తెలుగు ఇండస్ట్రీలో నందమూరి హీరోలు ఏం చేసినా అది సెన్సేషన్ అవుతుంది.. ఇప్పుడు బాలకృష్ణ ‘డిక్టేటర్ ’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఈ సినిమా షూటింగ్ షరవేగంగా జరుగుతుంది.  వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ మొదటి పోస్టర్ విడుదల చేసింది. నందమూరి అభిమానులను ఆకట్టుకునేలా ఉంది ఈ పోస్టర్ కి మంచి క్రేజ్ వచ్చింది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. మరో ప్రక్క ఆడియోని రెడీ చేసి, డిసెంబర్ 20న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి థమన్‌ సంగీతం అందిస్తున్నారు.

ఇది బాలకృష్ణకు 99వ చిత్రం కావడం విశేషం. ‘డిక్టేటర్ ’ సినిమాలో  ‘అరేయ్ నీ హిస్టరీలో బ్లడ్ ఉందేమో నా బ్లడ్‌లోనే హిస్టరీ ఉంది.. , మద్యం తాగితే ఆరోగ్యానికి హానికరం.. నాలాంటి వాన్ని రెచ్చగొడితే జీవితానికే ప్రమాదకరం’ లాంటి డైలాగులు సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేశాయి. తాజాగా డైరెక్టర్ శ్రీవాస్ ని బాలకృష్ణ భలే ఏడిపించాడు..! ఆ... ఏడిపించాడంటే నిజంగా కాదండోయ్ ఫన్నీ గా  డైరెక్టర్ ను ఆటపట్టించాడు.

‘డిక్టేటర్ ’ చిత్రంలో బాలకృష్ణ


బాలకృష్ణ , శ్రీవాస్ కాంబినేషన్ లో 'డిక్టేటర్ ' రూపోందుతున్న సంగతి తెలిసిందే..ప్రస్తుతం ఈ షూటింగ్  డీల్లీ లో జరుపుకుంటుంది. మంగళవారం  డైరెక్టర్ శ్రీవాస్ పుట్టిన రోజు  సంధర్భంగా యూనిట్ సమక్షంలో కేక్ కట్ చేసి బర్త్ డే జరుపుకున్నాడు శ్రీవాస్ ఇక  బాలయ్య చిన్నపిల్లాడిలా  డైరెక్టర్ మొఖానికి కేక్ పూసి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇక బాలకృష్ణ అల్లరికి తోడుగా అంజలి కూడా మొఖాన్ని కేక్ తో నింపేసింది..వీరికి తోడు మిగతా నటీనటులు కలవడంతో సెట్ లో శ్రీవాస్ బర్త్ డే వేడుకలు సందడి సందడి గా జరిగాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: