‘బ్రూస్ లీ’, ‘అఖిల్’ సినిమాలు కేవలం 20 రోజుల గ్యాప్ తో విడుదల అయి అటు మెగాఅభిమానులను ఇటు అక్కినేని అభిమానులను మెప్పిoచలేక ఘోరమైన ఫ్లాప్ లుగా మిగిలిపోయిన నేపధ్యం తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలు విడుదల కాకముందు మీడియాకు హాట్ టాపిక్ గా మారడమే కాకుండా ఈ రెండు సినిమాల విజయం పై చిరంజీవి నాగార్జునలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు తమ కొడుకుల కోసం ఆ సినిమాలలో కొన్ని నిమిషాల పాటు తళుక్కుమని కనిపించారు. 

అయితే ఈరెండు సినిమాలు ఈ సంవత్సరపు ఘోర పరాజయాలుగా రికార్డు క్రియేట్  చేసుకున్నాయి. అయితే ఈ షాక్ ల తరువాత చరణ్ అమెరికాకు వెళితే అఖిల్ గోవాకు వెళ్ళి పోయాడు. అయితే ప్రస్తుతం అమెరికాలో ఉన్న హీరో రామ్ చరణ్ రేపో మాపో హైదరాబాద్ తిరిగి రావడమె కాకుండా మొట్టమొదటిసారిగా ఓ గ్రాండ్ ఈవెంట్‌ లో పాల్గొనబోతున్నాడు. హైదరాబాద్ గచ్చిబౌలీ ఔట్‌డోర్ స్టేడియంలో వచ్చే నెల 4 నుంచి 6 వరకు జరిగే సౌత్ ఇండియా  సినీ అవార్డుల కార్యక్రమం ‘ఐఫా ఉత్సవ్’ ఫంక్షన్‌లో  చరణ్ పర్‌ ఫామ్ చేయనున్నాడని టాక్. 

కొరియోగ్రాఫర్, సింగర్, ఎంటర్‌టైన్మెంట్ డైరెక్టర్ కూడా అయిన షియమాక్ దావర్ ఈ విషయాన్ని ట్వీట్ చేశాడు. చరణ్ తన కెరియర్ లో లైవ్ పర్‌ఫామెన్స్ ఇవ్వడం ఇదే మొదటిసారి. దీనితో చరణ్ ఫ్యాన్స్ మంచి జోష్ లో ఉండటమే కాకుండా ఆ ఫంక్షన్ గురించి ఎదురు చూస్తున్నారు. ఇంక అఖిల్ తన మొదటి సినిమా షాక్ నుండి తేరుకోవడానికి ఒక వారంరోజులు గోవాలో ఉండి తిరిగి ఇంటికి వచ్చినా తన ‘అఖిల్’ సినిమా షాక్ నుండి తేరుకోలేక బోతున్నాడని టాక్. అఖిల్ తో తమ సినిమాలు చేయడానికి ఉత్సాహపడుతున్న దర్శకులు చెప్పే కధలను వినడానికి కూడ అఖిల్ పెద్దగా ఆశక్తి కనపరచడంలేదు అనే వార్తలు వస్తున్నాయి. 

అంతేకాదు అఖిల్ పెద్దగాఎవరిని కలవడానికి ఇష్ట పడటం లేదు అనే వార్తలు కూడా ఉన్నాయి. దీనితో అఖిల్ సినిమా రంగంలో నిలదొక్కుకోవడానికి ఎoత సహనంగా ఉండాలో ఇంకా అర్ధంకాలేదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో చరణ్ ను చూసి అఖిల్ పాఠాలు నేర్చుకోవాలి అంటూ కొందరు కామెంట్ చేస్తున్నట్లు టాక్. ఏది ఏమైనా కేవలం 20 రోజుల గ్యాప్ తో వచ్చిన షాక్ లనుండి మెగా కుటుంబం బయట పడినంత వేగంగా అక్కినేని కుటుంబం బయటకు రాలేక పోతోంది అని టాలీవుడ్ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: