దేవిశ్రీ ప్రసాద్ పేరు వింటేనే చాలు ప్రేక్షకులకు ఎక్కడలేని పూనకం వస్తుంది. దేవిశ్రీ అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఒక సంగీత దర్శకుడు మాత్రమే కాదు అతడిలో ఉన్న గీత రచయిత కొరియోగ్రాఫర్ ఇలా రకరకాల షేడ్స్ దేవిశ్రీలో కనిపిస్తాయి. దేవిశ్రీ ప్రసాద్ కు ఉన్న క్రేజ్ రీత్యా ఇప్పటికే అనేక మంది నిర్మాతలు దేవిశ్రీని హీరోగా పరిచయం చేద్దామని భారీ పారితోషికాలు ఆఫర్ చేస్తున్నా ఈ సంగీత దర్శకుడు మాత్రo ప్రస్తుతానికి మ్యూజిక్ డైరక్షన్ మాత్రమే తన ప్రాధాన్యత అని అంటున్నాడు.

ఈరోజు ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవిశ్రీ ప్రసాద్ పేరు చెప్పకుండా ఒక ప్రముఖ దర్శకుడు పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీని తాను తీయబోయే సినిమాకు సంగీత దర్శకత్వం వహించమని దేవిశ్రీని అడిగి అతడిని పిలిపించుకుని రెండు మూడు పాప్ గీతాలను వినిపించి ‘వీటిని వాడుకుని పాటలు చెయ్’ అని చెప్పాడట. 

ఆ విషయాలకు ఇష్టపడని దేవిశ్రీ ‘ఈసారికి నన్ను వదిలేయండి’ అని అనడంతో ఇంత టెక్కు ఉంటే సినిమా పరిశ్రమలో ఎదగవు అంటూ బెదిరించాడట ఆ టాప్ డైరెక్టర్. అయితే తాను ఆ బెదిరింపులకు లొంగలేదు అని అప్పటి విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ సంగీతాన్ని పుట్టించడానికి దేవిశ్రీ కావాలి కాని మరొకరి సంగీతాన్ని వాడుకుంటూ కాపీ కొట్టడానికి దేవిశ్రీ ప్రసాద్ అవసరం లేదు అని సంచలన వ్యాఖ్యలు చేసాడు.

తాను సంగీత దర్శకుడిగా ఇంత విజయం సాధించడానికి గల కారణం తన తండ్రి ప్రముఖ రచయిత సత్యమూర్తి ప్రభావం అని చెపుతూ ఒక విషయాన్ని బయట పెట్టాడు దేవిశ్రీ. సినిమాలో పాటల కోసం పాటలు వ్రాయకూడదని కథ నుoడి పాటలు పుట్టాలి అని తన తండ్రి తరుచూ చెప్పే మాటలు తాను తన దర్శకులతో కలిసి అనుసరించడం వల్ల తన పాటలకు మంచి క్రేజ్ ఏర్పడింది అని చెపుతున్న దేవిశ్రీ వచ్చే సంవత్సరం విడుదల కాబోతున్న ‘నాన్నకు ప్రేమతో’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలలో తన పాటల విశ్వరూపాన్ని చూపెడతాను అని అంటున్నాడు దేవిశ్రీ..



మరింత సమాచారం తెలుసుకోండి: