సినిమా సెలెబ్రెటీల పై రూమర్స్ రావడం సర్వసాధారణం. అయితే మాస్ మహారాజ రవితేజ తీరు విభిన్నం. రవితేజ వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడు వదంతులు, ఇతరత్రా వార్తలు వచ్చిన సందర్బాలు లేవు. దీనితో రవితేజ ఎప్పుడు హాట్ న్యూస్ లలో కనిపించడు. అయితే ఎప్పుడు లేనిది మాస్ మహారాజా పై ఒక గాసిప్ ఫిలింనగర్ లో హడావిడి చేయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 

వాస్తవానికి రవితేజాకు కూడ చాలామంది ఇండస్ట్రీలో ఫ్రెండ్స్‌ ఉన్నారని టాక్. ఇందులో హీరోయిన్స్ కూడ ఉన్నారట. ఈ విషయాన్ని స్వయంగా కన్నడ బ్యూటీ లక్ష్మీరాయ్ చెప్పింది అని అంటారు. ‘బలుపు’ చిత్రంలో రవితేజతో కలిసి ఒక ఐటెమ్‌ సాంగ్‌లో నటించిన లక్ష్మీరాయ్‌కి అంతకుముందు నుంచే రవితేజతో స్నేహం ఉందని టాక్. అంతేకాదు రవితేజ తనకి 'ఫ్రెండ్‌ ఫర్‌ లైఫ్‌' అని లక్ష్మీరాయ్‌ తన సన్నిహితులతో చెపుతూ ఉంటుందట. 

లక్ష్మీరాయ్‌ కి ఫిలిం ఇండస్ట్రీలోనే కాకుండా క్రికెటర్లలో వ్యాపారవేత్తల్లో స్నేహాలు ఉన్నట్లు చాలా మంది చెపుతారు. అయితే మాస్ మహారాజ రవితేజ లక్ష్మీరాయ్ మధ్య స్నేహం మటుకు చాలామందికి తెలియని న్యూస్. ఈమధ్య లక్ష్మిరాయ్‌ అనారోగ్యంతో బాధ పడుతోందని తెలిసి రవితేజ, ప్రభుదేవాతో పాటు మరికొందరు స్నేహితులు ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చారు అని ఫిలింనగర్ టాక్. 

ఈవార్త బయటకు రావడంతో ఇంత పనికట్టుకుని రవితేజ లక్ష్మీరాయ్ ఇంటికి వెళ్ళడం వెనుక ఏదైనా కారణం ఉందా అంటూ కొంతమంది ఫిలింనగర్ లో గాసిప్పు సెటైర్లు వేసుకుంటున్నారు. ‘బెంగాల్ టైగర్’ పూర్తి అయి ప్రస్తుతం ఖాళీగా ఉన్న రవితేజ షూటింగ్ ల హడావిడి లేకపోవడంతో ఇలా టైమ్ పాస్ కు లక్ష్మీరాయ్ ఇంటికి వెళ్ళి వచ్చాడు అనుకోవాలి. ఏమైనా వీరిద్దరి స్నేహం ప్రస్తుతానికి అందరకి హట్ న్యూస్..


మరింత సమాచారం తెలుసుకోండి: