సూపర్ స్టార్ మహేష్ బాబు..  రికార్డుల సునామి సృష్టించిన టాలీవుడ్ రాజకుమారుడు.. అలాంటి ఆయనకు స్టోరీల మీద పట్టులేదంటూ మీడియా వారు రచ్చ చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అసలు విషయం ఏంటంటే ప్రస్తుతం బ్రహ్మోత్సవం సినిమా చేస్తున్న మహేష్ ఆ సినిమా తర్వాత మురుగదాస్ తో ఓ సినిమా కమిట్ అయ్యాడు. అత్యంత భారీ బడ్జెట్ తో ఆ సినిమా తెరకెక్కుతుందని తెలిసిందే. అయితే మహేష్ శ్రీమంతుడు సినిమా చేస్తున్న టైంలోనే ఇష్క్, మనం లాంటి బ్యూటీఫుల్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన విక్రం ఓ కథ చెప్పాడట.


విక్రం చెప్పిన కథ నచ్చిన మహేష్ కథలో కొన్ని చేంజెస్ చేయమని అన్నాడట. మొదటి భాగం బాగా నచ్చినా సెకండ్ ఆఫ్ అంత పట్టు లేదని మార్చి తెమ్మన్నాడట విక్రంతో.. అయితే రెండవ భాగం మార్చలేదు సరి కదా ఆ సినిమాను మహేష్ నుండి సూర్యకి షిఫ్ట్ చేశాడు డైరక్టర్ విక్రం. సూర్య డేట్స్ సాధించి స్టోరీ చెప్పగానే బాగా నచ్చిన సూర్య తన బ్యానర్లోనే ఈ సినిమా నిర్మించడం విశేషం. అయితే సూర్య కథలో ఉన్న కాన్సెప్ట్ ని ఇట్టే కనిపెట్టి అది కచ్చితంగా వర్క్ అవుట్ అవుతుందని ఓకే చేశాడు కాని మహేష్ మాత్రం అలా కాకుండా సారీ చెప్పాడు.


సూర్య 24 సినిమా ఫస్ట్ లుక్ :


దీన్నిబట్టి మహేష్ కు కథల ఎంపికలో అంత పట్టులేదనే విషయం మనకు అర్ధమవుతుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన సూర్య 24 సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమా గ్యారంటీ హిట్ అనేట్టుగా ఉంది. టైం సెన్స్ తో కూడిన సైన్స్ ఫిక్షన్ కథ అంటూ ప్రచారం జరుగుతుంది. ఇష్క్, మనం లాంటి సినిమాల హిట్ గా మలిచినా సరే విక్రం మీద నమ్మకం పెట్టలేకపోయాడు మహేష్. అయితే అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే సూర్య 24లో హీరో మహేష్ అయి ఉండేవాడు. ఎంత మంచి చాన్స్ ని మహేష్ మిస్ చేసుకున్నాడా అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అయితే సినిమా వచ్చి అది కాస్త సూపర్ హిట్ అయితే ఆ బాధ ఇంకా పెద్దదయ్యే చాన్స్ ఉంది.


ప్రస్తుతం బ్రహ్మోత్సవం సినిమా చేస్తున్న మహేష్ మురుగదాస్ కథకి బాగా కనెక్ట్ అయ్యాడట. ఇంతకుముందు దాస్ తో సినిమా చేద్దామని అనుకున్నా వేరు వేరు కారణాల వల్ల చేయడం కుదరలేదు. ప్రస్తుతం బ్రహ్మోత్సవం కంప్లీట్ చేశాక కాని ఆ సినిమాపై దృష్టి పెట్టే చాన్స్ ఉంది. సమంత, కాజల్, ప్రణిత హీరోయిన్స్ గా చేస్తున్న బ్రహ్మోత్సవం సినిమాను సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు డైరక్టర్ శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తుండగా.. పివిపి బ్యానర్లో పొట్లూరి వర ప్రసాద్ నిర్మిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: