తెలుగు ఇండస్ట్రీలో పెద్ద చిత్రాలు హవా నడుస్తున్న సమయంలో అప్పుడప్పుడు చిన్న చిత్రాలు కూడా బాగా జోరు చూపిస్తున్నాయి. పెద్ద చిత్రాలు ఎన్నో అంచనాలు పెట్టుకొని బీభత్సమైన మార్కెటింగ్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి..కానీ అవి అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. ఈ సంవత్సరం  ఎన్నో అంచనాల మద్య వచ్చిన సినిమాలు లయన్, బ్రూస్ లీ, అఖిల్   బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. కానీ ఏ అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమా మారుతి దర్శకత్వంచి నానీ హీరోగా నటించిన ‘భలే భలే మగాడివోయ్’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

తాజాగా సుకుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం సూర్యప్రతాప్ దర్శకత్వంలో వచ్చిన ‘కుమారి 21 ఎఫ్ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీకి రివ్యూలు మిక్సెడ్ గానే వచ్చాయి. అయితే ప్రేక్షకులు మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు. ఏ - బీ - సీ సెంటర్లు.. మల్టీప్లెక్స్ ఆడియన్స్ నుంచి కూడా సూపర్ టాక్ వస్తోంది. రాజ్‌తరుణ్- హేబాపటేల్ జంటగా వచ్చిన ‘కుమారి 21F’ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మొదటి వీకెండ్‌లో దాదాపు 7 కోట్లు సాధించినట్టు టాక్. తొలి మూడు రోజుల్లోనే కుమారికి నైజాంలో 2.35 కోట్లు రాగా కోస్తా-సీడెడ్ కలిపి 2.95కోట్లు కొల్లగొట్టింది.

‘కుమారి 21F’ మూవీ పోస్టర్


కర్నాటకలో 46 లక్షల రాగా అమెరికా మార్కెట్ నుంచి 63లక్షలు రాబట్టింది కుమారి 21ఎఫ్. అంతే కాదు  సినిమా మొత్తాన్ని 10 కోట్ల ధియేట్రికల్ రైట్స్ రూపంలో అమ్మేశారు. ఇప్పుడు ప్రాఫిట్‌లోకి వెళ్లిందనేది బయ్యర్ల ఆలోచన.ఫస్ట్ వీకెండ్‌ ఇలావుంటే.. వీక్ ముగిసేసరికే అన్ని ఏరియాల్లోనూ బయ్యర్లు బ్రేక్ ఈవెన్‌కి వచ్చేయడం ఖాయమంటున్నారు.  దేవిశ్రీ మ్యూజిక్ - కుమారిని ప్రచారం చేసిన తీరుతోపాటు.. హీరో రాజ్ తరుణ్ హీరోయిన్ బోల్డ్ నెస్ కూడా కారణమేనని చెప్పాలి. పెద్ద సినిమాలు కాస్త నిరాశపరిచినా చిన్న సినిమాలు మాత్రం తెలుగు ఇండస్ట్రీల మంచి జోష్ నింపుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: