పులి సినిమాతో ఆడియెన్స్ కి షాక్ ఇచ్చిన విజయ్ ఆ సినిమాతో భారీ మూల్యాన్నే చెల్లించుకున్నాడు. ప్రస్తుతం ఓ హిట్ సినిమా పడితేనే మళ్లీ తిరిగి పోయిన పరువు దక్కేలా లేదు. ప్రస్తుతం విజయ్ చేస్తున్న సినిమా 'తెరి'. మొదటి సినిమా అయినా రాజా రాణి అంటూ వచ్చి సూపర్ హిట్ కొట్టిన అట్లి డైరక్షన్లో ఈ సినిమా వస్తుంది. కొద్ది గంటల క్రితం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. పండుగ సందర్భంగా ఈరోజు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి విజయ్ ఫ్యాన్స్ కి గిఫ్ట్ ఇచ్చాడు.


పులి సినిమా అవమాన భారంతో రాబోయే ఈ సినిమా మొదటి లుక్ రిలీజ్ చేసే దాకా బయటకు మ్యాటర్ ఏమి తెలియనివ్వలేదు. అంతేకాదు సినిమా సడెన్ గా సంక్రాంతి రిలీజ్ కు సిద్ధమైంది. పులి వచ్చి నెల రోజులు కూడా కాలేదు అప్పుడే మూడు నెలల్లోనే విజయ్ మరో సినిమా రావడమంటే అదే పెద్ద సెన్షేషనే. ప్రస్తుతమ్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా పొంగల్ వార్లో నిలుస్తుంది. తన సినిమా మొదటి లుక్ తో షాక్ ఇచ్చిన విజయ్ చూస్తుంటే ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకునేలా ఉన్నాడు.


విజయ్ తెరి మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ :


రిలీజ్ చేసిన పోస్టర్స్ లో మూడు డిఫరెంట్ క్యారక్టర్స్ లో కనిపిస్తున్న విజయ్ ని చూస్తుంటే సినిమాలో మూడు పాత్రల్లో నటించి ఉంటాడని అనిపిస్తుంది. అయితే వాటిలో ఒకటి పోలీస్ అన్నది మాత్రం రివీల్ అయ్యింది. మాములుగా విజయ్ పోలీస్ గా నటించిన అన్ని సినిమాలు కోలీవుడ్లో విజయ డంఖా మోగించాయి ఆ సెంటిమెంట్ తో పోల్చితే 'తెరి' సినిమా మరోసారి రికార్డులను తిరగరాయడం ఖాయం అనిపిస్తుంది.


అయితే రజిని 'కబాలి' కూడా పొంగల్ వార్లో రిలీజ్ కి రెడీ అవుతుండగా ఆ సినిమాకు పోటీగా ఇలయదళపతి విజయ్ సినిమా రావడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. అట్లీ మీద ఉన్న నమ్మకంతో సినిమాను 'కబాలి'కి పోటీగా రంగంలో దించుతున్నారు. పులి ఫ్లాప్ తో విజయ్ కూడా ఈ సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలనే ఊపుమీదున్నాడు. మరి కబాలి, తెరి సినిమాల పోరులో ఏ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందో చూడాలి. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో సమంత, ఎమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: