కొంత మంది హీరోయిన్స్ కి ఓ బ్రేక్ పాయింట్ వస్తుంది. అప్పుడు టాప్ హీరోలను కరెక్ట్ గా పట్టుకుంటే అందరి సరసన నటించే అవకాశాన్ని పొందవచ్చు. అలా కాకుండా వచ్చిన ప్రతి ఆఫర్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే...ఒక్కోసారి అనుకోని పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని క్రేజీ హీరోయిన్ సంజన పరిస్థితి ఆ విధంగానే ఉందని అంటున్నారు. ఇక తాజాగా ఈ బ్యూటికి పవన్ కళ్యాన్ నటిస్తున్న మూవీలో ఆఫర్ వచ్చింది.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అన్ని పనులను పక్కన పెట్టి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గుజరాత్ లోని వడోదరలో జరుగుతోంది. ఇక తాజాగా జరుగుతున్న షెడ్యూల్స్ లో కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం లపై వచ్చే సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాలో లక్ష్మీ రాయ్ ఓ పాటలో కనిపించగా, మరో పాత్ర కోసం ‘బుజ్జిగాడు’ ఫేం సంజనని తీసుకున్నట్టు తెలుస్తుంది.


నిజానికి లక్ష్మీరాయ్ చిందేసిన ఐటెం సాంగ్ లో సంజన డ్యాన్స్ చేయాలి. చివరి నిముషంలో సంజన, స్సెషల్ సాంగ్ ఆఫర్ ని మిస్ చేసుకుంది. ఇక ఈ మధ్య కాలంలో సంజనకి ఏమంత అవకాశాలు లేకపోవటంతో...కనీసం ఈ మూవీలో ఓ చిన్న పాటి రోల్ అయిన ఇప్పించాల్సిందిగా దర్శకుడిని కోరిందట. దీంతో సంజనకి ఓ రోల్ క్రియేట్ చేసి, ఇందులో ఆఫర్ ఇచ్చినట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి.


మొత్తంగా ఆఫర్స్ లేక అల్లాడిపోతున్న సంజన, టాప్ హీరోల మూవీల్లో చిన్నపాటి రోల్స్ కోసం తెగ ప్రాకులాడుతున్నట్టుగా ఇండస్ట్రీలో కథనాలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా వచ్చిన ఆఫర్ తో సంజన తెగ సంబరపడిపోతోంది.  భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ, సమ్మర్ కానుకగా మేలో రిలీజ్ కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: