తెలుగు సినిమా పరిశ్రమ అనే కాదు ఏ పరిశ్రమ అయినా "గో విత్ థీ విన్నర్" సామెత ఆధారంగా నడుస్తుంది. విజయం మనదగ్గర ఉన్నంతవరకే మన పబ్బం గడుపుకోగలం కానీ తరవాత ఇంతే సంగతులు. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలతో , అంతకంటే పెద్ద ఫేం ఉన్న హీరోలతో సినిమాలు తీసి రాత్రికి రాత్రి రోడ్డున పడ్డ డైరెక్టర్ ల కథలు మన సినిమా రంగంలో కోకొల్లలు.




ఎప్పుడో ఎవరో పెద్ద హీరోతో సినిమా తీసిన వారు ఇప్పుడు అనామకుల డేట్ ల కోసం వెంపర్లాడడం చూస్తోనే ఉన్నాం. ఇప్పుడు శ్రీను వైట్ల పరిస్థితి త్రిశంకు స్వర్గంగా మారింది. ఆగడు లాంటి భారీ ప్లాప్ వచ్చిన తరవాత అయినా బుద్ది తెచ్చుకుని బ్రూస్ లీ కి సరైన స్క్రిప్ట్ రాసుకోలేదు వైట్ల. నిజానికి చరణ్ కూడా ఇచ్చిన మాట తప్పకూడదు అనే ఉద్దేశ్యంతో వైట్ల కి అవకాశం ఇచ్చాడు.




ఆగడు లాంటి చిత్రం తరవాత వైట్ల లెక్కలు మారిపోయాయి అదే సమయంలో కోనా వెంకట్ లేకపోవడం వల్లనే అని అంతా అన్నారని ఆ కోనా వెంకట్ నీ - వైట్ల నీ కలిపి మరీ చరణ్ ఈ కొత్త సినిమా తీసాడు. అయినా బ్రూస్ లీ ఫలితం ఆగడు కంటే ఘోరంగా ఉంది. ఇప్పుడు బ్రూస్ లీ తరవాత శ్రీనువైట్ల భవిష్యత్తు ఏంటి అనేది చాలామందికి ఉదయించే ప్రశ్న.




సెకండ్ లైన్ హీరోలు అయిన విష్ణు, నాగ చైతన్య, రామ్ లాంటి వారు ఈ పరిణామాన్ని చేజిక్కించుకునే ఆలోచనలో ఉన్నారు. బ్రూస్ లీ ప్లాప్ తో ఒకరకంగా వారు సంతోష పడ్డారు. నాగార్జున పెద్ద కొడుకు ఏకంగా శ్రీను వైట్ల ని కలిసి ఆయనతో సినిమా తీయడానికి సిద్దం అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు అని టాక్ నడుస్తోంది. ఇంకా శ్రీను లో తడి ఉంది అని నమ్ముతున్నారు వీరంతా.


మరింత సమాచారం తెలుసుకోండి: