మంచువారి కుటుంబంలో మళ్ళీ నిన్నటి నుంచి సంబరాల సందడి మొదలైంది. నిన్న మోహన్ బాబు టాలీవుడ్ లో ప్రవేసించి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖుల సమక్షంలో సంబరాలు చేసుకుని ఒక్కరోజు గడవకుండానే నిన్న ఆదివారం అర్దరాత్రి నుండి మంచువారి ఇంట్లో మరో సందడి మొదలైంది. ఈరోజు మంచు విష్ణు పుట్టినరోజు ఈరోజు జరుగుతున్న తన పుట్టినరోజు సందర్భంగా అభిమానుల్ని సంతోషపరిచేలా సిక్స్ ప్యాక్ తో కూడిన సరదా స్టిల్ ని విడుదల చేశాడు మంచు వారి అబ్బాయి. 

నిన్న రాత్రి పన్నెండు గంటల నుంచే మంచు వారి ఇంట్లో పుట్టినరోజు వేడుకల హడావిడి మొదలు కావడంతో ఇంట్లో కుటుంబ సభ్యులంతా విష్ణుకి నిన్న రాత్రే బర్త్ డే విషెస్ చెప్పారు. ఇక ఈరోజు ఉదయం నుండి మంచు వారి కాంపౌండ్ లో ఈ సంబరాలు మరింత ఉధృతంగా జరుగుతున్నాయి. ఇక మంచులక్ష్మి అయితే తన ప్రత్యేకమైన హడావిడితో తన తమ్ముడు మంచు విష్ణుకు డిఫరెంట్ గా ‘తండ్రిలాంటి తమ్ముడు ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలి’ అంటూ దీవెనలు ఇస్తూ వెరైటీగా ట్విట్ చేయడమే కాకుండా ఒక వెరైటీ ఫోటోను కూడ తన ఫేస్ బుక్ లో పెట్టింది.  

ఆమె పోస్ట్ చేసిన ఫోటోను చూస్తే ఎవరైనా షాక్ అవుతారు. చిన్న పిల్లలా లక్ష్మి తన తమ్ముడు మంచు విష్ణు చంక ఎక్కి కూర్చుని విషెస్ చెపుతుంటే ఆ ఆనందాన్ని విష్ణు తట్టుకోలేక పోవడం స్పష్టంగా కనిపిస్తోంది. 1981 నవంబర్ 23న జన్మించిన మంచు విష్ణు తన 22వ ఏట విష్ణు సినిమాతో హీరోగా పరిచయం అయినా విష్ణుకు సరైన హిట్ వచ్చింది 2007లో వచ్చిన ‘డీ' సినిమాతోనే. 

ఆ తరువాత మళ్ళీ చాల ఫ్లాప్స్ తరువాత ‘దేనికైనా రెడీ’ తో హిట్ కొట్టాడు. అయితే ఆ తరువాత కూడ మళ్ళీ వరస పరాజయాలు మంచు విష్ణును వెంటాడుతూనే ఉన్నాయి. కనీసం ఈ పుట్టినరోజు నుంచి అయినా విష్ణు కెరియర్ కు మంచి టర్నింగ్ పాయింట్ వస్తుందని మంచు కుటుంబం ఆశిస్తోంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: