పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏంటి దేవి శ్రీ ప్రసాద్ తో చాలెంజ్ చేయడం ఏంటని కాస్త కంగారు పడొచ్చు. జల్సా దగ్గర నుండి పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేస్తూ మంచి ట్యూన్స్ ఇస్తున్నాడు దేవి శ్రీ ప్రసాద్. అయితే ఇప్పుడు వీరిద్దరు కలిసి చేస్తున్న సినిమా సర్ధార్ గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ సినిమాలో సాంగ్స్ ఎంత పెద్ద హిట్టో మనకు తెలిసిందే. ఇప్పుదు ఆ సినిమా కన్నా ఇంకా ఎక్కువ అవుట్ పుట్ ఈ సినిమాకు వచ్చేలా చేస్తున్నారట. అయితే ఈ దారిలోనే దేవి శ్రీ ప్రసాద్ మాంచి మాస్ బీట్ ఒకటి కంపోజ్ చేసి పవన్ కి సర్ ప్రైజ్ ఇచ్చాడట.


అయితే సెట్ కి వచ్చిన పవన్ ఆ సాంగ్ చూసి షాక్ అయ్యాడట. ప్రస్తుతం పోటీ పడుతున్న స్టార్ హీరోల్లో అన్ని కోణాల్లో అభిమానులను అలారించాలని ప్రయత్నిస్తుంటారు స్టార్ హీరోలు. అందుకే ప్రతీది పర్ఫెక్ట్ గా ఉండటానికి ట్రై చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాన్ ఈ సినిమా డ్యాన్సుల పరంగా కూడా బాగా చేయడానికి సన్నద్ధమయ్యాడట. దేవి ఇచ్చిన ట్యూన్స్ కి తను చాలెంజ్ చేసి మరి అదరగొట్టే స్టెప్పులు వేశాడట. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎవరు ఊహించని స్టెప్పులతో అలరిస్తాడట ఈ సర్ధర్ గబ్బర్ సింగ్.


అయితే ఈ క్రమంలోనే పవన్ కొరియోగ్రాఫర్స్ కి మంచి స్టెప్స్ కూడా రెడీ చేయమని టెస్ట్ పెట్టాడట. సింపుల్ గా ఉంటూనే ఫ్లోర్ అదిరిపోయే స్టెప్పులతో ఆ సాంగ్ ఉంటుందని అంటున్నారు చిత్ర యూనిట్. పవర్ సినిమాతో హిట్ కొట్టిన బాబీ సర్ధార్ గబ్బర్ సింగ్ ని డైరెక్ట్ చేస్తున్నాడు. శరథ్ మారర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాన్ తో కాజల్ రొమాన్స్ చేస్తుండగా.. రాయ్ లక్ష్మి ఐటం సాంగ్ నర్తిస్తుంది. 


మాములుగా ఇరగ్గొట్టే దేవి చాలెంజ్ చేసి మరి కొట్టాడంటే అది ఏ రేంజ్లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. మరి ఆ రేంజ్లో ఉన్న సాంగ్ కు పవన్ కూడా పందెం కట్టి మరి స్టెప్పులేస్తానడం ఇక సాంగ్ అంతా కేక పెట్టించడం ఖాయం. మరి సినిమాలో ఈ సాంగ్ మాత్రం స్పెషల్ అని చెప్పొచ్చు. రిలీజ్ ముందే ఇన్ని సంచలనాలు ఏర్పాటుచేస్తున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత ఏ విధంగా రికార్డులు క్రియెట్ చేస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: