంట్ డైరెక్టర్ పై చెయ్యి చేసుకోవడాని అక్కడి చిత్రబృందం జీర్ణించుకోలేక పోయింది..ఆమె దాడిని ఖండిస్తూ ఆందోళనకు దిగారు . చేయి చేసుకున్న  అసిస్టెంట్ డైరెక్టర్ కు క్షమాపణ చెప్పేవరకు మీనాక్షి ని ఎక్కడికి కదలనివ్వలేదు. దీంతో తప్పు తెలుసుకున్న ఈ అమ్మడు అసిస్టెంట్ డైరెక్టర్ కు  క్షమాపణలు చెబుతూ, లేఖ రాసింది. భవిష్యత్తులో ఇటువంటి పొరబాట్లు చేయనని వివరణ ఇచ్చుకుంది. దీంతో చిత్ర యూనిట్  ఆందోళనను విరమించుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: