టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రకాష్ రాజ్ ఓ విలక్షణమైన నటుడు. నటన జీవితంలోనే కాకుండా, వ్యక్తిగత జీవితంలోనూ ప్రకాష్ రాజ్ విలక్షణ శైలి వైవిధ్యమైనది. ఇప్పటి వరకూ ఏ నటుడి జీవితంలోనూ లేని కాంట్రవర్సీలు ఒక్క ప్రకాష్ రాజ్ నటన జీవితంలో ఉన్నాయంటే అంత కంటే విలక్షణమైనది మరొకటి లేదు. ఇదిలా ఉంటే, ప్రకాష్ రాజ్ కి నటించటమే కాకుండా చక్కటి మూవీలను తెరకెక్కించే విలక్షణ డైరెక్టర్ కూడ తనలో ఉన్నాడు.


తన దర్శకత్వంలో వచ్చి థోని, ఉలవచారు బిర్యాని వంటి సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇప్పడు, తాజాగా తెలుగులో ఒక సినిమాను తెరకెక్కించడానికి ఆయన రెడీ అవుతున్నాడు. 'మన ఊరి రామాయణం' పేరుతో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమా పోస్టర్ ని ప్రకాష్ రాజ్ రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక గా మారింది. ఇక తన తాజా మూవీ 'మన ఊరి రామాయణం' ని తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిస్తున్నాడు.


అయితే ఈ కథకి సంబంధించిన విషయంపై పలు ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి. ఇది ఒక గ్రామానికి సంబంధించిన కథ అనీ, పూర్తి వినోదభరితంగా ఉంటుందని ప్రకాష్ రాజ్ చెబుతున్నాడు. ఇక అసలు విషయంలోకి వెళితే, మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డి పల్లి గ్రామాన్ని ప్రకాష్ రాజ్ దత్తత తీసుకున్నాడు. “నేను రాజకీయాల్లోకి రావడానికో .. మరో స్వార్ధానికో గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకు రాలేదు. గ్రామాల అభివృద్ది ప్రజల హక్కు. భవిష్యత్ లో కొండారెడ్డి పల్లి గ్రామ ప్రజలు ఇతర గ్రామాలను దత్తత తీసుకునే స్థాయికి ఎదగాలని” ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ గతంలో చెప్పుకొచ్చాడు.


తను ఎప్పుడైతే ఆ గ్రామ అభివృద్ధి పనులు చేపట్టాడో, ఆ ఊరిలో నుండి పుట్టిన కథనే మన ఊరి రామాయణం కథ గా తెరకెక్కిస్తున్నాడని అంటున్నారు. ఇందులో సోషియల్ మెసేజ్ ఉంటుందని చెబుతున్నారు. అందుకోసం 30 సెకండ్ల పాటు మహేష్ బాబు ఇందులో కనిపించనున్నాడని అంటున్నారు. ప్రకాష్ రాజ్ కి, మహేష్ బాబు కి ఎప్పటి నుండో మంచి రిలేషన్ ఉన్న కారణంగా..అందులోనూ ఇది సోషియల్ మెసేజ్ మూవీ కావడంతో..మహేష్ బాబుకి కొద్ది సేపు స్క్రీన్ స్పేస్ ని క్రియేట్ చేశాడంట ప్రకాష్ రాజ్. ఇక ఈ మూవీకి తెలంగాణ ప్రభుత్వం నుండి టాక్స్ మినహాయింపును తీసుకోనున్నట్టు తెలుస్తుంది.  


ఇప్పటికే ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ ద్వారా ఆయన ఇతర రాష్ట్రాలలో కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ అనుభవంతోనే మన ఊరి రామాయణం కథని తెరకెక్కించ గలుగుతున్నారని ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. ప్రకాశ్ రాజ్ దర్శక నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమాకి ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చనున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: